కాసిపేట మండలంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జయంతి వేడుకలు.
Scv News Kasipet :--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి కేసీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకల్లో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ప్రెసిడెంట్ విక్రం రావు, టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు రమణారెడ్డి, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి ల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో ఘనంగా జరిగాయి.
ముత్యం పెళ్లి గ్రామ పంచాయతీలో...
సర్పంచి ఆడే బాదు, ఉప సర్పంచ్ బోయిన తిరుపతి వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రావు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గురువాపూర్ లోని గిరిజన యువతకు వైస్ ప్రెసిడెంట్ విక్రం రావు వాలీబాల్ కిట్లను ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి రౌత్ సత్తయ్య టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు. గ్రామ కమిటీ అధ్యక్షులు మద్దినేని వేణు, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు లంక లక్ష్మణ్ వాసుదేవ్ మేడ సమ్మయ్య దుర్గం రామచందర్,ఉస్కెమల్ల గోపాల్ దేవేందర్లు పాల్గొన్నారు..
ధర్మారావుపేట పంచాయతీలో..
ధర్మారావుపేట్ పంచాయతీలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి - సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కెసిఆర్ జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ముర్ల లింగయ్య బట్టు కిరణ్ దానవీని శ్రీనివాస్ తో పాటు మరికొందరికి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు బాణాల సత్యనారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
లంబడి తండా డి పంచాయతీలో...
లంబాడి తండా డి పంచాయతీ పరిధిలోని నాయక కూడా లో కెసిఆర్ జన్మదిన వేడుకలను మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏలూరు సుధాకర్ రెడ్డి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు తదానంతరం మొక్కలు నాటడం జరిగింది. మహిళలకు చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మంగ శ్రీకాంత్, బద్రి నాయక్ చేదం మధుకర్ మరపు వెంకటేష్ పల్లె శ్రీను మంచాల శ్రీను చుంచు కుమార్, బెంగాల్ తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట పంచాయితీలో...
కాసిపేట పంచాయతీలో కెసిఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కేకును సర్పంచి దేవి, ఎంపీటీసీ అక్క పెళ్లి లక్ష్మీ- బుగ్గరాజు , టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య లు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బడవత్ రాంచందర్, దాడి పెంటయ్య, దాసరి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.






