అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం - 4
లంచగొండులను ఏసీబీకి పట్టిపోవడంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాసిపేట మండలమే ప్రథమం.
- 20 ఏళ్లలో ఆరుగురు అవినీతి అధికారులు కటకటాలపాలు
![]() |
| అవినీతి అధికారుల భరతం పట్టిన కాసిపేట మండల బహుజన యోధులు. |
![]() |
| కాసిపేట తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు పట్టుబడ్డ ఎమ్మార్వో రోశయ్య (పాతచిత్రం) |
ప్రస్తుత సమాజంలో అవినీతి, అక్రమ సంపాదన క్యాన్సర్ ల విస్తరిస్తూ ప్రభుత్వంలోని వ్యవస్థలన్నిటినీ కూలిపోయేలా చేస్తుంది. సామాన్య ప్రజలు తమ సమస్యలను తీర్చు కునేందుకు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే పైసలు ఇవ్వనిదే పని జరగడం లేదు. ప్రజల పన్నులతో వేతనాలు తీసుకొని ప్రజలకు ఉచిత సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు ప్రతి పనికి లంచం తీసుకుని పనిచేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన పరిపాలన అందించి, అవినీతి అక్రమాలను అరికట్టాల్సిన ప్రభుత్వం యంత్రాంగం తన విధులను సక్రమంగా నిర్వర్తించ డం లేదని విమర్శలు సర్వాత్ర వ్యక్తం అవుతున్నాయి. ఫలితంగా అవినీతి అక్రమాలకు పాల్పడే వారు దర్జాగా తిరుగుతూ మరింత ధనికులు గాను, పేదలు మరింత కటిక దరిద్రులుగా నేటి సమాజం లో కొనసాగుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలలో ఉచితంగా చేయవలసిన పనులను ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అధికారులు సిబ్బంది వారి పనులు చేసి పెట్టింది లంచాలు తీసుకుంటు న్నారు. చట్ట ప్రకారం లంచం తీసుకోవడం, ఇవ్వడం రెండు నేరమైన కూడా చాలామంది ప్రజలు చైతన్యం లేక తమ పనులు సరిదిద్దు కోవడం కోసం పరిస్థితులకు రాజీపడి లంచాలు ఇచ్చి పనులు చేసుకుంటున్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిని నిర్మూలిం చేందుకు ఏసీబీ, సీబీఐ లతో దాడులు చేస్తూ అప్పుడప్పుడు అక్రమార్కులను పట్టుకుంటున్నారు. అవినీతిపరుల సమాచారం తమకు అందజేస్తే పట్టు కుంటామని ప్రకటనలు చేస్తున్నా ప్రజలకు సరైన అవగాహన లేక పోవడంతో పట్టించు కోవడం లేదు.తమ పనులు చేసుకునేందుకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి లంచాలు ఇచ్చి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అన్ని శాఖలు అవినీతి జరుగుతున్న ఫిర్యాదు లేకపోవడంతో అవినీతి నిరోధక శాఖ ఏమి చేయలేక పోతోంది.కొంతమంది నూటికి ఒక్కరు చైతన్యవంతమైన యువకులు మాత్రం లంచం ఇవ్వడం ఇష్టం లేక అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ముందుకు వచ్చి అవినీతి అధికారులను ఆశ్రయించి పట్టిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత టిడిపి, కాంగ్రెస్ ప్రభుత్వంల హాయంలో 20 ఏళ్లలో కాసిపేట మండల యువకులు ఆరుగురు అవినీతి అధికారుల సిబ్బందిని ఏసీబీకి పట్టించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత తెరాస ప్రభుత్వ హాయంలో కూడా ప్రభుత్వ కార్యాలయాలలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్న ఏసీబీ శాఖ అలసత్వం వల్ల అవినీతి పరులను పట్టుకోలేక పోతున్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
లంచగొండి అవినీతి అధికారులను ఏసీబీ అధికారులకు పట్టివ్వడం ఎంతో సాహసోపేతమైన చర్య. సమాజానికి చీడపురుగుల వ్యవహరిస్తున్న అవినీతి అధికారులను పట్టించిన యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్న నేటి సమాజంలో ఎవరు వారిని పట్టించు కోక పోవడం దురదృష్టకరం.కాసిపేట మండలంలో ధైర్య సహాసాలు చేసి అవినీతి అధికారుల భరతం పట్టిన బహుజన యోధుల గురించి సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక కథనం అందిస్తుంది...
