మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కేంద్రంలో ప్రజాకవి వేమన జయంతి

 సాంఘిక దురాచారాలపై

తిరగబడ్డ సామాజిక

విప్లవకారుడు వేమన.

- పల్లె మల్లయ్య, సాచైవే అధ్యక్షుడు  

 వేమన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న సామాజిక చైతన్య వేదిక నాయకులు.


Scv News Kasipet:-

మూఢనమ్మకాలు, విగ్రహారాధన, సాంఘిక దురాచారాలు, దేవుడు,మతం పేరిట బ్రాహ్మనీయ దోపిడి పై తిరగబడ్డ సామాజిక విప్లవకారుడు వేమన అని సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య కొనియాడారు.కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో గురువారం ప్రజా కవి    వేమన జయంతి ఘనంగా నిర్వహించారు. మొదట వేమన చిత్రపటానికి సామాజిక చైతన్య వేదిక నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.


ఈ కార్యక్రమాని కి అధ్యక్షత వహించిన పల్లె మల్లయ్య మాట్లాడుతూ  దేవుడు కర్మకాండల పేరిట ప్రజలను దూకుడు చేస్తున్న బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా పద్యాలు రాయడం వల్ల  బ్రాహ్మణీయ వర్గం కుట్రపూరితంగా వేమన జీవిత చరిత్రను  పద్యాలను కనుమరుగు చేశాడన్నారు. వేమన ఆట వెలది పద్యాలతో  హేతుబద్ధ ప్రశ్నలకు బ్రాహ్మణీయ శక్తుల వద్ద సమాధానాలు లేక చరిత్రలో దిగంబరుడు గా ప్రచారం చేసి అవమానించారన్నారు. వేమనను వ్యసనపరుడని  స్త్రీలోలుడన  దిగంబరంగా ఉన్న చిత్రపటాలను ప్రచారం చేశారన్నారు.ఈ దేశంలో వేల ఏళ్ల క్రితం వేదాలను, పురాణాలను దాచిపెట్టిన బ్రాహ్మణవాదులు వందల సంవత్సరాల క్రితం వేమన పద్యాలను మాత్రం కనబడకుండా చేశారన్నారు. 

బ్రిటిష్ అధికారి సిపి బ్రౌన్ వేమన పద్యాలను సేకరించి ఆంగ్లంలోకి అనువదించి ప్రచురించడంతో వేమన గొప్ప కవి అనే  విషయం బాహ్య  ప్రపంచానికి  తెలిసిందన్నారు. భారతదేశ సాంస్కృతిక విప్లవానికి ప్రజా కవి వేమన  వేగుచుక్క లాంటివాడని సిపి బ్రౌన్ కొనియాడారని గుర్తు చేశారు. తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన వేమనను తెలుగు రాష్ట్రాలు గుర్తించడం లేదని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రం 2018 నుండి వేమన జన్మదినాన్ని అధికారికంగా జరుపుతుందని గుర్తు చేశారు. వేమన పద్యాలను పాఠశాలలో  విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్పించి నైతిక విలువలను నేర్పాలని సూచించారు.

సాచైవే ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ వేమన సామాజిక స్పృహతో ప్రజలలో తిరిగి ప్రజల బాధలు తెలుసుకొని  పద్యాలు రాశాడన్నారు. మూఢనమ్మకాలు, బ్రాహ్మనీయ దోపిడీకి వ్యతిరేకంగా పద్యాలు రాసినందుకు కుట్రపూర్తిగా అతనికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. ప్రజలను చైతన్యవంతం చేసిన వేమన పద్యాలను చదివి వినిపించారు.


సాచైవే ముఖ్య సలహాదారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ ప్రజల్లో మూఢవిశ్వాసాలను తొలగించి చైతన్యవంతం చేసిన మహాకవిని దిగంబరంగా చూపడం అన్యాయం అన్నారు. వేమన ప్రజల జీవితాలపై గొప్ప పద్యాలు రాసిన మహనీయుడని కొనియాడారు. వేమన పద్యాలను అమ్మ గొప్పతనం పై పాటలు పాడి వినిపించారు.


జన సమితి ప్రధాన కార్యదర్శి గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ వేమన సామాజిక ఉద్యమకారుడని వాటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు,దోపిడి, సాంఘిక దురాచారాలపై ఉద్యమించిన సామాజిక విప్లవకారుడు అని కొనియాడారు. వేమన మూఢనమ్మ కాలపై మోసాలపై రాసిన పద్యాలను వినిపించారు. 

ఐకాస మండల కన్వీనర్ సిలోజి మురళి మాట్లాడుతూ ప్రజా కవి వేమన నాస్తికుడని దేవుడు మతం పేరిట బ్రాహ్మణులు చేస్తున్న దోపిడిని ప్రశ్నించి నందుకు చెడుగా ప్రచారం చేశాడని అన్నారు. వేమన జయంతిని అన్ని పాఠశాలలో ఘనంగా జరపాలని కోరారు.

మండల ఆట వెలది కవి గొల్లపల్లి  బ్రహ్మయ్యకు సన్మానం.

వేమన జయంతి సందర్భంగా ఆట వేలది పద్యాలతో రాష్ట్ర,జిల్లా స్థాయిలో మంచి గుర్తింపు పొందిన కాసిపేట మండలానికి చెందిన  వర్ధమాన కవి గొల్లపల్లి బ్రహ్మయ్య ను సామాజిక చైతన్య వేదిక శాలువాతో సన్మానించింది.

ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ అనుకోకుండా కవితా రంగంలో ప్రవేశం చేశానని నేటి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పై ఆట వెలది పద్యాలు రాశాను అన్నారు. సెల్ ఫోన్ లు, మద్యం తాగడం వల్ల జీవితాలు ఎలా నష్టపోతున్నాయి పద్యాల ద్వారా వివరించా నన్నారు. రాష్ట్ర స్థాయిలో తాను రచించి గుర్తింపు పొందిన పద్యాలను కొన్నిటిని  చదివి వినిపించారు. ఈ సందర్భంగా తాను రాసిన పద్యాలను గుర్తించి సన్మానించిన సామాజిక చైతన్య వేదిక నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు సిహెచ్  ప్రభాకర్, స్థానిక నాయకులు ఆయిల్ల రాజం, కురుమ నరసయ్య  తదితరులు పాల్గొన్నారు.