ఆదివాసులకు ఆదర్శ నేత మాజీ ఎంపీపీ సిడాం జంగు పటేల్ .
వెలమ దొరల సీలింగ్ భూమిని పేదల పంచిన ఆదివాసి నేత.
- బహుజనులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి కాలనీలు ఏర్పర్చిన గృహదాత.
- చదువు విలువ తెలిసి ఆదివాసి పిల్లలంతా చదువుకోవాలని ఆశ్రమ పాఠశాలకు తన పట్టా భూమిని దానం చేసిన భూదాత.
- పిల్లలను ఉన్నత చదువులు చదివించి దేశ రక్షణ కోసం ఆయుధాల తయారు పరిశ్రమలో ఉన్నత ఉద్యోగిగా పెద్ద కొడుకు, ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చిన్న కొడుకు ను తీర్చిదిద్దిన ఆదివాసుల ఆదర్శ నేత.
![]() |
| ఆదివాసుల ఆదర్శనేత మాజీ ఎంపీపీ సిడాం జంగుపటేల్. |
![]() |
| జంగు పటేల్ కుమారుల కుటుంబం. |
ScvNewsKasipet:--
అడవి తల్లి బిడ్డలైన ఆదివాసులు నీతి నిజాయితీకి మారుపేరు. పకృతి దేవత లను ఆరాధిస్తూ తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఎవరికి హాని తలపెట్టకుండా తమ బ్రతుకులు తాము బతుకుతారు. ఆదివాసీలకు తమ కుల పెద్దలంటే ఎంతో గౌరవం.వారిని ఎంతో గౌరవి స్తారు.ఆదివాసి పటేళ్ల కుటుంబంలో పుట్టి ఏజెన్సీ ప్రాంతమైన కాసిపేట మండలంలోని గిరిజనుల కోసం గత 45 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా గోండు తెగ పటేల్ ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మండల ఆదివాసులకు ఆదర్శ ప్రాయుడుగా నిలుస్తున్నాడు మల్కపల్లి గ్రామానికి చెందిన సిడాం జంగు పటేల్.గ్రామ సర్పంచిగా మండల ఎంపీపీగా ఆదివాసుల కోసం పేద ప్రజల కోసం ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందిన ఆదివాసి నేత సిడాం జంగు పటేల్.
భూములేని నిరుపేదలకు వెలమ దొరల సీలింగు భూములను పంచి వారికి జీవనోపాధి చూపెట్టిన భూదాత. గ్రామాలలో ఇండ్ల స్థలాలు లేక పూరి గుడిసెల్లో నివసించే నిరుపేద బహుజన వర్గాలకు ఇండ్ల స్థలాలతో పాటు కాలనీలను ఏర్పాటు చేసిన గృహదాత.ఆదివాసులు చదువు కుంటేనే జ్ఞానం వస్తుందని చదువు విలువ తెలిసి ఈ ప్రాంత ఆదివాసి బిడ్డలంతా చదువు కోవాలని గిరిజన ఆశ్రమ పాఠశాల కోసం తన పట్టా భూమిని విరాళం ఇచ్చిన ఆదర్శ నేత. చదువు విలువ తెలిసి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించిన ఆదర్శ నేత . తన పెద్ద కుమారుడు భీమ్ రావును దేశ రక్షణ కోసం ఆయుధాల తయారీ రంగంలో ప్రముఖ ఇంజనీరు గా చిన్న కొడుకు సాగర్ సమాజ మార్పు కోసం ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్ది మండల ఆదివాసులకు చదువు విలువ తెలిపి ఆదర్శ నాయకుడు గా పనిచేస్తున్నారు. ఆదివాసుల ఆదర్శ నేత సిడాం జంగు పటేల్ ప్రజా ప్రతినిధిగా నిరుపేద బహుజన వర్గాల కోసం తాను చేసిన అభివృద్ధి పనులు సేవా కార్యక్రమాల గురించి SCV News ప్రత్యేక కథనం...
