బ్యాడ్మింటన్ జాతీయ
ఛాంపియన్ వడ్లూరి ప్రణీత్
కు మండల వాసుల ప్రత్యేక
అభినందనలు.
జాతీయస్థాయి సింగిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా దేవాపూర్ వాసి వడ్లూరి ప్రణీత్.
![]() |
| గోవా రాష్ట్రంలోని మెడగంలో జరిగిన 2023 జాతీయ ఛాంపియన్షిప్ పోటీలో ప్రథమ బహుమతి సాధించిన తెలంగాణ జట్టు. |
| Scv News Kasipet:-- |
కాసిపేట మండలం దేవపూర్ గ్రామానికి చెందిన వడ్లూరి ప్రణీత్ ఈరోజు గోవాలోని మేడ్గాంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ నేషనల్ స్పోర్ట్స్ మీట్ - 2023 బ్యాడ్మింటన్ సింగిల్ ఛాంపియన్ షిప్ లో ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ టోర్నమెంట్ లో హైదరాబాదు నుండి తెలంగాణ తరఫున పోటీలో ఉన్న డబుల్ సింగిల్ టీం సభ్యులంతా ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. వడ్లూరి ప్రణీత్ దేవాపూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వడ్లూరు మల్లేష్ చిన్న కుమారుడు. జాతీయస్థాయిలో సింగిల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా నిలిచి తెలంగాణ రాష్ట్రానికి కాసిపేట మండలానికి మంచి గుర్తింపు తెచ్చిన ప్రణయ్ కి కాసిపేట మండల ప్రముఖులు గ్రామవాసులు , సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.

