భారత్ కాలనిలో కాంగ్రెస్ హాత్సే హత్ జోడో యాత్ర.
![]() |
| సోమ గూడెంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు. |
![]() |
| భరత్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేస్తున్న ఉపసర్పంచ్ ప్రవీణ్ |
Scv News Kasipet:--
బెల్లంపల్లి నియోజకవర్గంలో పిసిసి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ఈరోజు బెల్లంపల్లి మండలం సోమగూడెంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జరిగింది.ఎఐసిసి సభ్యులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి మరియు మంచిర్యాల డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ.కొక్కిరాల సురేఖాప్రేమ్ సాగర్ రావు మాజీ మంత్రి గడ్డం వినోద్ ఆదేశాల మేరకు భారత్ జోడో యాత్ర ను నిర్వహించామని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బెల్లంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకం మల్లేష్ అధ్యక్షతన భరత్ కాలనీ సోమగూడెం లో కాంగ్రెస్ పార్టీ జెండా వద్ద ఉపసర్పంచ్ ఆరెపల్లి ప్రవీణ్ జెండా ఎగురవేశారు.
అనంతర సోమగూడెం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వివరిస్తూ ముందుకుసాగడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ చాలా మందికి పింఛన్లు రావడం లేదని త్రాగు నీరు మరియు కరెంట్ రోడ్డు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం లో ఆరోగ్యశ్రీ తో మరియు 104,108,ఫీజు రీయంబర్స్మెంట్ తో సంతోషకరంగా ఉన్నామని అక్కడున్న ప్రజలు చెపుతూ అలాగే ఇప్పుడు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని మోదీ పాలనలో వంట గ్యాస్ ధర లతోపాటు డీజిల్ పెట్రోల్ ధరలు కూడా విపరీతంగా పెరిగయని పేద ప్రజలు బతకడమే చాలా కష్టంగా ఉందని కొత్త రేషన్ వచ్చిన వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తలేదని కాంగ్రెస్ హయాంలో తెల్ల రేషన్ కార్డులపై తొమ్మిది రకాల వస్తువులు వచ్చేవని ఇప్పుడున్న బిజెపి టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు ఏం న్యాయం చేయడం లేదని తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కాసిపేట మండల అధ్యక్షుడు వేముల కృష్ణ,మాజి అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, దూడం మహేష్ సీనియర్ నాయకులు పిసిసి సభ్యులు చిలుముల శంకర్,రొడ్డ శారద, బండి ప్రభాకర్,ముడిమడుగుల మహేందర్,తొంగల మల్లేష్,నాతరి స్వామి,ఆదర్శ్ వర్ధన్,గోలేటి స్వామి, పార్వతి మల్లేష్, పాల్గొన్నారు.

