భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందనే సత్యానికి మద్దతిచ్చినందుకు సజీవ దాహనానికి గురైన వైజ్ఞానిక వేత్త గీయారడినో బ్రూనో...
ప్రపంచం చరిత్రలో మానవజాతి మనుగడకు అడ్డంకిగా మారిన మత విశ్వాసాలను వ్యతిరేకిస్తూ మానవ ప్రగతికి మూలమైన శాస్త్రవేత్తలు ఎందరో మత మౌడ్యానికి బలైనారు. ఆ మహనీయుల త్యాగాలను నేటి తరాలకు తెలియజేసే 'ప్రపంచ సత్యాన్వేషణ దినం నేడు '
![]() |
| భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నది సత్య అన్నందుకు మతోన్మాదుల చేతిలో సజీవ దాహనమైన గీ ఆర్డి నో బ్రూనో. |
ఇటలీ నగరంలో వెలిసిన బ్రూనో నిలువెత్తు విగ్రహాలు
Scv News Kasipet:--
ఆదిమ కాలంలో అడవిలో ఆకులు, పండ్లు తిని బ్రతికే మనిషి, నుండి నేడు ఆధునిక మానవుడి గా అవతరణ చెంది విశ్వాంతరాల ను పరిశోధించే స్థాయికి ఎదిగాడు అంటే అది ప్రశ్నల ద్వారా, సైన్స్ వల్లనే సాధ్యపడింది . అనాదిగా ప్రజల అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని, పేదల శ్రమ దోపిడి చేస్తూ పరాన్న జీవులుగా బ్రతికే మతాలు, మత పెద్దలు తమ అందవిశ్వాసాలను, మతాచారాలను ప్రశ్నించడం తట్టు కోలేక పోయాయి.భూమి చుట్టూ సూర్యుడు ఇతర గ్రహాలు తిరుగు తున్నాయని వేల ఏళ్లుగా నమ్ముతున్న వారి విశ్వాసాన్ని పరిశోధనల ద్వారా శాస్త్రవేత్త కోపర్నికస్ మొట్టమొదటిసారి సూర్య కేంద్ర సిద్ధాంతం ద్వారా బద్దలు కొట్టారు.
సూర్యుని చుట్టూ భూమి ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనే సత్యం నిజమని నమ్మి కోపర్నికస్ సిద్ధాంతానికి ఖగోళ వైజ్ఞానికవేత్త బ్రూనో మద్దతు ఇచ్చాడు. "నక్షత్రాలన్నీ దూరంగా ఉన్న సూర్యులే అన్నాడు. ఈ విశ్వంలో భూమి లాంటి భూములు గ్రహాలు ఇంకా ఎన్నో ఉన్నాయన్నాడు. విశ్వానికి ఆది లేదు అంతం లేదు అన్నాడు. జీసస్ క్రైస్ట్ దేవుని కుమారుడు అనే దాన్ని అంగీక రించలేదు.కన్యగా ఉన్న మేరికి ఏసుక్రీస్తు ఎలా పుట్టాడని?"క్రైస్తవ మత పెద్దలను ప్రశ్నించాడు.బ్రూనో ప్రశ్నలు అప్పటి క్రైస్తవ మత ఉనికికే ప్రమాదం కావడంతో మత పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. బ్రూనోను బంధించి ఏడేళ్లు చీకటి గదిలో కఠిన కారాగార శిక్ష విధించి తన తప్పును ఒప్పుకోని క్షమాపణ చెప్పాలని కోరారు. బ్రూనో తాను చెప్పేది సత్యమని తన తప్పును ఒప్పుకోలేదు. " సత్యం ఎప్పటికీ సత్యమే, మెజారిటీ ప్రజలు నమ్మట్లేదు కదా అని సత్యం దాని నేచర్ మార్చుకోదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది అన్నది సత్యం" అని క్రైస్తవ మతాధికారులను ఆదేశాలను ధిక్కరించారు. ఆగ్రహం చెందిన మత పెద్దలు రోమ్ నగరంలో నడివీధిలో ప్రజల సమక్షంలో తలకిందులుగా వేలాడదీసి సజీవ దహనం చేశారు.
