మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పేదరిక నిర్మూలనకు చదువే ప్రధానం. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

 పేదరిక నిర్మూలనకు చదువే ప్రధానం.

- బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య .

 కాలేజీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.







Scv News Kasipet:--

గ్రామీణ ప్రాంతంలోని పేద వర్గాలు ఉన్నత స్థాయికి చేరాలంటే చదువు తూనే సాధ్యమవుతుందని  బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీ విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలోకి రావాలంటే  తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని కోరారు.విద్యార్థులు తమ తల్లితండ్రులు కష్టపడి ఈ స్థాయికి తెచ్చి కాలేజీలకు పంపిస్తే సమయాన్ని వృధా చేయకుండా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తేవాలని కోరారు. ఉపాధ్యాయు లు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని ఏకాగ్రతతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలని కోరారు. చదువుపై నిర్లక్ష్యం వహించిన యువకులు నేడు  ఆటో డ్రైవర్లుగా కూలి పని చేసుకుంటూ మన కళ్ళ ముందు  దీనమైన జీవితం గడుపు తున్నారని అన్నారు. పేదరికం నుండి చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లిన అధికారుల గురించి విద్యార్థుల కు వివరించారు. ఈ విద్యా సంవత్సరం లో కాలేజీ విద్యార్థులు తమ ఫలితాలు సాధిస్తే వచ్చే సంవత్సరం డిసెంబర్ నుండి మళ్లీ మధ్యాహ్న భోజనం పెట్టిస్తానని హామీ ఇచ్చారు.

కాలేజీ ప్రిన్సిపల్ రవీందర్ మాట్లాడుతూ గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మధ్యాహ్న భోజనం పెట్టించడం వల్ల కాలేజీలో విద్యార్థుల గైరాజరు శాతం తగ్గిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కాలేజీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. గత మొదటి సంవత్సరం ఇంటర్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అభినందిన, అర్చితా శివకుమార్ లకు ఎమ్మెల్యే ద్వారా  మెమొంటోళ్లు అందజేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దండేపల్లి, మందమర్రి, చెన్నూర్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్ శోభారాణి, కృష్ణయ్య, నాగచందర్ లు విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే మంచిగా చదువుకోవాలని వ్యక్తిత్వం వికాస పాఠాలు చెప్పారు.

మహిళా దినోత్సవ కార్యక్రమం .


అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో కాలేజీ మహిళ లెక్చరర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా దండ పెళ్లి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శోభారాణిని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శాలువాతో సన్మానించారు. కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించినందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పల్లె చంద్రయ్య, ఎంపీటీసీలు అక్క పెళ్లి లక్ష్మీ రాంచందర్లు, బిఆర్ఎస్ పార్టీ  మండల అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు  తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.