మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెండింగ్ వేతనాలు చెల్లించాలని సఫాయి కార్మికుల వినతి.

పేద కార్మికుల వేతనాలు

చెల్లించని స్థితిలో తెలంగాణ

ప్రభుత్వం.

 పెండింగ్ వేతనాలు చెల్లించాలని సఫాయి కార్మికులు ఎంపీడీవోకు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం.

Scv News Kasipet:--

గ్రామాలలోని మురికి కాలువలను, వీధుల్లోని చెత్తను నిత్యం ఏరివేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న సపాయి కార్మికులు గత నాలుగు నెలలుగా వేతనాలు అందక ఆకలితో అలమటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశుద్ధ కార్మికులతో పాటు, లైబ్రరీలోని కాంట్రాక్టు కార్మికుల వేతనాలు కూడా గత నాలుగు నెలలుగా చెల్లించడం లేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలోనే ధనిక రాష్ట్రంగా మారిందని ఊదరగొడుతున్న  ప్రజాప్రతినిధులు నాయకులు పేద కార్మికుల వేతనాలు సకాలంలో ఎందుకు చెల్లించడం లేదో సమాధానం చెప్పాలి.  కాసిపేట మండలంలోని ముత్యంపల్లి, చిన్న ధర్మారం గ్రామ పంచాయతీ MPW వర్కర్ల జీతాలు గత 5 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ఈ రోజు ఎంపీడీవో కు వినతి పత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముత్యం పల్లి మరియు చిన్న ధర్మారం గ్రామ పంచాయతీ MPW వర్కర్ లు మల్లేష్, కరీం, తిరుపతి, లక్ష్మణ్,మల్లేష్, చెంద్రయ్య, లక్ష్మి  గార్లు పాల్గొన్నారు.