మహా తత్వవేత్త, వైజ్ఞానికుడు, కవి గీ ఆర్డినో బ్రూనో మతమౌఢ్యానికి బలి కావడం మానవ చరిత్రలో మాయని మచ్చగా మిగిలింది. బ్రూనోను అత్యంత కిరాతకంగా చంపడం తప్పు అని 300 ఏళ్ల తర్వాత క్రైస్తవ మత పెద్దలు గుర్తించి ప్రపంచానికి క్షమాపణ చెప్పారు. సజీవ దహనం చేసిన స్థలంలో స్మారక చిహ్నంగా బ్రూనో నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని వైజ్ఞానికులంతా కాల పరీక్షకు ఎదురు నిలిచిన విజేతగా విశ్వ మానవుడిగా బ్రూనో ను గుర్తించి అతడిని సజీవ దహనం చేసిన ఫిబ్రవరి 17 సత్యాన్వేషణ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపు కుంటున్నారు. ఆ మహనీయుడు త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి స్ఫూర్తి నేటి తరాలకు తెలియ చెప్పి చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మానవతావాదు లపై ఉంది. బ్రూనో జీవితము అతని త్యాగాలపై సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక కథనం అందిస్తుంది....
బ్రూనో జీవిత విశేషాలు..
క్రైస్తవ మతరాజ్యమైన ఇటలీలోని నెప్పుల్స్ నగరంలో గీఆర్డినో బ్రూనో 1548లో జన్మించాడు. తల్లిదండ్రులు క్రైస్తవ మతాభిమానులు కావడంతో చిన్నతనంలోనే క్రైస్తవ మిషనరీలో చేర్పించారు. చిన్నతనము నుండే చురుకైన వాడు కావడంతో క్రైస్తవ మత గ్రంథాలన్నీ చదివి ప్రచారకుడిగా మారాడు. మత ప్రచారం చురుగ్గా పాల్గొనడం తో క్రైస్తవ మత పెద్దలైన పోప్ అభిమానాన్ని పొందాడు.మత ప్రచారకుడిగా పాల్గొంటున్న క్రమంలోనే క్రైస్తవ మత గ్రంథాలన్నీ చదవడం పూర్తయిన తర్వాత క్రైస్తవాన్ని వ్యతిరేకించే,నిషేధించిన పుస్తకాలను కూడా చదవాడు. దీంతో ఆయనలో అనేక ప్రశ్నలు ఉద్భవించాయి. చిన్నప్పటినుండి ప్రశ్నించే స్వభావం కలిగిన బ్రూనోకు ఏసుక్రీస్తు పుట్టుక మీదనే అనేక అనుమానాలు తలెత్తాయి. కన్యగా ఉన్న మేరికి ఏసుక్రీస్తు ఎలా పుట్టాడని మత పెద్దలను ప్రశ్నించాడు.దానికి సమాధానం చెప్పలేని క్రైస్తవ మతపెద్దలు ఆగ్రహంతో బ్రూనోను క్రైస్తవ మిషనరీల నుండి వెళ్లగొట్టారు.
మిషనరీ నుండి బయటికి వచ్చిన బ్రూనో హేతువుకు నిలబడని అంద విశ్వాసాలను విడనాడి సత్యాన్వేషణ లో భాగంగా శాస్త్ర సాంకేతిక, ఖగోళ పరిశోధనలపై దృష్టి సాధించాడు. వివిధ యూనివర్సిటీ లో ఎన్నో ఉన్నత చదువులు చదివాడు.డెసినివో యూనివర్సిటీ నుండి డాక్టరేట్ కూడా పొందాడు .
భూ కేంద్ర సిద్ధాంతాన్ని తప్పు పట్టిన కోపర్నికస్
రెండవ శతాబ్దంలో ఖగోళ పరిశోధకుడు క్లాడియస్ టోలోమి భూమి చుట్టూ సూర్యుడు,ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి అనే భూకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పాడు. దీన్నే క్రైస్తవ మతంతో పాటు ఇతర మతాలు కూడా అనుసరిస్తూ ఉన్నాయి. భూమిని పవిత్రంగా భావిస్తూ సూర్యుడు ఇతర గ్రహాలు దాని చుట్టూ తిరిగే సేవకులుగా వివిధ మతాధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. 1400 సంవత్సరాలుగా ప్రజలు భూ కేంద్ర సిద్ధాంతాన్ని నమ్ముతూ వచ్చారు. ఈ నమ్మకాన్ని 16వ శతాబ్దంలో పోలెండ్ కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త కోపర్నికస్ ( 1473-1543 ) భూ కేంద్ర సిద్ధాంతం తప్పు భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు సూర్యుడు చుట్టే భూమితో పాటు ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదిం చాడు. కోపర్నికస్ దీన్ని సూటిగా చెప్తే మత పెద్దల అగ్రహానికి గురవుతానని తెలివిగా వ్యవహరించి అందరికీ అర్థం కాని, మేధావులకు మాత్రమే అర్థమయ్యే లాటిన్ భాషలో పుస్తకాలు రాశాడు. మళ్లీ ఇది నిరూపించ బడిన సిద్ధాంతమని కాకుండా అటు ఇటు కావచ్చు అని అనుమానాస్పదంగా చెప్పడంతో మతవాదులు పట్టించు కోలేదు.
