జాతీయస్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్ వడ్లూర్ ప్రణీత్ కు సన్మానం.

దేవాపూర్ అంబేద్కర్ భవన్లో బ్యాడ్మింటన్ ఛాంపియన్ వడ్లూరు ప్రణీత్ కు సన్మానం.
ScvNews Kasipet :--
తెలంగాణ రాష్ట్రం తరఫున ఇటీవల గోవా రాష్ట్రంలోని మేడ్ఘంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ నేషనల్ స్పోర్ట్ మీట్ 2023లో బ్యాడ్మింటన్ సింగిల్ ఛాంపియన్ షిప్ సాధించిన కాసిపేట మండలం దేవపూర్ నివాసి వడ్లూరి ప్రణీత్ ను ఈరోజు దేవాపూర్ లోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా సన్మానం చేశారు. కాసిపేట మండలం అంబేద్కర్ యువజన సంఘం నుండి పెద్ద ఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అందరూ మరియు దేవాపూర్ ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేశారని సంఘసభ్యులకు ప్రజలందరికీ అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు జాడి రాంచందర్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.