మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో గడప గడపకు కాంగ్రేస్ పార్టీ కార్యక్రమం.

 కాసిపేట మండలంలో గడప గడపకు కాంగ్రేస్ పార్టీ కార్యక్రమం.

 కాసిపేట మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తున్న  మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ.

Scv News Kasipet:--

కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు  ఈ రోజు హత్ సే హత్ జోడో అభియాన్  యాత్ర గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద గల పార్టీ జెండాను  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో వేముల కృష్ణ మాట్లాడుతూ రాహుల్ గాంధీ  దేశాన్ని ఐక్యం చేయుటకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేశారన్నారు.భారత్ జోడో పాదయాత్ర ముగింపు సందర్భంగా దానిని కోనసాగింపుగా ఈ రోజు రాష్ట్రమంతా రాహుల్ గాంధీ  సందేశం గడప గడపకు ఇచ్చుటకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు దేశంలో విద్వేషం, విభజన ప్రజల మధ్య చిచ్చు రేపి అధికారం కోసం అడ్డదారులు తొక్కడం అంత్యంత హేయమైన చర్య అని, అలాగే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అవినీతి చేస్తూ కుటుంబ పాలన చేస్తూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరకముందే జాతీయ పార్టీ పెట్టి మరోసారి సెంటిమెంట్ తో రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని చూస్తుందన్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ఈ సారి అధికారంలోకి తీసుకొని వచ్చి సోనియమ్మ రుణం తీర్చుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల కృష్ణ, మాజి అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, యంపిటిసిలు పార్వతి మల్లేష్, మెరుగు పద్మశంకర్, ఆదివాసీ నాయకులు కనకరాజు,ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, ఓరియంట్ కంపెనీ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షుడు అన్నం కుమార్,యస్ సి సెల్ అధ్యక్షుడు గోలేటి స్వామి, సీనియర్ నాయకులు ఏనుగు జనార్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు షాకీర్,మైదం రమేష్,గాదం గట్టయ్య, జంగిలి రమేష్, మహేష్, వార్డు సభ్యులు కొత్త రమేష్,పంబాల తిరుపతి, మల్లెత్తుల రాజేశం , జయరాం, పుర్రె పోషం, విజయ్, ప్రేమ్,లు పాల్గొన్నారు.