మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో అమరుడు శ్రీకాంతచారి వర్ధంతి కార్యక్రమం.



 
తెలంగాణ ప్రభుత్వం

శ్రీకాంతచారి వర్ధంతిని

అధికారికంగా

జరుపకపోవడం శోచనీయం.

 -  శిలోజు మురళి,మండల జేఏసీ కన్వీనర్ 

 శ్రీకాంతాచారి కి నివాళులర్పిస్తున్న విశ్వబ్రాహ్మణులు వివిధ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు.


Scv News Kasipet:--

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం శ్రీకాంతచారి ఆత్మ బలిదానం తోటే వచ్చిందని అతడి త్యాగ ఫలితంగా గద్దెనెక్కిన ప్రభుత్వం వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా జరుపకపోవడం శోచనీయమని కాసిపేట మండల జేఏసీ కన్వీనర్ శిలోజు మురళి విమర్శించారు.ఈ రోజు కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆత్మ బలిదానం చేసిన అమరుడు శ్రీకాంతచారి 13వ వర్ధంతి కార్యక్రమం  విశ్వబ్రాహ్మణ సంఘం, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. మొదట శ్రీకాంతచారి చిత్రపటా నికి విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకుడు మండల జేఏసీ కన్వీనర్ శిలోజి మురళి, వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం శిలోజు మురళి అధ్యక్షతన శ్రీకాంతాచారి స్మారక సమావేశం జరిగింది.


ఈ సందర్భం గా శిలోజు మురళి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో శ్రీకాంత్ చారి తన ప్రాణాన్ని పణంగా పెట్టారన్నారు. అతడి బలిదానాన్ని ప్రభుత్వం పట్టించు కోవడం లేదని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాంతాచారి శవం పై కుర్చీ వేసుకుని పరిపాలన సాగిస్తుంద న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ రెండు రోజుల అమరణ నిరాహార దీక్ష చేసి మధ్యలో విరమించేందుకు ప్రయత్నిస్తే ఉస్మానియా కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారన్నారు. కెసిఆర్ దీక్షవిరమిస్తే  తెలంగాణ ఉద్యమం ఎక్కడ బలహీనపడుతుందోనని శ్రీకాంతా చారి ఆందోళన చెంది తన బలిదానం వల్ల నైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేశార ని గుర్తు చేశారు. శ్రీకాంత్ చారి ప్రాణ త్యాగాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించ డం లేదని అధికారికంగా వర్ధంతి చేయక పోవడం శోచనీయమని అన్నారు.


మం7డల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోచం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కోసం  శ్రీకాంతచారి  బలిదానం కావడం బాధాకరమన్నారు.


మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ మాట్లాడుతూ శ్రీకాంతాచారి తెలంగా ణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రాణ త్యాగం చేశాడని ప్రభుత్వం అతని త్యాగాన్ని గుర్తించి వర్ధంతి కార్యక్రమం చేయక పోవడం బాధాకర మన్నారు. మండల జిల్లా కేంద్రాల్లో శ్రీకాంతచారి విగ్రహాలు పెట్టాలని కోరారు.


జన సమితి జిల్లా కార్యద ర్శి గోనెల శ్రీనివాస్  మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం పోరాటం చేసి శ్రీకాంతాచారి అమరుడయ్యార న్నారు.తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల స్మారకంగా ప్రతి మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం నిర్మించాలన్నారు.


సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల కోసం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా శ్రీకాంతచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడన్నారు.అతడి త్యాగ ఫలితం గానే ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకున్నా మని జయంతి వర్ధంతి కార్యక్రమాలు కేవలం విశ్వబ్రాహ్మణు లు చేయడం
శోచనీయమన్నా  రు.అమరుల త్యాగాలను తెలంగాణ సమాజం మొత్తం గుర్తించుకుని వర్ధంతి,జయంతి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.


సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడు తూ సమాజం కోసం పనిచేసే అమరులైన వారిని సమాజం గుర్తుంచు కుంటుందని, కుటుంబం కోసం పనిచేసే వారిని కుటుంబం మాత్రమే గుర్తుంచు కుంటుందని ఇది చారిత్రక సత్యమని అన్నారు.శ్రీ కాంత చారి చేసిన ప్రాణ త్యాగం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని ప్రభుత్వ పాలకులు అతడి వర్ధంతి కార్యక్రమాలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.


సామాజిక చైతన్య వేదిక ముఖ్య సలహా దారు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం శ్రీకాంతాచారి తన ప్రాణ త్యాగం చేసిన విశ్వవిజయుడని కొనియాడారు. మండల కో ఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్ మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్రం కోసం నిస్వార్ధంగా పోరాటం చేసిన ఉద్యమ కారులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం అమరవీరులను పట్టించుకోని శ్రీకాంత్ చారి వర్ధంతి జయంతి కార్యక్రమాలను అధికారికంగా చేపట్టాలని కోరారు.


విశ్వబ్రాహ్మణ సంఘం మండల ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజేంద్ర చారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంత్ చారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవాలని వర్ధంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టాలని కోరారు.


తదానంతరం వివిధ పార్టీలు ప్రజాసంఘా ల నాయకులు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీకాంత్ చారి వర్ధంతి, జయంతి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా చేపట్టాలని మండల తాహ సిల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో కాసిపేట ఉప సర్పంచ్ సుమన్,  విశ్వబ్రాహ్మణ సంఘం మండల, గ్రామ కమిటీ నాయకులు వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకులు  పాల్గొన్నారు.