అంబేద్కర్ యువజన
సంఘం ఆధ్వర్యంలో
మనుధర్మ శాస్త్రం దగ్ధం.
![]() |
| అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రం దహనం. |
ScvNews Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఈరోజు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మనుధర్మ శాస్త్రం దహనం కార్యక్రమం జరిగింది, మనిషిని మనిషిగా చూడని మనుధర్మ శాస్త్ర ప్రతులను అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దగ్ధం చేశారు,ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ఇన్చార్జి బన్న లక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ
దేశంలో 2000 సంవత్సరాలుగా మనుధర్మ శాస్త్రం ఆధారంగా పరిపాలన జరిగిందని బహుజనులందరికీ ఎలాంటి హక్కులు లేకుండా బ్రాహ్మణ వాదులు పరిపాలన సాగించాల న్నారు.బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో బహుజనుల కు హక్కులు వచ్చాయన్నారు.ఈ దేశంలో మళ్లీ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేసేందుకు హిందూ మతోన్మాదులు ప్రయత్నిస్తు న్నారన్నారు. మను ధర్మశాస్త్రం అమలు అయితే అంటరాని వారికి మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.
మండల సలహాదారు పల్లె మల్లయ్య మాట్లాడుతూ సామ్రాట్ అశోకుని మును మనుమడు చివరి బౌద్ధ మౌర్య చక్రవర్తి బృహద్రదుడిని సర్వ సైన్యాధ్యక్షుడు బ్రాహ్మణుడైన పుష్యమిత్ర సుంగుడు కుట్రపూరితంగా హత్య చేసి దేశంలో బ్రాహ్మనుల పరిపాలన ప్రారంభించారన్నారు.
బహుజన వర్గాలను అణిచి వేసేందుకు సుమతి భార్గవ అనే పండితునిచే మనుధర్మ శాస్త్రాన్ని రచించి దాని ప్రకారమే పరిపాలన సాగించారన్నారు. దేశంలో రెండు వేల ఒక వంద సంవత్సరాల వరకు మనుధర్మ శాస్త్ర ప్రకారమే రాజ్యపాలన సాగించిందని గుర్తు చేశారు.బహుజనులకు ఎలాంటి కనీస హక్కులు లేకుండా రాజ్యపాలన సాధించిందన్నారు, బాబా సాహెబ్ అంబేద్కర్ మహద్ చెరువులో నీళ్లు తాగేందుకు అంటరాని వారితో పోరాటం సాగించాడని అన్నారు. దేశంలో బహుజనుల అణిచివేత, కుల వివక్షకు మూల కారణం మనుధర్మశాస్త్రమేనని నిర్ధారించి డిసెంబర్ 25న మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ తగలబెట్టాడని అన్నారు.
సాంస్కృతిక విభాగం ఇంచార్జ్ గోడిసెల బాపు మాట్లాడుతూ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేసి బహుజను లను ఒకరిని ఒకరి కలవకుండా విభజించి పాలించిన దుర్మార్గ ధర్మశాస్త్రం అన్నారు.కుల వ్యవస్థ ఏర్పాటు వల్ల బ్రాహ్మణాధి పత్యం పెరిగి దేశ అభివృద్ధికి విఘాతం కలిగిందన్నారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో మనుధర్మ శాస్త్రానికి కాలం చెల్లిందన్నారు.
ఉపాధ్యక్షుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ భారతదేశంలో ఒక వైపు స్వాతంత్ర పోరాటం జరుగుతున్న క్రమంలోనే దేశంలోని అణగారిన వర్గాలకు ఎలాంటి హక్కులు లేకుండా అణచివేస్తే అంబేద్కర్ వారి వైపు ఉండి పోరాటాలు చేశాడని అన్నారు. దేశానికి స్వాతంత్రా నికంటే ముందు అంటరాని వారికి బహుజనులకు హక్కులు కావాలని బ్రిటిష్ వారిని అడిగారన్నారు.మహద్ చెరువులో నీళ్లు అస్పృశ్యులు తాగవద్దని అగ్ర వర్ణాల వారు అడ్డుకుంటే అంబేద్కర్ వారి తరఫున పోరాటం చేసి ఉద్యమాన్ని చేశారని గుర్తు చేశారు.
సలహాదారు మద్దినేని చిన్న భీమన్న మాట్లాడుతూ దేశంలో బ్రాహ్మణ వాదులు చాతుర్ వర్ణ వ్యవస్థ ద్వారా మనుషులను నాలుగు వర్ణాలు విభజించి పాలించారన్నారు,శూద్రులు అయినటువంటి ఎస్సీ ఎస్టీ, బీసీలకు ఎలాంటి హక్కులు ఇవ్వకుండా దుర్మార్గంగా అణచివేశారన్నారు, ఈ సమావేశంలో మండల నాయకులు గుడిసెల సురేందర్ బుగ్గరాజు గోలేటి స్వామి, భోగే లక్ష్మణ్, రత్నం రాజం చొప్పదండి పోషం కురుమ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.






