మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలం దుబ్బ గూడెం గ్రామంలో పత్తి సరైన గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరసన




 
పత్తి కొనుగోలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు.

 మద్దతు ధర చెల్లించాలని రైతుల నిరసన.

 గిట్టుబాటు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేయాలని రైతుల నిరసన.
Scv News Kasipet:--

 రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పత్తికి గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయక పోవడంతో కాసిపేట  మండలం లోని వివిధ గ్రామాలలో రైతుల ఇండ్లలో క్వింటాళ్ల కొద్ది పత్తి నిలువ ఉంది. పత్తి పంటకు వేలాది రూపాయల అప్పులు తెచ్చి ఎరువులు పురుగు మందులు కూలీలకు ఖర్చులు పెట్టి పండిస్తే సరైన గిట్టుబాటు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంటకు సరైన గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కాసిపేట మండలం  దుబ్బగూడెంలో  T J A S నాయకులు గోనెల శ్రీలత - శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో రైతులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్ మాట్లాడు తూ పత్తి ప్రారంభ దశలో మంచి గిట్టుబాటు ధర వచ్చిందని క్రమక్రమం గా వ్యాపారులు సిండికేట్ అయి ధరను పతనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కోసం సీసీఐ  ద్వారా కొనుగోలు చేయకుండా వ్యాపారులకు వత్తాసుగా నిమ్మ కుంటుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి టిఆర్ఎస్ నాయకులు జోక్యం చేసుకొని పత్తి ధర 12 వేలకు తగ్గకుండా కొనుగోలు చేసేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు Tjas జిల్లా యువజన నాయకులు M D సిరాజ్ , బోగ రమేష్  మరియు ప్రజా సంఘాల నాయకులు బోగే పోషన్న, వైఎస్సార్సీపీ నాయకులు కవిరాజ్  రైతులు గోనె లచ్చయ్య,రాంటెంకి బానేష్,దుర్గం గోపాల్,దుర్గం లచ్చాయ్యా, దుర్గం భూమయ్య,దుర్గమ్మ, దూట లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.