మామిడిగూడెం, అశోక్ నగర్ ప్రజల దశాబ్దాల కల సాకారం.
- సల్పల వాగుపై బ్రిడ్జి పనులకు శంకుస్థాపన.
![]() |
సల్ఫల వాగు పై బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తున్న మండల జడ్పిటిసి పల్లె చంద్రయ్య,ఎంపీపీ రోడ్డ లక్ష్మి తదితర ప్రజాప్రతినిధులు నాయకులు.
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని మామిడిగూడెం, అశోక్ నగర్, గోండుగూడెం, పెద్ద ధర్మారం ప్రజలు దశాబ్దాలుగా వర్షాకాలంలో మండల కేంద్రానికి రావడానికి సల్ఫల వాగు పెద్ద అడ్డంకిగా మారింది. వర్షాకాలంతో పాటు మిగతా ఎనిమిది నెలలు వాగులో నీరు ఉదృతంగా ప్రవహిస్తుండడం వల్ల నాలుగు గ్రామాల ప్రజలు మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు, ఆరోగ్య కేంద్రానికి, బ్యాంకుకు రావడం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే వారు. ఎట్టకేలకు బరాస ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణానికి మూడు కోట్ల నిధులను మంజూరు చేయడం గ్రామాల ప్రజలకు ఊరట నిచ్చింది. ఈరోజు
బ్రిడ్జి నిర్మాణ పనులకు జడ్పీటీసీ సభ్యుడు పల్లె చంద్రయ్య, మండల పరిషత్తు అధ్యక్షురాలు రోడ్డ లక్ష్మి,వైస్ ప్రెసిడెంటు పుస్కూరి విక్రంరావు, సర్పంచ్ ధారావత్ దేవి,యంపిటిసి అక్కెపెల్లి లక్ష్మి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సంధర్భంగా జడ్పిటిసి పల్లె చంద్రయ్య మాట్లాడుతూ ఈ బ్రిడ్జి సుమారు 4నెలలలో పూర్తి చేస్తె అశోక్ నగర్,మామిడి గూడ ప్రజలకు మండల కేంద్రానికి వచ్చే రవాణా సదుపాయం ఏర్పడుతుందన్నారు. వర్షాకాలం వాగు దాటి పోవడానికి ఇబ్బందులు ఉండేవని త్వరలో ఆ ఇబ్బందులు తొలగి పోతాయన్నారు. వంతెన నిర్మాణ పనులకు నిధుల మంజూరుకు కృషి చెసినా ఎం ఎల్ ఏ దుర్గం చిన్నయ్య కు మండల ప్రజల తరఫున కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ కార్య క్రమంలోపి ఎ సి ఎస్ చైర్మన్ నీలా రాంచెందర్, యంపిటిసి రాంచెందర్, సర్పంచ్ లు ఆడె భాదూ,సంపత్ నాయక్,బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు రమణారెడ్డి,ఉప సర్పంచ్స్ పిట్టల సుమన్,బోయిని తిరుపతి, భాస్కర్ నాయక్,బి అర్ ఎస్ పార్టీ కార్యదర్శి మొటూరి వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టరుమంజుల రెడ్డి, బిఅర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు అగ్గి సత్తయ్య. పి ఎ సి ఎస్ డైరెక్టర్ సురేందర్ వార్డ్ మెంబర్లు అగ్గి వెంకటేశ్వర్లు, శంశీర్,బి అర్ ఎస్ పార్టీ నాయకులు లంక లక్ష్మన్,దుర్గం రాంచెందర్,గంగదారి రాజేశం, ఉసికమల్ల గోపాల్, రాజాన్న, మల్లేష్. మార్క శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

