మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రజా కవి వేమన పద్యాలు నేటి సమాజానికి ఎంతో అవసరం.- 2

 ప్రజాకవి యోగివేమన.

Scv News Kasipet-:

 నేటి సమాజంలో చాలామంది ప్రజలు నీతి, నియమాలకు, తిలోదాకాలు ఇచ్చి స్వార్థమే  పరమార్థంగా జీవించడం వల్ల వారి కుటుంబాల్లో ఎన్నో అనర్ధాలు జరుగుతున్నా యి. ప్రజల్లో నైతిక విలువలు పడిపోతూ మానవ జీవనం అస్తవ్యస్తమవుతున్న నేటి రోజుల్లో ప్రజాకవి వేమన పద్యాల అవసరం ఎంతైనా ఉంది. నాలుగు శతాబ్దాల క్రితం వేమన వాటి సమాజంలో జరుగుతున్న మూఢాచారాలు, సాంఘిక దురాచారాలు, బ్రాహ్మణ దోపిడి, కుటుంబ సంబంధాలపై, విద్యార్థి, యువకులు ఎలా సమాజంలో జీవించాలో తెలిపే చక్కని పద్యాలను అల్లారు. వాటిలోని కొన్నిటిని వేమన జయంతి సందర్భంగా  మనం  గుర్తు చేసుకుందాం.!

వేమన నాటి సమాజంలో ప్రజలంతా ఆకలితో అలమటిస్తుంటే బ్రాహ్మణ మనువాద వర్గం మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తూ దేవుడు పేరిట గుళ్ళలో విగ్రహాలు పెట్టి దోపిడీ చేస్తుంటే వాటిని సహించలేక హేతువాద దృక్పథంతో ఆట వెలదిలో పద్యాలను అల్లారు. వాటిలోని కొన్ని పద్యాలు.

" రాతి బొమ్మకేల రంగయిన వలవలు -

గుళ్ళు,గోపురాలు, కుంభములు -

కూడు,గుడ్డ,తాను కోరునా దేవుడు?

 విశ్వదాభిరామ వినురవేమ.! "

 తాత్పర్యం : నాటి సమాజంలో ఆకలి చావులతో పేదలు అలమటిస్తుంటే  వారి ఆకలి తీర్చకుండా చీకటి గదిలో రాతి బొమ్మలను పెట్టి గుళ్ళు గోపురాలు కట్టి దేవుని పూజిస్తున్నారు. దేవుడు కుడుగుడ్డా తాను కోరుతున్నాడా?అంటూ బ్రాహ్మణులను ప్రశ్నించారు.

 నాటి మూడాచారాలను, జ్యోతిషాలను జాతకాలను ఎండగడుతూ..

" విప్రులల్లా చేరి వెర్రి కూతలు కూసి-సతి పతులను గూర్చి సమ్మతమునా మునుముహూర్తమందు ముండే ట్లా మోసారా?

విశ్వదాభిరామ వినురవేమ.! "

 తా : భార్యాభర్తలు మంచిగా బ్రతకాలని జ్యోతిషాలు చూసి ముహూర్తాలు పెట్టి బ్రాహ్మణులు పెళ్లిళ్లు చేసి ప్రజలను దోచుకుంటున్నారు. మంచి ముహూర్తం పెట్టి పెళ్లి చేసిన కొద్ది రోజుల్లోనే ప్రమాదాల్లో పెళ్ళికొడుకులు ఎలా చనిపోతున్నారు? అంటూ జ్యోతిషాలు బూటకాలు అంటూ  బ్రాహ్మణ వర్గాన్ని ప్రశ్నించారు.

"పిండములను చేసి పితరులకు తలపోసి -

కాకులకు పెట్టె గాడిదలారా?-

పెంట తినేడి కాకి పీతరు  డెట్లాయరా.?

విశ్వదాభిరామ వినురవేమ.!"

తా :  బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకి అన్నం పెట్టలేని వారు చనిపోయిన తర్వాత స్వర్గంలో వారి ఆత్మలకు చేరాలని పిండాలు పెడుతు పిండాలను తినే కాకే తమ తల్లిదండ్రులు అనుకుంటున్నారు.  పెంట ఏరుకు తినే కాకి మీ తల్లిదండ్రు ఎలా అవుతార్రా? అంటూ ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు. 

 " శిలను ప్రతిమగ చేసి చీకటింట ను పెట్టి -

మొక్క వద్దు వెర్రి మూడులారా? - జీవులందే కానీ శిలలందు లేడయ్యా!

విశ్వదాభిరామ వినురవేమ.!"

