మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల నిజమైన హీరోలు అవినీతి అధికారుల బరతం పట్టిన యువకులే!

 అవినీతి అధికారుల భరతం పట్టిన యువకులకు సా చై వే ఆధ్వర్యంలో సన్మానం.

 అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించిన యువకులను సన్మానిస్తున్న   సామాజిక చైతన్య వేదిక నాయకులు.

అవినీతి అధికారులను ఎందుకు పట్టించాల్సి వచ్చిందో వివరిస్తున్న సన్మాన గ్రహీతలు  కాసిపేట మండల హీరోలు. 



Scv News Kasipet:--

ప్రభుత్వ కార్యాలయాలలో ప్రజలు వివిధ రూపేనా కట్టే పన్నుల నుండి వేతనాల తీసుకొని ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ అధికారులు సిబ్బంది, ప్రతి పనికి లంచాలు తీసుకుంటూ ప్రజలను పీడిస్తున్నారు. అలాంటి అవినీతి అధికారుల భరతం పట్టిన యువకులే నేటి సమాజంలో నిజమైన హీరోలని కాసిపేట మండల సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య కొనియాడారు. ఈరోజు కాసిపేట మండల ప్రెస్ క్లబ్ లో అవినీతి నిరోధక వారోత్సవాల ముగింపు సందర్భంగా గత టిడిపి,కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అవినీతి అధికారులను అవినీతి నిరోధక శాఖ కు పట్టించిన కాసిపేట మండల యువకులను సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో సన్మానం చేసింది.


ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ నేడు అన్ని వ్యవస్థలు అవినీతి అక్రమాలలో కూరికి పోయాయని పైసలు ఇవ్వనిదే పని జరగడం లేదన్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అవినీతి అధికారుల భరతం పట్టడం ఎంతో సాహసమైన చర్య అని కొనియాడారు. అలాంటి యువకుల ధైర్య సాహసాలను నేటి సమాజానికి తెలియజెప్పి అవినీతి అక్రమాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ద్వారా మండలంలో గత 35 సంవత్సరాలుగా 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కథనాలు ఇవ్వడం జరిగిందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారంతా ఆధిపత్య కులాలకు చెందిన వారేనని ఏ పార్టీ అధికారం లోకి వస్తే ఆ పార్టీలోకి మారి ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేశారన్నారు. మండలంలోని బహుజన వర్గం అయిన ఎస్సీ ఎస్టీ బీసీ యువకులను ఆలోచించకుండా, చైతన్యం కాకుండా మద్యం మత్తులో ఉంచి ఆధిపత్య కులాల వారు మండలంలోని ప్రజా ధనాన్ని స్వాహా చేస్తున్నారని విమర్శిం చారు. బహుజన వర్గాలంతా చైతన్య వంతమై బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రవేశపెట్టిన హక్కులను వాడుకోవాలని కోరారు.  సమావేశంలో అవినీతి పై జరిగిన చర్చ కార్యక్రమంలో అవినీతిపై ప్రభుత్వ నిర్లక్ష్యము,అవినీతి అధికారుల పై చర్యల గురించి వక్తలు మాట్లాడారు.

ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి కలవల శరత్ మాట్లాడుతూ తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలో మండల యువకులు అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించారని తెరాస పాలనలో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్న ఒక్కరిని కూడా పట్టించుకోవడం లేదన్నారు.అవినీతి నిరోధక శాఖసరిగా పనిచేయడం లేదని విమర్శించారు. అవినీతికి పాల్పడే వారిని పట్టుకునేందుకు అవినీతి నిరోధక శాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అవినీతి నరికట్టా లని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.


తెలంగాణ జన సమితి జిల్లా కార్యదర్శి గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో రెండు రకాల మనుషులు ఆశావాదులు, అవకాశావాదులు ఉన్నారన్నారు. ఆశావాదులు ప్రజల మార్పు కోసం ప్రజల కోసం పోరాడు తుంటే అవకాశ వాదులు తమ స్వార్థ ప్రయోజనాలకు, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి వారిని ఇబ్బందుల పాలు చేస్తారని అన్నారు.

తుడుం దెబ్బ మండల శాఖ అధ్యక్షుడు ఆత్రం జంగు మాట్లాడుతూ అవినీతి అధికారుల ఆగడాలన అరికట్టేందుకు ప్రజాసంఘాలంతా ఏకమై ఉద్యమించా లన్నారు.


తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడవి వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల పన్నులు తో జీతాలు ఇస్తూ తమకు సేవ చేయాలని ప్రభుత్వ అధికారులను సిబ్బందిని జీతగాళ్లుగా ప్రజలు పెట్టుకున్నారని వారితో పనులు చేసుకునేందుకు మళ్లీ లంచాలు ఇవ్వడం మానుకోవా లన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రాష్ట్రంలో గత ఎనిమిదేలుగా విచ్చలవిడిగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. రెవెన్యూ పోలీసు శాఖలో ప్రతి పనికి లంచం ఇవ్వనీదే పనులు ఎవరు చేయడం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు ఇచ్చిన తీసుకున్న లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చిందేన్నారు. తెరాస ప్రభుత్వం ఏసీబీ ని పటిష్ట పరిచి అవినీతిని అరికట్టాలని కోరారు

సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు,ముఖ్య సలహాదారు మద్దిలేని చిన్న భీమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు లక్షలాది రూపాయల వేతనాలు తీసుకుంటూ ప్రజలకు ఉచితంగా పనులు చేయాల్సి ఉండగా కక్కుర్తి తో ప్రజల వద్ద లంచాలు తీసుకోవడం దారుణం అన్నారు. ప్రజలు కూడా చైతన్యవంతమై అవినీతి అధికారులకు ఆట కట్టించాలని కోరారు. తదనంతరం అవినీతి అధికారులను ఏసీబీకి శిలోజు మురళి, మెయిన్రపు రాజన్న, చెల్లె రవి, కురుమ నరసయ్యను సామాజిక చైతన్య వేదిక నాయకులు ప్రజాసంఘాల నాయకులు పూలదండలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అవినీతి అధికారులకు ఎందుకు పట్టించాల్సి వచ్చిందో సన్మాన గ్రహీతలు వివరించారు.


సిలోజ్ మురళి మాట్లాడుతూ సమాజంలో అవినీతిని అరికట్టాల్సిన అవినీతి నిరోధక శాఖ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏసీబి అధికారులు ప మాలాంటి వారిని సన్మానించాల్సి ఉన్న పదేళ్లుగా మమ్ములను పట్టించుకోవడం లేదన్నారు. మా సహాసాలను గుర్తించి సామాజిక చైతన్య వేదిక సన్మానించడం మాకు గర్వకారణంగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ఉపాధ్యక్షుడు గోడిసెల సురేందర్ , జలపతి తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం 


అవినీతి రెవెన్యూ అధికారులను పట్టించిన తమ భూ సమస్యలు తీరలేదని తమ సమస్య తీర్చాలని శిలోజు మురళి, కురుమ నరసయ్యలు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో తాసిల్దార్ దిలీప్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. పది రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తాసిల్దార్ దిలీప్ కుమార్ హామీ ఇచ్చారు.