నిరుద్యోగుల నిరసన ర్యాలీకి వెళ్తు న్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
![]() |
| కాసిపేట పోలీసుల అదుపులో కాంగ్రెస్ నాయకులు |
Scv News Kasipet :--
తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్న పత్రాల లీకేజ్ కి నిరసనగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఏఐసిసి సభ్యుడు ప్రేమ్సాగర్ రావు ఆధ్వర్యం లో నిరుద్యోగ నిరసన కార్యక్రమానికి బయలుదేరుతున్న కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులను గురువారం కాసిపేట పీఎస్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగినది.ఈ సందర్భం గా మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాట్లాడుతూ టి ఎస్ పి ఎస్ పి పేపర్ లీక్ అవడం వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని,అధికార బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వారి స్వలాభం కోసం ఇలాంటి అక్రమాలకు పాల్పడు తున్నారని అలాగే ప్రజలకోసం పని చేయాల్సిన పోలీసులు బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి కార్యకర్తలలాగా వ్యవహరిస్తున్నారని, ఎన్నో ఉద్యమాలు చేసి స్వేచ్ఛ కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి అక్రమ అరెస్టులతో పోరాటాలను ఆపలేరని, ఇలాంటి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ఉధృతంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, సోమగుడెం ఉప సర్పంచ్ కనుకుల రాకేష్,ఎస్ సి సెల్ మండల అధ్యక్షులు గోలేటి స్వామి,వార్డు మెంబెర్ కొత్త రమేష్,నాయకులు మైధం రమేష్,జాడి శివ, వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.