తా : చీకటి గదిలో రాయిని బొమ్మగా చెక్కి  దేవుడని పూజలు చేసే వెర్రి వాళ్ళ రా జీవమున్న మనుషుల్లోనే దేవుడు ఉన్నాడు. వారికి సహాయం చేయండి వారిని పూజించండి రాళ్లను కాదు అని వాటి సమాజంలో ప్రజలను ప్రశ్నించారు.

భారతదేశంలో ఇతిహాసాలుగా పేరొందిన రామాయణ మహాభారతాలలోని డోళ్ళ తనాలను కూడా ప్రశ్నించాడు .

" కనక మృగము భువిన కద్దు లేదనకయే -

 తరుణి విడిచి పోయే దాశరథి యు -

తెలివిలేనివాడు దేవుడెట్లాయరా?

విశ్వదాభిరామ వినురవేమ.? "

తా : ఈ భూ ప్రపంచం మీద బంగారపు లోహపు జింక ఉండదు. ఆ జింకను తెచ్చేందుకు రాముడు సీతను అడవిలో విడిచి ఎట్ల వెళ్లాడు. కనీస జ్ఞానం లేని వాడు దేవుడెట్లాయరా? అంటూ రామున్ని విమర్శించారు.

" పంచమ వేదాంబు భారతంబని 

 పొగడలేరా జనులు బుద్ధిలేక ? -

 హింస కార్యము తనకు ఇష్టమేళాయరా?

 విశ్వదాభిరామ వినురవేమ.! "

 తా : నాలుగు వేదాలతో పాటు మహాభారతాన్ని కూడా వేదాలలో కలిపి పంచమ వేదం అంటున్నాం. మహాభారతం మొత్తం కుట్రలు, కుతంత్రాలు, మోసాలు,హింస యుద్ధాలతో కూడిన హింస వాదం  ప్రజలకు ఎలా ఇష్టమవుతుంది? నాటి సమాజంలో హింస వాదాన్ని వేమన వ్యతిరేకించారు.

సమాజంలో మనిషి ఉన్నతికి, పతనానికి ప్రధాన కారణం మనసే అని గుర్తించి మనసును తెలుసుకొని నడవాలని, మనసును  తన అదుపులో పెట్టుకొని సుఖసంతోషాలతో జీవించాలని ప్రజలకు  బోధించాడు.

" ఒక్క మనసులోనే ఉంది సకలము -

తిక్కబట్టి నరులు తెలుసుకోరు-

రిక్క మెరిగి  నడవడం ఒక్కటే మేలురా!

 విశ్వదాభిరామ వినురవేమ.!"

తా : మనిషి జీవితం మొత్తం మనసు పై ఆధారపడి ఉంది. మనసును అదుపులో పెట్టుకుని జీవించకుండా తిక్కబట్టి తమ జీవితాలను అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. మనసును తెలుసుకొని జీవించడమే మంచిది అంటున్నాడు వేమన.

 గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు అంటూ సామాన్య ప్రజానీకం ఎంతో నష్టపోతున్నారని అలా తిరగడం సరికాదంటూ..

 " యాత్ర పోయిన తడెన్నాళ్ళు తిరిగిన

-  భద్రమైన ముక్తి పదవి గానదు

 మనసు నిలుపునతడే మహనీయ మూర్తి రా.!

 విశ్వదాభిరామ వినురవేమ! "

తా :  మనసు సరిగా లేకుండా కుటుంబం బాగుండాలని  ఎన్ని తీర్థయాత్రలు తిరిగిన ఉపయోగం లేదు. మనసు తన ఆధీనంలో ఉంచుకొని పనిచేయువాడే మహనీయ మూర్తిగా జీవితంలో బాగుంటాడు అంటాడు వేమన.

కుటుంబ సంబంధాల గురించి.

 " చెప్పులోని రాయి చెవిలోని జోరీగా -

కంటిలోని నలుసు కాలి ముల్లు-

 ఇంటిలోని పోరు ఇంతింత గాదయా!

 విశ్వదాభిరామ వినురవేమ.! "

తా : మనిషి దారి వెంట నడుస్తుంటే చెప్పులోని రాయి ఇబ్బంది పెడుతుంది. చెవి చుట్టూ తిరిగే జోరీగా, కంట్లో పడ్డ చిన్న నలుసు, కాలుకు కూచ్చిన చిన్న ముళ్ళు నడవడానికి ఎన్నో రకాల ఇబ్బంది పెడుతుంది. అలాగే ఇంటిలోని కుటుంబ సభ్యుల మధ్య చిన్నపోరు కూడా చాలా బాధ పెడుతుందని అంటాడు వేమన.

" ఆపద వేళ బంధువుల రాసి చూడు -

భయము వేల చూడు బంటు తనము -

 పేదవేళ చూడు పెండ్లాము  గుణము.