కోపర్నికస్ చనిపోయిన తర్వాత ఐదేళ్లకు పుట్టిన బ్రూనో ఖగోళ శాస్త్ర పరిశోధనలో భాగంగా కోపర్నికస్ రాసిన పుస్తకాలని చదివి కోపర్నికస్ చెప్పినట్టుగా భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నాడని, ఆకాశంలో కనబడే నక్షత్రాలన్నీ దూరంగా ఉన్న సూర్యులేనన్నారు.నక్షత్ర మండలాల లో భూమి లాంటి గ్రహాలు ఇంకా ఎన్నో ఉన్నాయని, విశ్వానికి ఆది లేదు అంతం లేదని ప్రకటించారు. తాను పరిశోధించిన విషయాలన్నీ సత్యాలని సిద్ధాంతికరించాడు. కోపర్నికస్ అటు ఇటుగా చెప్పిన సూర్య కేంద్ర సిద్ధాంతం సత్యమని సూర్యుని చుట్టూ భూమి ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని కుండ బద్దలు కొట్టి బాహ్య ప్రపంచానికి తెలిపాడు. లాటిన్ భాషలో కాకుండా ప్రజలందరికీ అర్థమయ్యే ఇటలీ భాషలోనే తాను పరిశోధించిన పత్రాలను వెల్లడించాడు.ఇది ప్రపంచం లో కలకలం సృష్టించింది.విశ్వానికి సూర్యుడు కేంద్రమని చెప్పడం క్రైస్తవ మత ప్రచారకులకు ఆగ్రహం కలిగించింది.
సూర్యుడు కేంద్రమని ఒప్పుకుంటే భూమి దేవుడు సృష్టి కాదు అనే విషయం తెలిసి మత ఉనికికే ప్రమాదం అని గ్రహించారు. మత విశ్వాసాల ప్రశ్నించినందుకు బ్రూనోను విద్రోహక శక్తిగా ప్రకటించి శిక్షించాలని మత పెద్దలు నిర్ణయించా రు. అప్పటి కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు లేవు. మత పెద్దలే నిర్ణయాల మేరకే రాచరిక పరిపాలన సాగేది. మత విశ్వాసాలను దెబ్బతీసిన బ్రూనోను శిక్షించేందుకు రాచరిక పాలకులు ఆదేశాలు జారీ చేశారు. బ్రూనోను పట్టుకొని శిక్షించేందుకు ఇటలీ పాలకులు వేటాడడంతో ఆజ్ఞాతంలోకి వెళ్లాడు.
మతవాదుల దాడులకు భయపడి విదేశాలకు వెళ్లిన బ్రూనో.
బ్రూనో ఇటలీ వదిలి ప్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ దేశాలలోని యూనివర్సిటీలలో ఉపన్యాసాలు ఇచ్చాడు. తన సమకాలికుడైన గెలీలియోతో కలిసి ఖగోళ శాస్త్రం పై యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు బోధించాడు. ఖగోళ గణిత శాస్త్రవేత్త కాకుండా కవిగా బ్రునో ఎన్నో అద్భుత కవితలను రాశారు. అతను రాసిన కవిత పుస్తకాలు" కాలపు చిహ్నాలు, ఆలోచనల ఛాయలు, జ్ఞాపకాల కల,వృత్తి గీతం "లాంటివి ఎన్నో ఉన్నాయి. యూరప్ దేశాలలో తిరుగుతూ ఇటలీలోని పాడవ యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్ పదవి కోసం వెళ్లి 1592 ఇటలీ పాలకుల పట్టుబడ్డారు. ఇటలీ ప్రభుత్వం బ్రూనో రాసిన పుస్తకాలను, అతడు వివిధ యూనివర్సిటీలలో చేసిన ఉపన్యాసాలను సాక్షాధారాలుగా చేసుకొని మత విశ్వాసాలను దెబ్బతీశాడని నేరాన్ని నిర్ధారించాయి. ఏడేళ్లు చీకటి ఇరుకు గదిలో బంధించారు. ప్రతిరోజు బయటికి తీసి క్షమాపణ చెప్తే వదిలేస్తామని మత పెద్దలు చెప్పినా వినలేదు.
