మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా అగ్గి సత్తయ్య.

 మున్నూరు కాపు సంఘం  కాసిపేట మండల అధ్యక్షుడి గా అగ్గి సత్తయ్య

 కాసిపేట మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన అగ్గి సత్తయ్య.



 ఎన్నికల్లో పాల్గొన్న మున్నూరు కాపు సభ్యులు.

Scv News Kasipet :--

మంచిర్యాల జిల్లా కాసిపేట మండల మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక  ఈరోజు బెల్లంపల్లి మండలం సోమగూడెం ఫంక్షన్ హాల్ లో కాసిపేట మండల మున్నూరు కాపు అధ్యక్ష ఎన్నిక నిర్వహించారు. ఎన్నికలో అధ్యక్షులుగా ముగ్గురు అభ్యర్థులు అగ్గి సత్తయ్య, ఇంగు నారాయణ, అగ్గి వెంకటేశ్వర్లు ఎన్నికల బరిలో నిలిచారు. దింతో ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహించారు.  మున్నూరుకాపు సభ్యులు తమ ఓటు హక్కు వినయోగించు కున్నారు.  ఈ ఎన్నికల బరిలో అగ్గి సత్తయ్య 67 ఓట్ల  మెజార్టీతో కాసిపేట మండల అధ్యక్షుడిగా గెలుపొందారు. అగ్గి సత్తయ్య అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఎన్నికల నిర్వాహకులు ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం కాసిపేట మండల సభ్యులు పాల్గొన్నారు.