 విశ్వదాభిరామ వినురవేమ.! "

కుటుంబాలలో ఆపద వేళ  బంధువుల గురించి తెలుసుకో భయం కలిగినప్పుడు తన సేవకుల గురించి తెలుసుకో  పేదతనములో తన భార్య గుణం గురించి తెలుసుకో అంటాడు  వేమన.

విద్యార్థుల గురించి..

" చాకి కోకాలుతికి చికాకు పడవేసి 

 మైలా దీసి లెస్సమ్మడిచినట్టు -

 బుద్ధి చెప్పు గురుడు గుద్దినా మేలు రా!

 విశ్వదాభిరామ వినురవేమ!"

తా : చాకలి వాళ్లు విడిచిన  బట్టలను బండ కేసి కొట్టి మురికి తీస్తారు. వాటిని తెల్లగా ఉతికి ఇస్తిరిచేసి మడిచినట్టుగా బుద్ధి చెప్పే గురుడు కొట్టిన మేలురా!

అంటూ వేమన విద్యాబోధన గురించి  ఉద్బోధించాడు.

" అనువు గాని చోట అధికుల మనరాదు -

కొంచెం ఉండుటకెళ్ల కొదవ కాదు-

కొండ అద్దమందు కొంచమై ఉండదా! 

 విశ్వదాభిరామ వినురవేమ.! "

తా : మనకు అనువు కానీ ప్రదేశాలలో  గొప్పవాళ్ళ మని విర్రవీగవద్దు. కొంచెం తగ్గి నడుచుకున్న నష్టం లేదు. ఎంతో ఎత్తైన కొండ కూడా అద్దంలో చిన్నదిగానే కనపడుతుంది కదా అంటూ విద్యార్థులకు ఉద్బోధిస్తున్నాడు.

యువత గురించి..

 " విడవ ముడవలేక కుదవ పెట్టకలేక -

వెరుపు లేక విద్య విధము లేక -

 నడయాడెవాడు నడిపిను గనుకో రా!

 విశ్వదాభిరామ వినురవేమ.! "

 తా :సమాజం నిర్మాణంలో ప్రముఖ  పాత్ర పోషించాల్సిన యువత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ  చదువుకోకుండా సమాజాన్ని, కుటుంబాలను పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతున్నారు. అలాంటి యువకులంతా  భూమి మీద నడిచే శవాల లాంటివారని( నడిపి నుగు ) అంటూ అద్భుతంగా విశ్లేషించాడు వేమన. 

" ఎద్దుకైనను కానీ ఏడాది తెలిపిన-

 మనసు తెలిసి నడుచు మర్మమెరిగి -

మోప్పే తెలియలేడు ముప్ప దేండ్లుగడిచిన

 విశ్వదాభిరామ వినురవేమ.! "

నోరు లేని మూగ జీవి ఎద్దు సంవత్సర కాలం రొప్పి ఎలా దున్నాలో చెప్తే అదే సాలు వెంట నడుస్తుంది. సమాజంలోని కొంతమంది మూర్ఖ యువకులకు 30 ఏళ్లు  గడుస్తున్న ఎన్ని మంచి మాటలు చెప్పినా పట్టించుకోరు అంటాడు వేమన.

  రాజకీయ నాయకుల గురించి.. 

 "అల్పబుద్ధివానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు-

 చెప్పు తినేడి కుక్క చెరుకు

తిపెరుగునా!

 విశ్వదాభిరామ వినురవేమ.!

ప్రజల కోసం సేవ చేయాలని పరిణతి చెందని నాయకులను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకుంటే తమ వెంట ఉండే మంచి వారినందరిని వెళ్ళగొట్టి అవినీతి అక్రమాలకు పాల్పడతారు. చెప్పులను తిని బ్రతికే కుక్క చెరుకు తీపి ఎలా తెలుసుకుంటుంది అంటూ వేమన ప్రశ్నిస్తారు.

ఇలా వేమన కొన్ని వేల పద్యాలను నాటి సమాజంలో జరుగుతున్న మూఢనమ్మకాలు,  సాంఘిక  దురాచారాలపై, మనువాద బ్రాహ్మణ వర్గం చేస్తున్న దోపిడీ, మోసాలపై వేలాది పద్యాలను రాశారు.  మహా పండితుడు, హేతువాది   ప్రజా కవి వేమన  వాదనలను ఎదుర్కోలేక  బ్రాహ్మణ వర్గం చరిత్రలో దిగంబరుడుగా ప్రచారం చేసి అవమానించింది. మహనీయుడి పద్యాలను బహుజన వర్గాలు మననం చేసుకొని నైతిక విలువలతో జీవనం సాగిద్దాం. వేమన జయంతిని గ్రామ గ్రామాన ఘనంగా జరుపు కోవాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.