దేవాపూర్ లో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు.

దేవాపూర్ అంబేద్కర్ భవన్లో చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న అంబేద్కర్ యువజన సంఘం బుద్ధిష్టి సొసైటీ సభ్యులు.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవాపూర్ మేజర్ పంచాయతీలోని అంబేద్కర్ భవన్లో ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం బుద్ధిష్టు సొసైటీ ఆధ్వర్యంలో బహుజన పోరాట యోధుడు చత్రపతి శివాజీ 393 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదట అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బుద్ధిష్టి సొసైటీ సభ్యులు పూలమాలలు వేశారు. అంబేద్కర్ భవన్లో చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బుద్ధ ప్రతిజ్ఞతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరాఠా పోరాటయోధుడు చత్రపతి శివాజీ జీవిత విశేషాలు గురించి అంబేద్కర్ యువజన సంఘం మండల నాయకుడు వడ్లూరు మల్లేష్, బుద్ధిస్తూ సొసైటీ సభ్యులు మనోహర్ కామ్బ్లీ సందీప్, విటల్ బాలాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం దేవాపూర్ కమిటీ ప్రచార కార్యదర్శి కాంపెల్లి వెంకటేష్, మడావి సత్యనారాయణ వడ్లురీ ప్రణీత్,ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.