ఏజెన్సీ ప్రాంతమైన కాసిపేట మండలం మలకపల్లి గ్రామానికి చెందిన సిడాం జంగు గోండు తెగ కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి భీమరావు పరిసర గోండు గ్రామాలకు పటేల్ గా సేవలందిస్తూ 100 ఎకరాల పట్టేదారు గా ఉండేవాడు. తన మామ మల్కు పటేల్ పేరుతోనే మల్కేపల్లి గ్రామం ఏర్పాటు అయింది. ఐదవ తరగతి వరకు చదువుకున్న సిడాం జంగు తండ్రి భీమ్ వారసత్వంగా పరిసర గిరిజన గూడాలకు పటేల్ గా గిరిజ నులకు సేవలందిస్తూ 1981 నుండి గ్రామ సర్పంచిగా ఎంపికయ్యాడు. 1995లో టిడిపి హాయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా సేవలందిం చారు. మళ్లీ 2000 సంవత్సరంలో సర్పంచిగా ఎన్నికైనాడు. గత 41 సంవత్సరాలుగా గ్రామానికి మండలా నికి, ప్రజాప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి మండల ప్రజల మన్ననలు పొందాడు.
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలోని వేలాది ఎకరాల భూములు నైజాం కాలం నుండి నాలుగైదు వెలమ,రెడ్ల కుటుంబాల ఆధీనంలోనే ఉండేవి.బహుజన వర్గాలకు చెందిన ఎస్సీ,ఎస్టీ,బీసీ కులాలవారు కౌలుకు తీసుకొని పాలేరుగా ఉంటూ ఆ భూములను సాగు చేసేవారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం నిరుపేదలకు భూ పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఇందిరా గాంధీ హాయంలో భూ పరిమితికింద సీలింగ్ చట్టం తెచ్చింది. 50 ఎకరాలకు మించి ఉన్న భూస్వాముల భూముల న్నిటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామీణ ప్రాంతాలలో భూములు లేని నిరుపేదలకు భూములను ప్రభుత్వం పంపిణీ చేసింది.
రాజ్యాధికారం చేతిలో పెట్టుకున్న భూస్వాములు తమ భూములను ప్రభుత్వానికి అప్ప చెప్పకుండా పాలేరులు,పశువులు కాసే వారిపై,తమ ఇంట్లో పని చేసే వారిపై, చాకలి, మంగలి వారిపై తమకు నమ్మినబంట్లపై పట్టాలు చేసి కాగితాలు తమ వద్దనే పెట్టుకుని భూములను సాగు చేసుకునే వారు.తమ పేరిట భూములు ఉన్నాయనే విషయం బహుజన వర్గాలకు తెలిసేది కాదు. నేటికి మండలంలోని కొన్ని గ్రామాలలో సీలింగ్ భూములు బహుజన వర్గాలకు పంపిణీ జరిగిన తమ పేరిట భూములు ఉన్నాయని విషయం వారికి తెలువదు. ఆ భూములన్ని బహుజన కులాలకు ఇవ్వకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో దొరల ఆధీనంలోనే ఉన్నాయి. ఇలాంటి సీలింగ్ భూములను సిడాం జంగు 1981 లో సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత మల్కపల్లి పంచాయతీ శివారులో కాసిపేటకు చెందిన ముత్యంరావు దొర 84 ఎకరాల సీలింగ్ భూమిని ప్రభుత్వ రికార్డులను బయటకు తీశాడు. ఆ భూమిని స్వాధీనం చేసుకొని గ్రామంలోని భూమిలేని బహుజన వర్గాలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున 42 నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశాడు. నేడు ఆ భూములను బహుజన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ బీసీలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
-ఇంటి స్థలాలు, కాలనీలా ఏర్పాటు.
గ్రామాలలో ఇంటి స్థలం లేని నిరుపేదలకు సర్పంచ్ గా ఎంపీపీగా ఉన్న సమయంలో మల్కపల్లిలో ఎస్సీ కాలనీ, తోటి తెగ గిరిజనులకు కాలనీ, రొట్టె పెళ్లి సుంగు పటేల్ గూడెంలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో కాలనీ ఏర్పాటు చేసి నీడ కల్పించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేక నివసిస్తున్న తిరుమలాపూర్ గ్రామస్తుల కోసం మల్కే పెళ్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు దొర కంచెలో 30 ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు కాలనీ కోసం మిగతాది గిరిజనుల వ్యవసాయం కోసం పంపిణీ చేసి కొత్త తిరుమలపూర్ గూడాన్ని నెలకొల్పాడు.