బ్రూనోను అమానుషంగా తలకిందులుగా వేలాడదీసి సజీవ దహనం చేశారు.
బ్రూనో మతవాదులకు క్షమాపణ చెప్పక పోవడంతో క్రైస్తవ మత పెద్ద అప్పటి పోపు క్లియంట్ -3 బ్రూనోను 20 జనవరి 1600 సంవత్సరంలో బహిరంగంగా ఉరిశిక్ష విధించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇది అమలు జరిగింది 17 ఫిబ్రవరి 1600 సంవత్సరంలో. ఇటలీలోని రూమ్ నగరంలో కాంపో - డి- పియోరి సర్కిల్ లోని పేద క్రైస్తవులు నిర్వహించే కాలనీ వద్ద అమలు చేశారు. బ్రునో లాగా మరి ఎవరు కూడా భవిష్యత్తులో మత విశ్వాసాలను దెబ్బతీయ కుండ ఉండేలా ప్రజల్లో బయోత్పాతం సృష్టించే విధంగా ఎత్తైన ప్రాంతంలో సజీవ దాహం చేసేందుకు నిర్ణయించా రు. బ్రూనోను జైలు నుండి బయటకు తీసుకు వస్తున్నప్పుడు ఏం నిజాలు చెప్తాడు అని మత పెద్దలు భయపడి నాలుకకు ఇనుప తీగలతో కట్టి ముసుగు వేసి బయటకు తెచ్చారు. రోమన్ సైనికులు నాలికకు చుట్టిన ఇనుప తీగను విప్పి ' మరో అవకాశం ఇస్తున్నాము నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటే మరణశిక్షను విధించడం నిలిపివేస్తామని మత పెద్దలు అవకా శం ఇచ్చారు ' అతడు క్షమాపణ చెప్తే తన ప్రాణాలు దక్కించుకునే వాడు. కానీ బ్రూనో తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి తన ప్రాణాలను కూడా లెక్క చేయని అమరవీరుడు .
"నేను చెప్పేది సత్యం, దాంట్లో వెనకడుగు వేసేది లేదు. మిమ్మల్ని నా మరణం భయపెట్టడం లేదు. నా మరణం కంటే ఎక్కువ భయపెట్టేది సత్యం. అదే మిమ్మల్ని భయపెడుతుంది, అందుకే మీరు నన్ను చంపడానికి భయపడుతున్నారు. నేను చనిపోయిన బ్రతికినా సత్యం, సత్యమే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్నది నిజం" అంటూ క్షమాభిక్షను తిరస్కరించాడు. బ్రూనో కు సైతాన్ ఆవహరించింది అలా మాట్లాడుతున్నాడు అంటూ మత పెద్దలు ఎత్తైన ప్రదేశంలో అందరికీ కనబడేలా తలకిందులు గా వేలాడదీసి సజీవ దాహనం చేశారు. మత మూఢత్వానికి వైజ్ఞానిక వేత్త గణిత ఖగోళ శాస్త్రవేత్త, కవి తాత్వికుడైన బ్రూనో బలయ్యాడు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బెస్లోవ్ కు చెందిన గ్యాస్టర్స్ స్కూప్ అనే వ్యక్తి ఆ సంఘటనలను వర్ణిస్తూ కథలు, కవిత లు రాయడంతో బాహ్య ప్రపంచానికి తెలిసింది. బ్రూనో అనే సత్యశోధకున్ని మత మూఢత్వం కాల్చిబూడిద చేసిన తాను రాసిన పుస్తకాలు ఫ్రెంచ్, బ్రిటీష్, జర్మనీ భాషలలో రాయడం వల్ల ఇటలీ మతోన్మాదులు తగలబెట్టలేక పోయా రు. ఆధునిక కాలంలో బ్రూనో ఖగోళ పరిశోధనలు, రచనలు, మోడరన్ సైన్స్ అభివృద్ధికి ఎంతో దోహదం చేశాయి.
బ్రూనో కాలానికి ముందున్న వైజ్ఞానిక వేత్త .
