కాసిపేట మండలకేంద్రంలో
ప్రజా గోస - బీజేపీ భరోసా
కార్నర్ మీటింగ్.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో బిజెపి కార్నర్ మీటింగ్ |
ScvNews Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రతి నియోజికవర్గ కాసిపేట శక్తి కేంద్రం1 లో ఈరోజు మండల ప్రధాన కార్యదర్శి శక్తి కేంద్రం సూరం సంపత్ కుమార్ అధ్యక్షతన కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ బెల్లంపల్లి నియోజికవర్గ ఇంఛార్జి కొయ్యల ఏమాజి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రతి సామాజిక వర్గానికి ఎన్నో అబద్ధాపు మాటలతో మోసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ .ముస్లిం సోదరులకు 12% రిజర్వేషన్ పెంచుతానని ఇంత వరకు పెంచలేదన్నారు, కేంద్ర ప్రభుత్వం పేదవారికి 10 కిలోల బియ్యం ఇస్తున్న తరణం లో ఇందులో కేంద్రానివీ 5 కిలోలు, రాష్ట్రం ఇచ్చే 5 కిలోలు ఇవ్వటం లేదని ప్రజలకు వివరించారు. నరేంద్ర మోడీ 100 సంవత్సరాల హిందువుల కోరిక రామ మందీరం నిర్మాణానికి కృషి చేశాడని అన్నారు.కెసిఆర్ మోసాలను , బీజేపీ పథకాలను గ్రామంలో ప్రతి గడపగడపకు తెలియపరచి రానున్న రోజుల్లో బీజేపీ నీ గెలిపించ నికి ప్రతి కార్యకర్త కృషి చెయ్యాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో,మండల ఇంచార్జ్ పులగం తిరుపతి ఆటకపురం రమేష్ ,మండల ఉపాధ్యక్షులు బాకీ నరేష్,పులవేణి పోచన్న రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేశవరెడ్డి , బీసీ మోర్చా మండల అధ్యక్షులు పెద్దపల్లి శంకర్ , మహిళ మొర్చ మండల అధ్యక్షులు పెరుగు రాజమ్మ , మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ యూసుఫ్ కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సురేష్ మండల మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు దాగం లీల బూత్ అధ్యక్షులు సుమన్ నాయకులు శ్రావణ్ మహిళలు యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

