మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం.

కొండాపూర్ లో బి ఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.

 కొండాపూర్ యాపలో  జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంచిర్యాల జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణరావు 

 కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య



Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని కొండాపూర్ యాపలో  ఈరోజు బి ఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళ నం జరిగింది. మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమ్మేళనానికి తరలివచ్చారు. వారిని ఉద్దేశించి జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో  టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశంలో గ్రంధాలయ చైర్మన్ రేణిగుంట ప్రవీణ్, ఎంపీపీ రోడ్డు లక్ష్మీ జెడ్పిటిసి పల్లె చంద్రయ్య వైస్ ఎంపీపీ విక్రం రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంజుల రెడ్డి,అప్పల శేఖర్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోషం, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, ఎంపీటీసీలు సర్పంచులు, పార్టీ నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.