ఖగోళ శాస్త్రం గురించి టెలిస్కోపులు అబ్జర్వేటర్ లేని 16వ శతాబ్దంలో ప్రతి నక్షత్రాన్ని కూడా భూమి లాంటి గ్రహాలు ఉంటాయని, సూర్యుడు లాంటి సూర్యులు విశ్వంలో చాలా ఉన్నాయని, ఖగోళ పరిశోధనలో కచ్చితంగా వెల్లడించాడు. 400 సంవత్సరాల తర్వాత నేడు అవన్నీ నిజాలే అని తేలాయి. దీంతో బ్రూనో కాలానికి ముందున్నడనే విషయం ప్రపంచానికి తెలిసింది.
బ్రూనో సజీవ దాహన తప్పిదాన్ని 289 ఏళ్లకు గుర్తించిన క్రైస్తవ మతం.
భూమి సూర్యుని చుట్టూ తిరుగు తున్నది సత్యమని బ్రూనో ఆనాడు వెల్లడించింది నిజమేనని, ఆ మహనీ యుడు పట్ల తాము చేసింది అమాను ష చర్యనని ఇటలీ క్రైస్తవ మత పెద్దలు అతడు చనిపోయిన 289 సంవత్సరాలకు గుర్తించారు. తాము చేసిన తప్పిదాన్నుండి బయట పడేందుకు బ్రూనోను సజీవ దానం చేసిన కాంపో -డి -పియోరి సర్కిల్లో 1889లో నిలువెత్తు స్మారక విగ్రహాన్ని నెలకొల్పారు. వాటికన్ సిటీ క్రైస్తవ మత పెద్ద పోప్ జాన్ పాల్- 2 బ్రూనోను హత్య చేసినందుకు ప్రపంచానికి బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
విశ్వ మానవుడిగా బ్రూనో గుర్తింపు .
భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనే సత్యాన్ని చెప్పినందుకు సజీవ దాహనం కాబడ్డ బ్రునో మరణం వృధా కాలేదు. 423 సంవత్సరాలు గడుస్తు న్నా ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు అతని స్మరించు కుంటూనే ఉన్నారు. బ్రూనోను విశ్వ మానవుడిగా ప్రపంచం గుర్తించి వివిధ దేశాలలో ఆయన పేరిట ఎన్నో స్మారక స్థూపాలు వెలిశాయి. నేటికీ ఆయన పేరిట కవులు, రచయితలు ఎన్నో కవితలు కథనాలు రాస్తూనే ఉన్నారు. బ్రూనో కాలపరీక్షకు ఎదురు నిలిచిన విశ్వ విజేతగా ప్రపంచం గుర్తించింది. బ్రూనోను సజీవ దహనం చేసిన రోజు 17 ఫిబ్రవరిని *సత్యాన్వేషణ దినం* గా గుర్తించి వేడుకగా జరుపు కోవాలని వైజ్ఞానిక ప్రపంచం పిలుపునిచ్చింది. ప్రతి సంవత్సరం అతడి స్మారకంగా వివిధ దేశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
* ఆస్ట్రేలియా లోని సిడ్నీలో రేడియో ఛానల్ కు బ్రూనో పేరు పెట్టారు.
* 1960లో చంద్రునికి 22 కిలోమీటర్ల దూరంలో కనుగొన్న ఆస్ట్రాయిడ్ ఖగోళశిలకు బ్రూనో పేరు పెట్టారు.
* జర్మనీలోని బెర్లిన్ లో ఒక రైల్వే స్టేషన్ లో 2008లో అక్కడి ప్రభుత్వం తలకిందులుగా వేలాడదీసి మంట పెడుతున్న బ్రూనో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.
ఇటలీ మత పెద్దల చేతిలో గెలీలియోకు కూడా అదే పరిస్థితి.
![]() |
| 30 ఏళ్లు జైలులోనే గడిపి మృతి చెందిన ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో. |
బ్రూనోకు సమకాలికుడైన గెలీలియో విశ్వాంతరాలను వెతికేందుకు టెలిస్కోపును కనిపెట్టాడు. టెలిస్కోప్ ద్వారా సూర్యుడు చుట్టూ భూమితో పాటు గురు గ్రహం తిరుగు తుందని సత్యాన్ని 17 జనవరి 1610 లో వెల్లడించారు.గురు గ్రహం క్రైస్తవులకు ఆరాధ్య దైవం. తాము అత్యంత పూజనీయంగా భావించే గురు గ్రహాన్ని సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడని చెప్పడాన్ని క్రైస్తవ మత బోధకులు సహించ లేదు. 30 ఏళ్లు జైల్లో బంధించి 78 ఏళ్ల వృద్ధాప్యంలో కనులు కనపడని పరిస్థితుల్లో కూడా విడుదల చేయక పోవడంతో జైల్లోనే మృతి చెందాడు. శవాన్ని బహిరంగంగా అంత్యక్రియలు జరపనీయలేదు. సమాధి కూడా కట్టనీయకుండా అమానుషంగా వ్యవరించారు.
భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది?
మనదేశంలోకి తొంగి చూస్తే నాటి 16వ శతాబ్దంలో ఇటలీలోని మత పెద్దలు రాచరిక వ్యవస్థలో జరిగిన అమానుష సంఘటనలే నేటి 21వ శతాబ్దంలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నాయి. టోలోమి ప్రతిపాదించిన భూకేంద్ర సిద్ధాంతం ఆధారంగానే జ్యోతిష్య, వాస్తు శాస్త్రం పనిచేస్తున్నాయి. సూర్యుణ్ణి కూడా గ్రహం కిందనే లెక్క కడుతుంటారు. పంచాంగాలు, జ్యోతిష్యాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారు. విటిని నమ్మే మనువాదులు యూనివర్సిటీలో జ్యోతిష్యం వాస్తు శాస్త్రాలను కూడా కోర్సులుగా ప్రవేశపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దేశాన్ని హిందూ మత రాజ్యాంగంగా ప్రకటించుకునేందుకు గత పది ఏళ్లుగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ కృషితో అందరికీ, స్వేచ్ఛ, స్వాతంత్రం, సౌబ్రత్వత్వం, శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగాల్లో ముందుకు పోవాలని రాజ్యాంగంలో రాసుకున్న కూడా సక్రమంగా అమలు కాకుండా చూస్తున్నారు.
మూఢనమ్మకాలను ప్రశ్నించిన మేధావులను కాల్చి చంపుతున్నారు.
దేశంలో మత నమ్మకాలు మూడ విశ్వాసాలే రాజ్యమేలు తున్నాయి.అశాస్త్రీయమైన వాటిని మూఢనమ్మకాలను, అంద విశ్వాసాల ను ప్రశ్నించినందుకు హేతువాదులను మేధావులపై దాడులు చేస్తూ మతోన్మాదులు నిర్ధాక్షణంగా కాల్చి చంపుతున్న వారిని పట్టుకుని శిక్షించే వారు లేరు. ఆదివాసుల హక్కులు, మానవ హక్కుల గురించి ఉద్యమాలు చేసే మేధావులను వయోవృద్ధులని కూడా చూడకుండా అర్బన్ నక్సలైట్లం టూ రాజ ద్రోహాలు, ఉపా లాంటి చట్టాలతో కేసులు నమోదు చేసి సంవత్సరాలుగా జైల్లోనే బంధిస్తు న్నారు. నేడు దేశంలో పెచ్చరిల్లుతున్న మత దురాహంకాలకు బలైన మహారాష్ట్రలకు చెందిన దబోల్కర్, గోవిందా పన్సారి కల్గూరి, గౌరీ లంకేష్ లాంటి హేతువాదులు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నారు. రాజ్యాన్ని కూల్చేందుకు కుట్రలు చేశాడని 90% వికలాంగుడిగా ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను అండా సెల్లు బంధించడం, రాజ ద్రోహం నేరం కింద ఆదివాసుల హక్కుల కోసం ఉద్యమిం చిన మానవ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి జైల్లోనే మృతి చెందడం లాంటి ఘటనలు 400 ఏళ్లనాడు ఇటలీలో మృతి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు గీఆర్డినో బ్రూనో సజీవ దహనం,గెలీలియో జైలులో మృతి చెందడం గుర్తుకు తెస్తున్నాయి.
దేశంలోని యువత ఆలోచించాలి.
ఈరోజు దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించే దేశ జనాభాలో 85% ఉన్న బహుజన వర్గాల యువకులు ఆలోచించాలి. యువతరం మానవ మనుగడకు అడుగడుగునా అడ్డంకిగా నిలుస్తున్న మత ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడాలి. రుజువులకు నిలబడని పుక్కిటి పురాణాల గురించి పట్టించు కోకుండా శాస్త్రీయ, సాంకేతిక రంగంలో దేశం అభివృద్ధి చెందేందుకు పాటుపడాలి. భవిష్యత్ తరాల కోసం తన ప్రాణాలను అర్పించిన శాస్త్రవేత్తల కోసం చదువుకొని, వారి స్ఫూర్తితో దేశాన్ని వైజ్ఞానిక రంగంలో ముందుకు తీసుకు పోయేందుకు కృషి చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ డిజిటల్ మీడియా ఆశిస్తుంది.



