నేడు
భారతదేశ తొలి మహిళా
గురువు, తెలంగాణ
ఆడపడుచు సావిత్రిబాయి
జన్మదినం .
![]() |
| పూలే దంపతులు |
Scv News Kasipet:--
ఆధునిక భారతదేశంలో ఎంతగానో గర్విస్తున్నా సావిత్రిబాయి పూలే తెలంగాణ ఆడబిడ్డ. నిజామాబాద్ గడ్డపై పుట్టిన ఈ ఆడబిడ్డ దేశంలో ని అనేక సామాజిక రుగ్మతలపై పోరాడిన మహోన్నత మాతృమూర్తిగా నిలిచారు. శుద్రులు అతిశూద్రులు,అగ్రవర్ణ మహిళలకు జ్ఞానానికి మూలమైన విద్యను అందించేందుకు పాఠశాలలను నెలకొల్పి విద్యాబోధన చేసిన తొలి మహిళా గురువు సావిత్రిబాయి పూలే. ఉపాధ్యాయురాలే కాకుండా సమాజం లోని అంద విశ్వాసాలను రుగ్మతలను తొలగించిన సంఘ సంస్కర్తగా, రచయిత్రి గా,కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా శూద్రులు, అతిశూద్రుల , మహిళల సకల హక్కుల కోసం పోరాడిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే. ఘనమైన చరిత్ర కలిగిన సావిత్రి బాయికి ఈ దేశ చరిత్రలో మనువాద బ్రాహ్మణ వర్గం సముచిత స్థానం కల్పించ లేదు. పైగా బహుజన వర్గాలకు విద్య బోధన చేసినందుకు ఎన్నో రకాలుగా వేధింపులకు గురి చేస్తూ అవమానించారు. దేశంలోని తొలి మహిళా గురువుగా గుర్తించ కుండా చారిత్రక ఆధారాలు లేని పుక్కిటి పురాణాలలోని సరస్వతి దేవిని చదువుల తల్లిగా చూపెడుతు నేటి సమాజంలో ప్రచారం చేస్తు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ దేశ చరిత్రలో నిజమైన చదువుల తల్లి సావిత్రిబాయి ని మాత్రం గుర్తించ డం లేదు.
సావిత్రిబాయి జన్మదినం సందర్భంగా ఆమె చేసిన సేవలు, పోరాటాల గురించి Scv News అందిస్తున్న ప్రత్యేక కథనం...
బహుజన వర్గాల ప్రజలకు జ్ఞానాన్ని అందించిన భారతదేశ మొదటి గురువు సావిత్రిబాయి పూలే తెలంగాణ ఆడ పడుచు.ఆమె తల్లిదండ్రులు నిజాంబాద్ జిల్లా బోధన్ లో నివసించేవారు.జీవనో పాధి కోసం మహారాష్ట్రకు వెళ్లి సాతార జిల్లా నయగాం గ్రామంలో స్థిరపడ్డారు. వారు మున్నూరు కాపు కులానికి చెందిన వారు. వారి బంధువులు ప్రస్తుతం బోధన్ ప్రాంతంలో ఉన్నారు. రైతు కుటుంబంలో సావిత్రిబాయి 3 జనవరి 1831 లో జన్మించారు. 9 ఏళ్ల వయసులో 12 ఏళ్ల వయసున్న జ్యోతిరావును 1940 వివాహం చేసుకున్నారు. అక్షర జ్ఞానం లేని l సావిత్రిబాయి కి జ్యోతిరావు పూలే ఇంట్లోనే విద్యాభ్యాసం నేర్పి విద్యావంతు రాలిగా చేశారు. అహ్మదానగర్ లో ఉపాధ్యాయు రాలిగా శిక్షణ ఇప్పించారు. చదువుకు దూరంగా ఉండడం వల్లనే బహుజన వర్గాల ప్రజలు అణచివేత దోపిడికి గురవు తున్నారని వారిని చైతన్యవంతం చేసేందుకు జ్ఞానానికి మూలమైన చదువును చెప్పాలని నిర్ణయించుకున్నారు. సావిత్రిబాయి - జ్యోతిరావు పూలే దంపతులు 1 ఫిబ్రవరి 1848లో దేశంలోని మొట్టమొదటి పాఠశాలను పూణేలోనే ఒక ఇంట్లో 9 మంది విద్యార్థులతో ప్రారంభించారు.ఈ పాఠశాల ఆరు నెలల పాటు విద్యా బోధన సాగి మూతపడింది.
విద్యా బోధన చేసినందుకు పూలే దంపతులపై మనువాదుల దాడి.
