అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన కాసిపేట మోడల్ పాఠశాల విద్యార్థులు.
![]() |
| నేపాల్ దేశంలో జరిగిన అంతర్జాతీయ అండర్ ఆర్మ్ క్రికెట్ టోనీలో బంగారు పతకం సాధించిన ఆదర్శ పాఠశాల విద్యార్థులు రాకేష్, శివ సాయి లు |
![]() |
| బంగారు పతకం సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్న ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ అందే నాగమల్లయ్య. |
Scv News Kasipeta:--
కాసిపేట మండలం తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు పి రాకేష్, బి శివ సాయిలు ఈనెల 22 నుండి 24 వరకు నేపాల్ దేశంలో జరిగిన అంతర్జాతీయ అండర్ ఆర్మ్ క్రికెట్ టోర్నీలో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాని కైవసం చేసుకున్నారు.
మారుమూల ప్రాంతానికి చెందిన కాసిపేట మండలం నుండి పాల్గొని అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గుర్తింపు తెచ్చిన రాకేశ్ శివ సాయి లను మోడల్ కళాశాల ప్రిన్సిపల్ అందే నాగ మల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్, యాజమాన్య కమిటీ చైర్మన్ రాజేష్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు, అభినందించారు. కాసిపేట మండలానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన విద్యార్థులకు మండలంలోని వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నాయకులు అభినందించి ప్రోత్సహించాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.

