మా నౌకర్లు మాకు కావాలి నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేయండి.
Scv News Kasipet --:
తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్న పత్రాల లీకేజ్ కి నిరసనగా రేపు హైదరాబాదు లో జరిగే మహా ధర్నాను విజయ వంతం చేయాలని కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు బిజెపి నాయకులు పిలిపించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో బిజెపి మండల ఇన్చార్జి అట్కాపురం రమేష్, మండల బిజెపి ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్ లు మాట్లాడుతూ tspsc పరీక్షలు రాసిన అభ్యర్థులకు లక్ష రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని tspsc పేపర్ లీకేజీ పైన సిట్టింగ్ జేజితో విచారణ సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ కి నైతిక బాధ్యత వహించి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. రేపు జరగబోయే నిరుద్యోగ మహాధర్నా కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అంతా కూడా వచ్చి ధర్నా చౌక్ ఇంద్ర పార్క్వద్ద నిర్వహించే నిరుద్యోగ మహాధర్నాను విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్, మహిళా మోర్చా మండల ఉపాధ్యక్షురాలు దాగం లీల, ఎస్సీ మండల అధ్యక్షులు దుర్గం దుర్గయ్య, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి సురేష్, బిజెపి మండల నాయకులు రాపర్తి కిష్టయ్య, ఆయిలి సురేందర్, గొలేటి సుమన్, తదితరులు పాల్గొన్నారు.
