మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సోమ గూడెం రియల్ హీరో శ్రీనివాస్ కు ఘన సన్మానం.

 ముగ్గురి ప్రాణాలు కాపాడిన సోమగూడెం రియల్ హీరో ఈరవేని  శ్రీనివాస్ కు ఘన సన్మానం.

 ముగ్గురు ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్ కు పెద్దనపల్లి సర్పంచ్ వేముల కృష్ణ సన్మానం.







  

Scv News Kasipet :--

రోడ్డు మీద ప్రమాదంలో తీవ్రంగా  గాయపడి రక్తస్రావం జరుగుతూ రక్షించండి... రక్షించండి అని ఎంతోమంది  ప్రాధేయ పడుతున్న పట్టించు కోకుండా తమ వాహనాలపై వెళ్లే వారు ఎందరో ఉన్నా ఈ సమాజంలో గోదావరిలో దూకి తమ ప్రాణాలను తీసుకుంటున్న తల్లి ఇద్దరు కూతుళ్ళను తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారిని కాపాడిన సాహస వీరుడు సోమగూడెం పాత బస్తికి చెందిన ఇరవేణి శ్రీనివాస్. శ్రీనివాస్ ధైర్య సహసాలు వెలకట్ట లేనివి . ప్రాణదాత, ధైర్య శీలి శ్రీనివాస్ కు కాసిపేట మండల ప్రజల తరఫున సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది. సాహస వీరుడు కి పెద్దనపల్లి పంచాయతీ సర్పంచ్ వేముల కృష్ణ, భరత కాలనీవాసులు, యువకులు పాత్రికేయులు సోమవారం రాత్రి శాలువలు పూలమాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ వేముల కృష్ణ మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ ముద్దు బిడ్డ మాకు అత్యంత ప్రీతిపాత్రు డైన ఈరవేణి శ్రీనివాస్ తన ఉద్యోగరీత్యా గోదావరిఖనిలోని 7 యల్ పి లో సింగరేణి ఉద్యోగంచేస్తున్నాడని తన విధులను ముగించుకొని తిరిగి వస్తుండగా గోదావరినది లో నస్పూర్ పట్టణానికి చెందిన మహిళా,తన ఇద్దరు చిన్న పిల్లలను నదిలో వేసి తను దూకడంతో అప్పుడే వస్తున్నా శ్రీనివాస్ చిన్న పిల్లలను చూసి చలించి వెంటనే ఏమి ఆలోచించ కుండా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గోదావరినది లో దూకీ వారిి  ప్రాణాలను కాపాడారన్నారు.ఇప్పుడున్న సమాజంలో ఏమైనా ప్రమాదం జరిగితే సెల్ ఫోన్ లో విడియో ఫొటోలు తీసి మాధ్యమంలో ప్రచార సాధనంగా మారిన ఈ రోజుల్లో తన కుటుంబం ఏమైనా ఫర్వాలేదు కాని ఆపదలో ఉన్న వారిని కాపాడాలని దృడనిచ్చయంతో కాపాడిన  రియల్ హీరో శ్రీనివాస్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సోమగూడెం కే ఉప సర్పంచ్ కనుకుల రాకేష్, మన తెలంగాణ విలేకరి టి రవిరాజ్ , సాక్షి విలేకరి కూకట్ల రాజేష్, యం ఆర్ పి యస్ నాయకులు కల్వల శరత్, స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలియజేశారు.