గ్రామాల్లో అభివృద్ధి
పనులకు భూమి పూజలు,
ప్రారంభోత్సవాలు.
![]() |
| |
కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,మండల ప్రజా ప్రతినిధులు.
![]() |
| మండలంలోని వివిధ గ్రామాలలో భూమి పూజలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలు చేశారు. మొదట గట్రావు పల్లె పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవనం పూర్తికాక 15 ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది. భవనాన్ని పూర్తిచేసేందుకు మరమ్మత్ పనులకు 7 లక్షల 60 వేల నిధులు మంజూరు అయ్యాయి. ఈ భవనం పనులు చేసేందుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందజే సారు. తరువాత
సోనపూర్ గ్రామపంచాయితీలోని బాదుగూడలో 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించు సీసీ రోడ్డు పనులకు ప్రారంభం చేశారు. అక్కడినుండి రొట్టెపల్లి పంచాయతీ పరిధిలోని పంప్ హౌస్ వద్ద కొమురం భీమ్ గ విగ్రహ ప్రతిష్టాపణ కొరకు భూమి పూజ చేశారు. అక్కడి నుండి పల్లంగూడ గ్రామంలో మన ఊరు-మన బడి లో బాగంగా 23 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ప్రారంభం చేశారు. తదనంతరం మండల పరిషత్ కార్యాలయంలో మండల మండల రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 58 మంది లబ్ధిదారులకు 58,06,728 రూపాయల విలువగల కల్యాణలక్ష్మి మరియు షాదిముభారక్ చెక్కుల ను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఒంటరి మహిళలకు 200 రూపాయల నుండి 3000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. పేదింటి ఆడపడుచులకు పెళ్లి కానుకగా లక్ష 116 ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి వల్ల ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. కెసిఆర్ వల్ల లబ్ది పొందుతున్న తెలంగాణ ప్రజలు కెసిఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. తదనంతరం కాసిపేట పంచాయతీలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని, రొట్టెపల్లి పంచాయితీ పరిధిలోని కొత్త తిరుమలాపూర్ అంగన్వాడి సెంటర్ పనులకు భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమాలలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి,, జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు , తహసిల్దార్ దిలీప్ కుమార్, ఎంపీడీవో ఎంఏ అలీ, ఎంపీటీసీలు రామ్ చందర్ , చంద్రమౌళి , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల రెడ్డి, గట్రావుపల్లి సర్పంచ్ రాజు , సోనాపూర్ సర్పంచ్ సుశీల , రొట్టపెల్లి సర్పంచ్ కవిత, పల్లం గూడెం సర్పంచ్ దుస్స విజయ , మామిడిగూడెం సర్పంచ్ సంపత్ నాయక్ , తాటి గూడెం సర్పంచ్ స్వప్న , మద్దిమడ సర్పంచ్ జంగు , ముత్యం పల్లి సర్పంచ్ బాదు , ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల , మండల కో ఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాన్ మండల BRS పార్టీ అధ్యక్షుడు రమణ రెడ్డి , పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, మదన్ రావు అధికారులు, ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు ...



