దేవాపూర్ లో కొమురం భీం విగ్రహ స్థాపన దినోత్సవం.
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవపూర్ గ్రామపంచాయతీలో మాజీ సర్పంచ్ కొడప ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం అంగడి బజార్ చౌరస్తాలో కొమరం విగ్రహాన్ని స్థాపించారు. ఈరోజు కొమరం భీం విగ్రహ స్థాపన దినోత్సవం ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కొమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మెరుగు పద్మ, మాజీ జెడ్పిటిసి మడావి కేశవరావు, మాజీ సర్పంచ్ మాడవి విజయ, టిఆర్ఎస్ నాయకులు గడ్డం పురుషోత్తం,బింగి శ్రీనివాస్, ఆర్ఎంపీ వైద్యులు కురిసింగ మహేష్, మడావి ప్రవీణ్, కొడప లలిత పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
