మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మద్దిమడ గ్రామంలో వృద్ధులకు దేవాపూర్ పోలీసులు దుప్పట్ల పంపిణి.

 మద్దిమడ గ్రామంలో వృద్ధులకు దేవాపూర్ పోలీసులు దుప్పట్ల పంపిణి.

 మద్దిమడుగు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న దేవపూర్ ఎస్సై విజయేందర్.

Scv News Kasipet:--

 కాసిపేట మండలం మద్దిమడ పంచాయతీ లోని గిరిజన గ్రామంలో ఈరోజు దేవపూర్ ఎస్సై విజయేందర్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయేందర్ మాట్లాడుతూ  పేద ప్రజలకు అందుబాటులో ఉండడమే పోలీసుల బాధ్యత అని  గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని అన్నారు. గ్రామ యువకులు చెడు వ్యసనాలకు బారిన పడకుండా క్రీడలు మంచి అలవాట్లపై ఆసక్తి పెంచుకోని తమ కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు. మద్దిమడ,రాంపూర్ గ్రామాలలోని 120 మంది వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకుడు సేవా సంఘం సాంస్కృతిక కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.