కాసిపేట మండలం అంటేనే దశాబ్దాలుగా అవినీతి అక్రమాలకు నిలయం అనే ప్రచారం ఉంది. కొంతమంది ఆధిపత్య కులాలకు చెందిన రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిధులను స్వాహా చేసేందుకు అధికార పార్టీల ముసుగులో ఉండి ప్రభుత్వ అధికారులను,సిబ్బందిని వేధించే వారు. వారి వేధింపులకు బరించలేక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది మండలానికి వచ్చి పని చేసేందుకు సాహసించే వారు కాదు. కొంతమంది మాత్రం రాజకీయ నాయకుల అవినీతిని తనకు అనుకూలంగా మార్చుకొని వారి పనులు చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ఉండేవారు. రాజకీయ నాయకుల అండతో అవినీతి అధికారులు రెచ్చిపోయి వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో పైసా ఇవ్వనిదే పనిచేసే వారు కాదు. వారి అవినీతి అక్రమాలను భరించలేక కొంతమంది యువత చైతన్యవంతమై అవినీతి అధికారుల అంతు చూసేందుకు ముందుకు వచ్చారు. మండలంలో సామాజిక చైతన్యం కలిగి, ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసే తెలంగాణ ఐకాస కన్వీనర్ సిలోజు మురళి మొట్ట మొదటిసారి అవినీతి అధికారులను ఏసీబీకి పట్టించాడు.
తండ్రికి ఇచ్చిన భూమిని చూపెట్టాలని కోరిన ఫలితం లేక ఏసీబీ కి సర్వేయర్ నుపట్టించిన శిరోజ మురళి.
ముత్యం పెళ్లి గ్రామానికి చెందిన శిలోజు మురళి తన తండ్రి సిలోజు రాజయ్యకు వారసత్వంగా 1972లో 38 /ఈ కింద ముత్యం పెళ్లి గ్రామ శివారులో 11 గుంటల భూమి పట్టా ఇచ్చారు. భూమి మాత్రం చూపెట్టలేదు మండల వ్యవస్థ ఏర్పాటు నుంచి నాన్నకు ఇచ్చిన భూమి చూపెట్టాలని తహసిల్దార్ కార్యాలయం చుట్టూ దరఖాస్తు చేసిన పట్టించుకోలేదు. 1996 డిసెంబరు అప్పటి తాహసిల్దార్ బ్రహ్మయ్య హాయంలో భూమి కొలతల గురించి బ్యాంకులో చాలన్ కట్టాడు. చాలన్ తీసుకొని తహసిల్దార్ ఇస్తే ఆర్ ఐ నుంచి సర్వేర్ కు రాశారు. సర్వే చేసి భూమి చూపాలని సర్వేయర్ చుట్టూ ఆరు నెలలు తిరిగిన పట్టించుకోలేదు.భూమి విలువలో 10 శాతం లంచం ఇస్తేనే భూమి కొలిచి పెడతాను అని షరతు పెట్టాడు. లంచమిచ్చే స్తోమత లేక అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించి 12 డిసెంబర్ 1996లో పట్టించాడు.
ముంపు భూమి డబ్బుల కోసం ముప్పు తిప్పలు పెట్టిన విఆర్ఓ ను పట్టించడం రైతు మేనరపు రాజయ్య.
