మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజా సేవకుడు, ఆదర్శప్రాయుడు అమరుడు తీర్థాల భాస్కర్ ద్వితీయ వర్ధంతి.

 నేడు

 ప్రజా సేవకుడు అమరుడు 

తీర్థాల భాస్కర్ ద్వితీయ

వర్ధంతి.


  అమరుడు తీర్థాల భాస్కర్ 

Scv News Kasipeta:--

' నీకోసం జీవిస్తే నీలోనే ఉంటావు. జనం కోసం జీవిస్తే జనంలోనే నిలిచి పోతావు ' అన్నా బాబా సాహెబ్ అంబేద్కర్ మహనీయుడి గారి మాటలు ప్రజా సేవకుడు తీర్థాల భాస్కర్ కు సరిగ్గా సరిపోతాయి. తమ జీవితాంతం ప్రజల కోసం సమాజ మార్పు కోసం అహర్నిశలు కృషి చేశాడు. భాస్కర్  పేదరికంలో మగ్గుతున్న బహుజన వర్గాలను చైతన్యవంతం చేయడం,  వారికి మానవతా దృక్పథంతో సహాయం చేసేందుకు ఎల్లవేళలా కృషి చేశాడు. మండలంలో, గ్రామంలో జరుగుతున్న అవినీతి,అక్రమాలపై రాజీ లేని పోరాటాలు చేశాడు. తన జీవిత మంతా రైతులను పేద ప్రజలను చైతన్యవంతం చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ గడిపిన నిస్వార్థ ఉద్యమకారుడు భాస్కర్. అతడి సేవా కార్యక్రమాలు కాసిపేట మండలంలోని గిరిజన గూడాలు  నిరుపేద కుటుంబాలలో ముఖ్యంగా కోనూరు గ్రామ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.భాస్కర్ ద్వితీయ  వర్ధంతి సందర్భంగా మండల ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకోవడం మానవతావాదులుగా మన కర్తవ్యంగా భావించి  ఆయన చేసిన సేవల గురించి  scvNews  ప్రత్యేక కథనం అందిస్తుంది..

కోనూరు గ్రామం పేరు చెప్తే గుర్తుకు వచ్చే మొదటి పేరు తీర్థాల భాస్కర్.


కాసిపేట మండలంలోని కోనూరు గ్రామం అన్ని రకాలుగా ఆర్థికం గా,వ్యవసాయ పరంగా, విద్యపరంగా చైతన్య వంతమై అభివృద్ధి పథంలో నడుస్తున్న గ్రామం. వ్యవసాయపరంగా అభివృద్ధి చెంది మారుతున్న కాలానికి అనుకూలంగా గ్రామస్తులు చదువు విలువ తెలిసి తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.ప్రత్యేక శ్రద్ధతో ఉన్నత చదువులు చదివి పోలీసు అధికారులుగా,డాక్టర్లు, ఇంజనీర్లుగా ప్రభుత్వ శాఖల్లో  ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారు మండలం లో అత్యధికంగా  ఈ గ్రామం వారే ఉన్నారు. కానీ ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించిన  గ్రామ యువకులు చాలామంది  గ్రామానికి, సమాజానికి ఎలాంటి సహాయం చేయకుండా వారి కుటుంబాల వరకే పరిమితంగా జీవిస్తున్నారు.అందరికీ భిన్నంగా తీర్థాల భాస్కర్ మాత్రం ప్రజా సేవకే అంకితంమై గ్రామం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రజా నాయకుడిగా గ్రామ ప్రజల గుండెల్లో స్థాయిలో  నిలిచిపోయాడు .