ఎంపీపీ హాయంలో కొండాపూర్, సోనాపూర్ లో ఇళ్ల స్థలాల పంపిణీ.
![]() |
| జంగు పటేల్ ఎంపీపీ గా ఉన్న హాయంలో ఇంటి స్థలాలు పంపిణీ చేసిన కొండాపూర్ వడ్డెర కాలని. |
ఎంపీపీ గా ఉన్న హాయంలో కొండాపూర్ యాపలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో వడ్డెర కులస్తులకు ఇండ్ల స్థలాలు కాలనీ ఏర్పాటు చేశారు. సోనాపూర్ లో గోండు తెగ గిరిజనులకు నాలుగెకరాల స్థలంలో కాలనీ ఏర్పాటు చేశారు.
మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు మూడు ఎకరాల పట్టా భూమి విరాళం.
![]() |
| జంగు పటేల్ విరాళంగా ఇచ్చిన భూమిలో ఏర్పాటైన మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల. |
ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గూడాల్లోని ఆదివాసి పిల్లలు ఉన్నత చదువులు చదివి అభివృద్ధి పథంలోకి రావాలనే సదుద్దేశంతో మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కోసం తన మూడు ఎకరాల పట్టా భూమిని దానం చేశాడు. ప్రస్తుతం మల్కపల్లి ఆశ్రమ పాఠశాల అంచలంచెలుగా పదవ తరగతి వరకు అప్ గ్రేడ్ అయి 200 మంది గిరిజన విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది.
ఎంపీపీగా గిరిజన గూడాలకు రహదారుల అభివృద్ధికి కృషి .
![]() |
| ఎంపీపీ జంగ్ పటేల్ హాయంలో మారుమూల గిరిజన గ్రామాలకు కోటి రూపాయల ప్రపంచ బ్యాంకు నిధులతో మంజూరైన సోనాపూర్ రహదారి. |
సాగునీటి పథకాలకు శ్రీకారం.
![]() |
| మల్కపెల్లి గ్రామంలో నిర్మించిన చెక్ డాం కింద సాగుతున్న భూములు. |
చదువు విలువ తెలిసి పిల్లలను ఉన్నత స్థానంలో నిలిపిన ఆదివాసినేత.
![]() |
| దేశ రక్షణ కోసం ఆయుధాలు తయారు చేసే ఆర్డినెన్స్ కర్మాగారంలో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జంగు పటేల్ పెద్ద కొడుకు భీమ్ రావు కుటుంబం. |
సాధారణంగా ఆదివాసీల్లో చదువు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదివాసీలు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం లక్షలాది రూపాల వ్యయం చేసి ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసి ప్రోత్సహించిన అవగాహన లోపంతో ఆదివాసి కుటుంబాలు పిల్లలను చదివించలేక దారిద్రంలోనే కొట్టుమిట్టాడు తున్నా యి. అప్పటి రోజుల్లో 5వ తరగతి వరకు చదువుకున్న జంగు మాత్రం చదువు విలువ తెలిసి తన నలుగురు పిల్లలు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. పిల్లలను ఉన్నత చదువులు చదివించడం కోసం అహర్నిశలు కృషి చేశాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వాడుకున్నాడు. తన పెద్ద కొడుకు సిడాం భీమ్ రావు ను బీటెక్ వరకు చదివించి మండలంలోని మొట్టమొదటి ఆదివాసీ గిరిజన ఇంజనీరుగా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం భీమ్ రావు దేశ రక్షణ కోసం అవసరమయ్యే రక్షణ పరికరాలు తయారు చేసే మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు సాగర్ భీమిని మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.
మండలంలో ఆదివాసి నేతగా బహుజన వర్గాలకు సేవలందించి మండలానికి ఆదర్శంగా నిలిచిన సీడాంజంగు కు మండల ప్రజల తరఫున సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.







