ఎస్టీ జాబితాలో 11 కులాలను చేర్చడాన్ని ఉపసంహరించు కోకుంటే ఆందోళనకు దిగుతాం
- తుడుం దెబ్బ జిల్లా నాయకుల హెచ్చరిక.
Scv News kasipet:--
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గిరిజన తెగల్లో మరో పదకొండు తెగలను కలపడం నిరసిస్తూ ఈ రోజు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం లోనీ ప్రెస్ క్లబ్ లో తుడుందెబ్బ అధ్వర్యంలో కాసిపేట మండల ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు మడావి వెంకటేష్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఏదైతే 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేశారో దానిని ఉపసంహరించు కోవాలని కోరారు.లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ముట్టడి లు ధర్నాలు రాస్తారోకొలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో కనక్క రాజు జిల్లా ఉపాధ్యక్షులు.ఆత్రం జంగు కసిపేట మండల అధ్యక్షులు. మడవి వెంకటేష్ మండల ప్రధాన కార్యదర్శి. పెంద్రం ప్రభాకర్ మండల కోశాధికారి. మడవి గంగారాం మండల సలహా దారులు. సిడం గణపతి ఉపాధ్యక్షులు.పేంద్రం గుల్వంత్ రావ్ ఉపాధ్యక్షులు.రొడ్డ అనిల్. నాయక పోడ్ సంఘం. గెడం శేఖర్. కొడప శ్యామ్ సుందర్. ఉయిక మోతిరం పాల్గొన్నారు