తీర్థాల భాస్కరు మామూలు సన్న కారు రైతు కుటుంబంలో జన్మించాడు. పెద్దగా భూములు లేవు.ఆర్థికంగా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు లేకున్నా అభ్యుదయ భావాలతో పాటు సేవాభావం,మానవతా విలువలు కలిగిన మహనీయుడు. గ్రామానికి ఏదైనా సమస్య వచ్చిన, గ్రామంలోని తోటి వ్యక్తులకు ఏ ఆపద వచ్చినా వెంటనే స్పందించి వారి సమస్యలను తీర్చడానికి ముందుండే వాడు. పోలీసు రెవెన్యూ ఇతర ప్రభుత్వశాఖల పనులన్నీ  ముందుండి గ్రామస్తులకు చేయించేవాడు.గ్రామంలో గత 30 ఏళ్లుగా ప్రజలకు ప్రతి సమస్యపై పరిష్కారం చూయించి గ్రామాభివృద్ధి కి ఎంతో కృషి చేశాడు.సోమగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా మండలం లోని వివిధ  గ్రామాల అభివృద్ధి తో పాటు ప్రజా, సేవ కార్యక్రమాలు, వైద్య శిబిరాలు  నిర్వహించి మండలంలో మంచి పేరు సంపాదించాడు.లయన్స్ క్లబ్ ద్వారా కోనూరు పంచాయతీ స్మృతి వనం లో పిల్లల పార్క్ కోసం 10 లక్షల నిధులను మంజూరు చేయించ డంలో క్రియాశీల పాత్ర పోషించాడు .కోనూరు గ్రామం పేరు వస్తే ప్రభుత్వ అధికారులకు, వ్యవసాయ అధికారుల కు, పకృతి ప్రేమికులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు  ముందుగా గుర్తుకు వచ్చే పేరు తీర్థాల భాస్కర్. తీర్థాల  భాస్కర్ అంటేనే కోనూరు, కోనూరు అంటేనే తీర్థాల భాస్కర్ అనే రీతిలో గ్రామంలో పకృతి వ్యవ సాయం, గ్రామంలోని అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో నిర్వహించిన గొప్ప వ్యక్తి.  గ్రామంలోని విద్యార్థులను, యువకులను ఉన్నత చదువుల కోసం ప్రోత్సహించి  ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహిస్తూ మార్గం చూపిన మార్గదర్శి.

అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు తీర్థాలభాస్కర్.

 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కొండాపూర్ లోని నిరహర దీక్షలో అభివాదం చేస్తున్న భాస్కర్.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన లో మండలం నుండి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడంలో క్రియాశీల పాత్ర పోషించిన వ్యక్తుల్లో తీర్థాల  భాస్కర్ ఒకరు.  తెలంగాణ ఉద్యమంలో  చురుగ్గా పాల్గొని రాష్ట్ర సాధన కోసం ఎనలేని కృషి చేసిన త్యాగశీలి తీర్థాల భాస్కర్. మండలం లోని కొండాపూర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  మాజీ మండల పరిషత్ అధ్యక్షుడు స్వర్గీయ రఘుపతి రావు గారి సహకారంతో యాభై మూడు రోజుల రిలే దీక్ష శిబిరానికి ఇన్చార్జిగా వ్యవహరించాడు. దీక్షా శిబిరాన్ని మొక్కవోని దీక్షతో ప్రతిరోజు ఎన్నో కష్టనష్టాలకోర్చి ప్రభుత్వ పరంగా ఎన్నో ఒత్తిడిలు వచ్చిన  ఎవరికీ భయపడకుండా దిగ్విజయంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడపడంలో క్రియాశీల పాత్ర పోషించిన అసలు సిసలైన తెలంగాణ ఉద్యమకారుడు భాస్కర్ .తెలంగాణ ఉద్యమ సమయంలో కోనూరు గ్రామానికి చెందిన ఇద్దరు  నిరుపేద యువకులు అసువులు బాసిన  వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత 10లక్షల  పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి రెండు నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయమూర్తి  భాస్కర్.    

మారుమూల గిరిజన గూడాలకు సేవా కార్యక్రమాల్లో ముందు ఉండేవాడు భాస్కర్.

 మండలంలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే కోలాం తెగ గిరిజనుల కోసం గత 15 ఏళ్ల క్రితం సా అనే స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా బట్టలు, నిత్యవసర వస్తువులు అందజేయడంలో క్రియాశీల పాత్ర పోషించాడు. సామాజిక చైతన్య వేదిక  కరోనా సమయంలో  లక్ష్మీపూర్  కోలామ్స్ కు నిత్యవసర వస్తువులను అందజేయడం జరిగింది లయన్స్ క్లబ్ పోలీసులు ఆధ్వర్యంలో సేవా కార్యక్ర మాల్లో పాల్గొన్నాడు.

మానవతా విలువలు కలిగిన మహనీయుడిని కోల్పోవడం మండల ప్రజలకు తీరనలోటు .కాసిపేట మండలంలో పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పాటు సేవా దృక్పథం, మానవతా విలువలు కలిగిన ప్రతి ఒక్కరూ తీర్థాల భాస్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి.  మండలంలోని వివిధ గ్రామాలలో అతడు పేద ప్రజలకు,  రైతులకు  చేసిన సేవలను గుర్తుచేసు కోవడం మానవతావాదుల మైన మన అందరి కనీస ధర్మంగా  సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా బావిస్తుంది.