విద్యార్థులు లక్ష్యం పెట్టుకొని చదువుకుంటే విజయం సాధిస్తారు.
- ఇంపాక్ట్ ట్రైనర్ మద్దినేని అర్జున్.
![]() |
| విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేస్తున్న తట్ర భీమారావు. |
ScvNewsKasipet:--
పదవ తరగతి విద్యార్థులు లక్ష్యం పెట్టుకుని ప్రణాళిక బద్దంగా చదువుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని ఇంపాక్ట్ ట్రైనర్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు మద్దినేని అర్జున్ అన్నారు.
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీలోని జిల్లా పరిషత్, గిరిజన ఆశ్రమ పాఠశాల లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎలా రాయాలో సోమవారం సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను ఉద్దేశించి మద్దినేని అర్జున్ మాట్లాడుతూ విద్యార్థులు భయపడకుండా ధైర్యంగా చదువుకొని పరీక్షలు రాయాలని కోరారు. విద్యార్థులు పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించేందు కు ఎలా చదవాలో విద్యార్థులకు మెలుకువలు నేర్పించారు. జీవితంలో విద్యార్థులు ఎన్ని ఒడిదుడుకులైన తట్టుకొని ఎలా జీవించాలో, సమాజానికి కుటుంబానికి ఎలా పేరు తేవాలో పలు ఉదాహరణలతో వివరించారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు పదవ తరగతి పరీక్షలలో విజయం సాధించాలని సామాజిక చైతన్య వేదిక అవగాహన తరగతులు నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు. విద్యార్థులు ఉన్నత విద్య వంతులు కావాలంటే లక్ష్యాన్ని పెట్టుకొని చదువు కోవాలని , కాలాన్ని వృధా చేయవద్దని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నాయక్ పోడ్ సేవా సంఘం రాష్ట్ర నాయకుడు తట్ర భీమ్రావు ప్యాడులు, పెన్నులు బహుకరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి భీమ్రావు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాల కనుగుణంగా ఉన్నత విద్యావంతులు అయ్యేందుకు కష్టపడాలన్నారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఏకాగ్రతతో మనసుపెట్టి చదివి ఉత్తీర్ణులు కావాలని కోరారు.
సామాజిక చైతన్య వేదిక సభ్యుడు మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఆరోగ్యాన్ని కూడా కాపాడు కోవాలని శాఖాహార భోజనం చేస్తూ నీరు ఎక్కువ తీసుకోవాలని సూచించారు.
విద్యా కమిటీ అధ్యక్షుడు కురిసింగ నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులంతా మోటివేటర్ అర్జున్ చెప్పిన విషయాలపై అవగాహన పెంచుకొని అందరూ పాస్ కావాలని కోరారు.
పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ సామాజిక చైతన్య నివేదిక ఏర్పాటు చేసిన అవగాహన సమావేశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన సామాజిక చైతన్య వేదికకు అభినందనలు తెలిపారు.
సమావేశానికి సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు అధ్యక్షత వహించారు. బాపు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దాత తట్ర భీమ్రావుకు సామాజిక చైతన్య వేదిక తరపున ధన్యవాదాలు తెలిపారు.








