ఘనంగా మలకపల్లి ఆశ్రమ పాఠశాల 49 వ వార్షికోత్స వం.
![]() |
| పాఠశాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ ఎంపీపీ జంగు భార్య పేరిట నిర్మించిన కళావేదికను ప్రారంభిస్తున్న ఎంపీపీ రోడ్డ లక్ష్మి. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం మలకపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల 49 వార్షికోత్సవం మంగళవారం రాత్రి ఘనంగా జరిగింది. స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని గిరిజన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు డప్పు వాయిద్యాలతో ఎంపీపీ రోడ్డు లక్ష్మి ని ఏ టి డబ్ల్యూ ఓ నీలిమ మేడం ను అతిథులుగా వచ్చిన ఐటీడీఏ ఉపాధ్యాయ బృందాన్ని ఊరేగింపుగా వేదిక మీదికి తీసుకువచ్చారు. పాఠశాల స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మాజీ ఎంపీపీ సిడం జంగు సతీమణి పేరిట పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అజ్మీర నరసింహ ఆధ్వర్యంలో నిర్మించిన వేదికను ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జంగులు ప్రారంభోత్సవం చేశారు. తదనంతరం పాఠశాల వార్షికోత్సవ నివేదికను, స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పాఠశాల పనితీరును ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, మల్కపల్లి సర్పంచ్ లక్ష్మి, ఐటీడీఏ బృందం పాల్గొన్నారు. ఐటీడీఏ పాఠశాల చిన్నారులు ఆంగ్ల భాష మాట్లాడడం, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