బహుజన వర్గాలకు చెందిన శూద్ర అతిశూద్ర పిల్లలకు విద్యాబోధన చేయడం వల్ల జ్ఞానవంతులై తమపై తిరుగుబాటు చేస్తారని బ్రాహ్మణ మనువాద వర్గం కుట్రపూరితంగా వేదాలలో చదువు బ్రాహ్మణులకే పరిమితం అని శూద్రులు చదివితే అరిష్టమని ప్రచారం చేశారు. పూలే దంపతులు విద్య బోధన చేయడం వైదిక ధర్మానికి విరుద్ధమని తీవ్రంగా వ్యతిరేకించారు. సావిత్రిబాయి పూలే ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే దారి పొడవునా వేధింపులకు గురయ్యేది. వీధిలో నడిచి వెళుతున్న ఆమె మీద మనువాద వర్గాల ప్రోత్సాహంతో సామాన్య జనం రాళ్లు, మట్టి బురద, పేడ నీళ్లు చల్లేవారు. ఆమె అధైర్య పడకుండా పూలే ప్రోత్సాహంతో పాఠశాలకు వెళ్లే ముందు సంచిలో మరొక చీరను పెట్టుకుని వెళ్లి మార్చుకొని విద్యా బోధన చేసింది. తాము ఎన్ని విధాలుగా వేధింపులకు గురిచేసిన పాఠశాలలు నడపడం ఆపడం లేదని మనువాద వర్గం జ్యోతిరావు పూలే తండ్రి గోవింద రావును కులం నుండి బహిష్కరించారు. మనువాద బ్రాహ్మణుల వేధింపులు భరించలేక తండ్రి గోవిందరావు పూలే దంపతులను 1849లో ఇంటి నుండి వెళ్లగొట్టాడు.ఇంటి నుండి బయటకు వచ్చిన పూలే దంపతులు పట్టు విడవ కుండా విద్యా ప్రచార ఉద్యమాన్ని కొన సాగించారు. పూణేలోని ఓ ముస్లిం వ్యక్తి భవనాన్ని అద్దెకు తీసుకొని 1851లో మళ్లీ పాఠశాలను ప్రారంభించారు. అనతి కాలంలోనే పూణే పరిసర ప్రాంతంలో 20 పాఠశాలలు ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. దేశంలోనే విద్య ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే.
సామాజిక ఉద్యమ నాయకురాలు సావిత్రిబాయి పూలే.
నాటి సమాజంలో మానవ హక్కుల గురించి సామాజిక సమస్యలు, స్త్రీలను చైతన్యపరిచి వారి హక్కుల గురించి జనవరి 13 1852లో మహిళా సేవ మండల్ ను ఏర్పాటు చేసింది. స్త్రీలకు రైతులకు శ్రామికులకు రాత్రుల్లో వయోజన పాఠశాలలు నడిపింది. సతీసహగమనం, బాల్యవివాహాల పై ఉద్యమాలు తీసింది. వీరి ఉద్యమాల ఫలితంగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం25 జులై 1956 లో వితంతు పునర్వివాహ చట్టంతెచ్చింది. అసత్యాలతో అగ్రవర్ణ దురాహంకార నిచ్చిన మెట్ల కుల వ్యవస్థతో నిర్మాణమైన నేటి సమాజంలో సత్యాన్ని సోదించడానికి 24 సెప్టెంబర్ 1873లో తన భర్త మాహత్మ పూలే తో కలిసి' సత్యశోధక్ సమాజ్' అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి సత్యశోధన కోసం ఉద్యమాన్ని నడిపారు.
వితంతు కొడుకును దత్తత తీసుకున్న పూలే దంపతులు.
బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలకు చిన్నప్పుడే బాల్య వివాహం చేయడం వల్ల చాలామంది వితంతువులుగా మారేవారు. యుక్త వయసులోని వితంతువులు గర్భిణీ దాలిస్తే వారి ఇళ్లలోకి రానిచ్చేవారు కాదు. వారి పునరావాసం కోసం పూలే దంపతులు శరణాలయాలు నడిపారు. ఆ శరణాలయంలో కాశీ భాయ్ బ్రాహ్మణ వితంతు కు పుట్టిన బాలున్ని దత్తత తీసుకొని యశ్వంత్ అనే పేరు పెట్టుకున్నారు. యశ్వంత్ ను డాక్టర్ వరకు చదివించి ప్రజల సేవ కొరకే పని చేయించారు.సావిత్రిబాయి సామాజిక ఉద్యమాలలో పాల్గొంటూ సూద్రా అతి సూద్ర ల జీవితాలపై కవితలు కథలు రాసి మంచి రచయిత్రి గా కూడా పేరుపొందింది. ఆమె కవితా సంపుటి' కావ్య పూలే 'ను 'పావన కాశి శుభోద్ రత్నాకర్ 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి.
భర్త చితికి నిప్పు పెట్టి ఆదర్శంగా నిలిచింది .
జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28 మరణించడంతో సావిత్రిబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఈ దుఃఖంలో నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టింది. అప్పటి ఆచారాలలో బ్రాహ్మణుడి మంత్రోచ్ఛారణల తర్వాతనే అంత్యక్రియలు జరిగేటివి . బ్రాహ్మణులు లేకుండానే జరిపించాలని పూలే కోరిక మేరకు సావిత్రిబాయి పూలేనే చితికి నిప్పు పెట్టింది. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇదే.పూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతను స్వీకరించి నడిపించింది.
ప్లేగు వ్యాధి బాధితులకు సహాయం చేస్తూ ఆ వ్యాధి కే బలైంది.
1896- 97 లో సంబంధించిన తీవ కరువు పేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి ఈ స్థితిలో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదల కోసం జోల పట్టి విరాళాలు సేకరించి అందించింది. ప్లేగు వ్యాధి సోకిన పేదలకు దగ్గర నుండి సేవలందించింది. చివరికి ఆ ప్లేగు వ్యాధి ఆమెకు సోకి మార్చి 10 1897లో మరణించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించాడు.
సావిత్రిబాయి పై మనువాదుల వివక్ష.
భారతదేశ చరిత్రలో తొలి మహిళ గురువుగా చదువుల తల్లి సావిత్రిబాయి సేవలను మనువాదులు గుర్తించకుండా చారిత్రక ఆధారాలు లేని పురాణాలలోని సరస్వతి దేవి నిజమైన చదువుల తల్లి అంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారు.
బహుజన వర్గాలు తమ పిల్లల అక్షరాభ్యాసం సరస్వతి దేవి ముందు చేయిస్తున్నారు. ఇప్పటికైనా అసలైన చదువుల తల్లి సావిత్రిబాయి పూలేను గుర్తించి గ్రామ గ్రామాన ఆమె జన్మదినం కార్యక్రమాలు జరపాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.

