నల్ల బ్యాడ్జీలతో మైనింగ్ స్టాప్ నిరసన.

కాసిపేట టు గని మేనేజర్ రవీందర్ కు వినతి పత్రం అందజేస్తున్న మైనింగ్ స్టాప్ సిబ్బంది.
Scv News Kasipet:--
సింగరేణి లోని భూపాలపల్లి ఏరియాలో జరిగిన ప్రమాదంలో ప్రకాష్ అనే మైనింగ్ సూపర్వైజర్ను డిస్మిస్ చేసినందుకు నిరసనగా ఈరోజు మందమర్రి ఏరియా కాసిపేట టు గని లో మైనింగ్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియా మైనింగ్ స్టాప్ నాయకుడు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ సింగరేణి గనులలోఎన్నో ప్రమాదాలు జరిగి కార్మికులు మృతి చెందిన సంఘటనలలో ఏ అధికారులను ఇంతవరకు ఉద్యోగం నుండి డిస్మిస్ చేయలేదని అన్నారు. ఎన్నడూ లేని విధంగా సింగరేణి యాజమాన్యం ప్రకాష్ అనే మైనింగ్ సూపర్వైజర్ డిస్మిస్ చేయడం అన్యాయమని అన్నారు. ఈ విషయమై సింగరేణి వ్యాప్తంగా మైనింగ్ సూపర్వైజర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేయడం జరుగు తుందన్నారు. వెంటనే యాజమాన్యం స్పందించి ప్రకాష్ ను విధులకు తీసుకోవాలని లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తదనంతరం గని మేనేజర్ రవీందర్ కు మైనింగ్ సిబ్బందితో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.