మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పెద్దన పెళ్లి పంచాయతీలో పోషక ఆహార పక్షోత్సవ వారోత్సవాలు.

 పెద్దనపల్లి పంచాయతీలో పోషక ఆహార పక్షోత్సవ వారోత్సవాలు.

 
Scv News Kasipet:--

 కాసిపేట మండలం లోని పెద్దనపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని సోమగూడెం న్యూ కాలని లోని అంగన్వాడీ సెంటర్ లో గురువారం పోషక ఆహార పక్షోత్సవ వారోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న  సర్పంచ్ వేముల కృష్ణ  మాట్లాడుతూ గ్రామంలోని గర్భిణిలు, బాలింతలు ,తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహారం అంత కలుషిత మైన ఆహారం దొరుకుతుంది కాబట్టీ  పాతకాలంలోని మహిళలు పెద్ద లు ఎంతో మంది పిల్లలను కన్నప్పటికీ  ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే ఆహారం లో ఎక్కువగా  చిరు ధాన్యాలు , పప్పు దినుసులు, సజ్జలు,కొర్రలు, రాగులు,సామలు, అవిసెలు,అరిగెలు లాంటివి మరియు మంచి ఆకుకూరలు తినేవారు కాబట్టి పిల్లలు కూడా ఆరోగ్యంవంతంగా ఉన్నారు మీరు కూడా ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాలని అలాగే  ఇప్పుడు మీరు కూడా అంగన్వాడి సెంటర్ కి రోజు వచ్చి ఎగ్స్,పాలు,బాల ఆమృతం,లాంటి ఐరన్ ఫుడ్ తీసుకొని మహిళలు ఆరోగ్యంగా ఉండాలని ఉంటేనే గ్రామం అంత కూడ ఆరోగ్యంగా వంతంగా  ఉంటుందని తెలిపారు. మండల సూపర్ వైజర్ రాధిక గారు కూడ వివరంగా తెలియజేసి ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు కొత్త రమేష్, బొల్లపల్లి కొమురక్క, అంగన్వాడి టీచర్స్ వకుళాదేవి, మరియు జ్యోతి లత,సుజాత గ్రామ గర్భిణిలు,బాలింతలు,తల్లులు పాల్గొన్నారు.