మండలంలోని బుగ్గ గూడెం పంచాయతీలోని కర్షల ఘట్టం చెరువు నిర్మాణంలో బుగ్గగూడెం గ్రామానికి చెందిన మెయిన్రపూర్ రాజయ్య కు చెందిన మూడు ఎకరాల భూమి ముంపుకు గురైంది.అదే గ్రామానికి చెందిన 40 మంది రైతులకు చెందిన 65 ఎకరాల భూమి కూడా అయింది. ప్రభుత్వం పరిహారం కింద అప్పుడు ఎకరానికి 1,39,480 రూపాయలు మంజూరయ్యాయి. ప్రభుత్వం నుండి వచ్చిన చెక్కులను అప్పటి వీఆర్వో నాగుల దుర్గయ్య ఒక్కొక్క రైతు నుండి 5 నుండి 10,000 డిమాండ్ చేశారు. గ్రామంలో చాలా మంది పేద రైతులు తాము ఇచ్చే పరిస్థితిలో లేమని వేడుకున్న వినలేదు. చేసేది లేక మేనరపు రాజయ్య అవినీతి అధికారులను ఆశ్రయించి 16 డిసెంబర్ 2009లో వీఆర్వో దుర్గయ్య ను పట్టించాడు.
సీలింగ్ భూమి పట్టా కోసం ఎమ్మార్వో ను ఏసీబీకి పట్టించిన కొట్టే భీమయ్య .
ధర్మ రావు పేట గ్రామానికి చెందిన కొట్టే భీమయ్య కుటుంబ సభ్యులకు మల్కె పెళ్లి శివారులోని సర్వేనెంబర్ 56,51,48 లో 25 ఎకరాల సీలింగ్ పట్టా కింద అదే గ్రామానికి చెందిన ఆధిపత్య కులాల వారి భూమి వచ్చింది. రెవెన్యూ రికార్డులో తమ పేరిట భూమి ఆ భూమి ఎక్కడ ఉందో వారికి తెలవదు. తమకు సీలింగ్ పరంగా వచ్చిన భూమిని చూపెట్టి పట్టా చేయాలనే అప్పటి తాహసిల్దార్ గోవర్ధన చారిని కొరితే పట్టించుకోలేదు. రెండేళ్లుగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగిన వినలేదు.పట్టా చేయాలంటే లక్ష ఇరవైవేల నగదు ఇవ్వాలని,రెండు ఎకరాల భూమి తన పేరిట పట్టా చేయాలని షరతు పెట్టాడు. నిరుపేదలైన తమ వద్ద అంత డబ్బు లేదని 50 వేలు ఇస్తామని ప్రాధయపడిన ఒప్పుకోలేదు. అతని చుట్టూ తిరిగి తిరిగి వేసారి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించి 16 మే 2007లో మంచిర్యాలలో తన నివాసంలోనే ఏసీబీకి పట్టించాడు.
పన్నులు కట్టాలని వేధించి నందుకు వాణిజ్య పన్నుల అధికారిని ఏసీబీకి పట్టించిన ఐలి సురేందర్.
ముత్యం పెళ్లి గ్రామంలో జీవనోపాధి పొందేందుకు లక్ష్మీ ఎరువుల దుకాణం నడుపుకుంటున్నాడు. ఎరువుల విక్రయాలు లేక ఇటు దుకాణాన్ని సరిగా నడపడం లేదు అయినా తాము విగ్రహించిన ఎరువులకు ప్రభుత్వానికి పనులు చెల్లించాలని పదేపదే మంచిరాలకు చెందిన వానించే పనుల అధికారి పోచయ్య తరచూ వేధించే వాడు. తనకు 5000 లంచం ఇవ్వాలని నెల రోజులుగా ఫోన్ చేసి వేధింపులు చేయడంతో భరించలేక అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించి 2013 అక్టోబర్ 27న మంచిరాల పట్టణంలోని తన కార్యాలయంలోనే ఏసీబీకి పట్టించాడు.
పట్టా కోసం లంచం అడిగిన తాహసిల్దార్ ను ఏసీబీకి పట్టించిన రైతు కురుమ నరసయ్య.
