తెలంగాణలో అవినీతి వ్యతిరేక వారోత్సవాల జాడేది?
అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్బంగా 'scv News' ప్రతేక కథనాలు.
Scv News Kasipet:--
అవినీతికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు 2003 అక్టోబర్ 31న ఐక్యరాజ్యసమితి అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి సమావేశం ఆమోదించి నప్పటి నుంచి ఏటా డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం నిర్వహించ బడు తోంది.అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతాయి. దారిద్య్రం,వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోతాయి. అవినీతిని అరికట్టేందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం,తెలంగాణ ప్రభుత్వం ప్రజలను చైతన్యవంతం చేసేందు కు దశాబ్దాలుగా అవినీతి నిరోధక వారోత్సవాలను నిర్వహిస్తు న్నాయి. అవినీతిపరుల ఆగడాలను అరికట్టేందుకు ప్రతి సంవత్సరం అవినీతి నిరోధక శాఖ జిల్లా, మండల స్థాయిలో విస్తృతంగా వాల్ పోస్టర్లు వేసి, అవగాహన సమావేశాలను ఏర్పాటు చేసేది. ఎవరైనా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది లంచం అడిగితే తమ ఫోన్ నెంబర్లకు సమాచారం ఇస్తే పట్టుకుంటామని ఏసీబీ అధికారులు పత్రికలలో ప్రకటనలు ఇచ్చేవారు. ఈ సంవత్సరం తెలంగాణలో రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఎలాంటి ప్రచారం నిర్వహించ కపోవడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏసీబీ దాడులు, ప్రచారం వల్ల అవినీతి పరులు కొంతైనా భయపడేవారని తెరాస పాలనలో అవినీతిపరులు భయం లేకుండా పోయిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవు తున్నాయి. ప్రజల ఫిర్యాదుల మేరకు ఏసీబీ వారు అవినీతిపరులను పట్టు కున్న వారికి శిక్షలు పడకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శలు ఉన్నాయి.రాష్ట్రంలో 2016 నుంచి నమోదైన 350 ఏసీబీ కేసుల్లో 65% కేసులకు ప్రభుత్వం నుండి ప్రాస్క్యూషన్ అనుమతి లభించడం లేదని విమర్శలు మేధావి వర్గాల నుండి వినిపిస్తున్నాయి.
నేటి సమాజంలో అవినీతి, అక్రమ సంపాదన క్యాన్సర్ ల విస్తరిస్తూ సర్వ వ్యవస్థలన్నిటినీ కూలిపోయేలా చేస్తుంది. ప్రజల పన్నులతో వేతనాలు తీసుకొని ప్రజలకు ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ప్రతి పనికి లంచం తీసుకుని పనిచేయడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందించి, అవినీతి అక్రమాలను అరికట్టాల్సిన ప్రభుత్వం యంత్రాంగం తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని విమర్శలు సర్వాత్ర వ్యక్తం అవుతు న్నాయి. ఫలితంగా అవినీతి అక్రమాలకు పాల్పడే వారు దర్జాగా తిరుగుతూ మరింత ధనికులు గాను, పేదలు మరింత కటిక దరిద్రులుగా నేటి సమాజం లో కొనసాగుతున్నారు.
రాజకీయా అవినీతి అన్నిటికి మూలం.
సమాజంలో రాజకీయ అవినీతి పెచ్చరిల్లుతుండడంతో గ్రామాల అభివృద్ధికి ఆటంకంగా మారింది. వివిధ పార్టీల రాజకీయ నాయకు లు గ్రామపంచాయతీ నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ఓటర్ల కొనుగోలుకు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తు న్నారు.గెలిచిన తర్వాత మళ్లీ ఖర్చు చేసిన డబ్బులను సంపాదించు కోవడం కోసం గ్రామాభివృద్ధి కోసం ప్రజా సంక్షేమానికి వచ్చే ప్రభుత్వ నిధులను స్వాహా చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేసే గుత్తేదారుల వద్ద పర్సంటేజీల రూపేనా వసూలు చేస్తుండడంతో అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తుంది. కాసిపేట మండలంలో గత మూడున్నర దశాబ్దాలలో నాయకులు, అధికారుల అవినీతి వల్ల నాణ్యత లోపించిన పనులు చేయడం వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయ్యింది. సమాజంలో అవినీతిని అరికట్టేం దుకు ప్రజలు చైతన్యవంతం కావాలి. అవినీతి అక్రమాలపై మేధావులు పౌర సమాజం స్పందించినప్పుడే తగ్గుముఖం పడుతుంది.
(అవినీతి వ్యతిరేక వారోత్సవాల సందర్భంగా కాసిపేట మండలంలో మండల వ్యవస్థ ఏర్పడ్డ 1987 నుండి గత 35 ఏళ్లుగా తెదేపా, కాంగ్రెస్,తెరాస ప్రభుత్వాల హాయంలో కొనసాగిన అవినీతి అక్రమాలపై, అవినీతిపరుల భరతం పట్టిన బహుజన యోధుల గురించి సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వరుస కథనాలు రేపటి నుండి ఇవ్వడం జరుగుతుంది.)

