మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మిత్రుని కుటుంబానికి పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహాయం.

 మిత్రుని కుటుంబానికి పదవ తరగతి పూర్వ విద్యార్థుల సహాయం.

 భోగ రాజశేఖర్ కుమార్తె పేరు మీద 32 వేల రూపాయలను సుకన్య పథకం ద్వారా ఫిక్స్డ్ చేసిన పదవ తరగతి మిత్రులు  

Scv News Kasipet :--

 కాసిపేట మండల కేంద్రానికి చెందిన భోగ  రాజ శేఖర్ గత జనవరి 6వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో తనతో చదువుకున్న పదవ తరగతి మిత్రులు కుటుంబానికి అండగా నిలిచారు. మిత్రులంతా  జమ చేసిన చేసిన విరాళాలు రూ. 32,000 రాజశేఖర్ కూతురు పేరు మీద పోస్ట్ ఆఫీస్ లో సుకన్య ఖాతాలో ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసిన సర్టిఫికెట్లను కాస్పేట పోస్టుమాస్టర్ గడపక భూమన్న చేతిలో మీదుగా అతని తల్లికి అందజేశారు.