మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సాచైవే ఆధ్వర్యంలో సత్యాన్వేషణ దినం.
![]() |
| సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో మల్కపెల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సత్యాన్వేషణ దినం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు నాయకులు. |
కాసిపేట మండలం మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు సత్యాన్వేషణ దినం ఘనంగా నిర్వహించారు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నదన్న కోపర్నిక సిద్ధాంతానికి మద్దతు ఇచ్చి నందుకు మతవాదులు సజీవ దహనం చేసిన గియార్డీనో బ్రూనో చిత్రపటానికి సామాజిక చైతన్య వేదిక నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భం గా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు డు వేములవాడ రమేష్ విద్యార్థు లను ఉద్దేశించి మాట్లాడుతూ
సైన్స్ వల్లనే మానవ ప్రగతి సాధ్యమైందని విద్యార్థులు చిన్నప్పటినుండి శాస్త్ర విజ్ఞానం పై దృష్టి సారించాలని అన్నారు. శాస్త్రవేత్తల జీవితాల కోసం తెలుసుకోవాలని కోరారు.
సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే సత్యాన్ని మద్దతు తెలిపినందుకు ఇటలీలో వైజ్ఞానికవేత్త గిఆర్డినో బ్రూనోను క్రైస్తవ మత పెద్దలు అమానుషంగా సజీవ దహనం చేశారన్నారు. అతని స్మృతి చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా సత్యాన్వేషణ దినంగా జరుపుకుంటున్నారని అన్నారు. బ్రూనో జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ మానవ ప్రగతి కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాలను అర్పించారన్నారు. శాస్త్రవేత్తల జీవితాలను విద్యార్థి దశ నుండి నేర్చుకొని విజ్ఞానవంతులు కావాలని విద్యార్థులను కోరారు. శాస్త్రవేత్తల ప్రాణ త్యాగాలపై పాట పాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు చిన్నమ్మ, లక్ష్మయ్య, రజిత, హరీష్ బద్ది శ్రీనివాస్ వార్డెన్ ఏదుల భీమయ్య తదితరులు పాల్గొన్నారు.