కాసిపేట గ్రామానికి చెందిన కురుమ నరసయ్య స్థానిక ఆధిపత్య కులానికి చెందిన వారి వద్ద వరిపేట శివారులో సర్వే నెంబర్ 53/1లో 6.22లో భూమిని కొనుగోలు చేశారు. అందులో మూడు ఎకరాలు మాత్రమే తన వద్ద ఉంది, మిగతా భూమి వేరే వారి వద్ద ఉంది. తాను సాగు చేసుకుంటున్నా భూమి వేరే వారి పేరిట పట్టా ఉంది. వారితో మాట్లాడుకుని తన పేరిట 2012లో రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్టర్ చేసుకున్న భూమిని పట్టా చేయాలని అప్పటి వీఆర్వో గోవర్ధన్ కు రిజిస్టర్ కాగితాలు ఇచ్చాడు. పట్టా చేసేందుకు అప్పటికే 10,000 విఆర్ఓ కు లంచం ఇచ్చారు. అయినా మూడు ఎకరాలు మాత్రమే పట్టా కాగితాలు విచ్చే మిగతా మూడు ఎకరాలు వేరే వారి పేరిట పట్టా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనిపై నరసయ్య రెవెన్యూ అధికారులను వేరే వారి పేరిట ఎలా పట్టా చేస్తారని ప్రశ్నించిన పట్టించుకోలేదు. మిగతా మూడు ఎకరాలు నీ పేరిట పట్టా చేయాలంటే మరో 15000 రూపాయలు కావాలని ఇప్పటి తహసిల్దార్ రోశయ్య డిమాండ్ చేశారు. అంత డబ్బులు ఇచ్చే స్తోమత లేక నరసయ్య అవినీతి అధికారులను ఆశ్రయించి మంచిర్యాల లోని తన నివాసంలో 2013 జనవరి 9న ఎమ్మార్వో రోశయ్యను ఏసీబీకి పట్టించాడు.
భూమిని పట్టా చేయాలని కోరుకున్న వినకపోవడంతో మంచిర్యాల పట్టణ విఆర్ఓ ను ఏసీబీకి పట్టించిన చెల్ల రవి.
కోనూరు గ్రామానికి చెందిన చల్ల రవి మంచిర్యాల పట్టణంలో ఎసిసి ప్రాంతంలో సర్వేనెంబర్ 338 లో 20010 గజాల స్థలాన్ని 2013లో కొనుగోలు చేశారు భూమి హక్కుపత్రం కోసం ఆగస్టు 2013లో మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. 45 రోజులు కడుతున్న హక్కు పత్రం రాకపోవడం తో విఆర్ఓ హనుమంతరావు కలిశాడు. ఫ్లాట్ అక్కుపత్రం ఇవ్వాలంటే 40,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేను పేద రైతును అంత డబ్బులు ఇవ్వలేదని ప్రాధేయ పడిన వినలేదు.6 నెలలు తన చుట్టూ తిరిగిన ఇవ్వకపోవడంతో చేసేది లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మూడు సెప్టెంబర్ 2014లో మంచిర్యాలలో తన ఇంటిలోనే విఆర్ఓ హనుమంతరావు ఏసీబీ అధికారులకు పట్టించారు.
గత 20 ఏళ్లలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాసిపేట మండలం నుండి ఆరుగురు అవినీతి అధికారులను పట్టించిన ఘనత మండల యువత దే కావడం గర్వకారణం. గత ఎనిమిది ఏళ్ల తెరాస పాలనలో మాత్రం అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు పెరిగిన ఒక్క కేసు కూడా ఏసీబీ కి దొరకడం లేదు. అసలు అవినీతి నిరోధక శాఖ ఒకటి ఉన్నదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వం అంతర్జాతీయ అవినీతి నిరోధక వారోత్సవాలు వారం రోజులపాటు నిర్వహించేవారు. ప్రజలకు అవగాహన కొరకు సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆ ఊసే లేదు. ప్రజలు కూడా అవినీతి నిరోధక శాఖ ఒకటి ఉంది అనే విషయం మర్చిపోవడంతో ఏసీబీ కేసులు నమోదు కావడం లేదని వాదన కూడా వినిపిస్తుంది. రాష్ట్రంలో 20016 నుండి నమోదైన 350 ఏసీబీ కేసులు 65% కేసులకు ప్రభుత్వం నుండి ప్రాసిక్యూషన్ అనుమతి లభించడం లేదనే విమర్శలు ఉన్నాయి. తెరాస ప్రభుత్వం అవినీతి అక్రమాల నరికట్టాలంటే అవినీతి నిరోధక శాఖను పటిష్టం చేసి అవినీతి అధికారులపై దాడులు చేసి పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.








