భారత జాగృతి ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి.
Scv News Kasipet :--
కాసిపేట మండల కేంద్రంలో భారత జాగృతి ఆధ్వర్యంలో ఈరోజు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 92వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత జాగృతి కాసిపేట మండల అధ్యక్షులు సోదారి సురేష్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది,
దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేసి.
చిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన మహనీయులు సుఖ్ దేవ్, రాజ్ గురు, భగత్ సింగ్ లని కొనియాడారు. వారి పోరాటాలను బలిదానాలను స్మరించుకుంటూ వారి చిత్రపఠలకు పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి గంగాధరి రాజ్ కుమార్,కోశాధికారి కనక వంశీ కృష్ణ,కార్యదర్శి ఆడే శేఖర్,కాసిపేట జీపీ అధ్యక్షులు దుర్గం శేఖర్,జాగృతి సభ్యులు గేడం లక్ష్మణ్,కుంరం వెంకటేష్,గేడం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
