మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల వాసి గొల్లపల్లి బ్రహ్మయ్య ఆచారి కి జాతీయ పురస్కారం.

 కాసిపేట మండల వాసి గొల్లపల్లి బ్రహ్మయ్య ఆచారి కి 'తెలుగు వెలుగు' జాతీయ పురస్కారం.


 తెలుగు వెలుగు జాతీయ పురస్కారాన్ని అందుకుంటున్న  కాసిపేట  మండల వాసి బ్రహ్మయ్య ఆచారి.
Scv News Kasipet:--

కాసిపేట మండలం ముత్యంపెల్లి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య ఆచారికి పౌరోహిత్య రంగంలో వారి విశిష్ట సేవలకు గాను 'తెలుగు వెలుగు' జాతీయ పురస్కారం లభించిందిి. వరంగల్ లో ఈ నెల 4వ తారీకు నాడు జరిగిన జాతీయ పురస్కారాల ప్రధానోత్సవా వేడుకలలో గొల్లపల్లి బ్రహ్మయ్య ఆచారికి పురోహిత బ్రహ్మ పురస్కారం లభించింది.ఈ పురస్కా రాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై అందజేశారు. బ్రహ్మయ్య తెలుగు వెలుగు జాతీయ సంస్కృతి సాహితీ సంస్థ సేవా పురస్కారాన్ని సంస్థ సభ్యుల చేతుల మీదుగా అందుకొన్నారు.

బ్రహ్మయ్య ఆచారి పలు కళా రంగాల్లో నిష్ణాతుడు.

బ్రహ్మయ్య ఆచారి పౌరోహిత్య రంగంలోనే కాకుండా వాస్తు, జ్యోతీష్యం రంగాలలో కూడా ప్రతిభా ప్రావీణ్యం ఉంది. చక్కని పద్యకవి. పద్య కవిత్వమే కాకుండా వచన కవిత్వం,గేయ కవిత్వం కూడా వ్రాయగలనేర్పరి. తెలుగు భాషపట్ల చక్కని అవగాహన భాషా ప్రావీణ్యం, భాషా పటుత్వం క్షుణ్ణమైన వ్యాకరణ పరిజ్ఞానం కలిగిన బ్రహ్మయ్య ఆచారి రచనా శైలి సరళంగా శృతిమెత్తగా నూతన పద ప్రయోగాలతో నిండైన భావ గాంభీర్యం కలిగి ఒద్దికగా వినూత్నoగా, జనరంజకంగా ఉంటుంది. కావ్య శిల్పం చిత్రీకరణ కవన నిర్మాణం లో తనదైన ముద్ర ఉండడం వీరి కావ్యరచనలోని ప్రత్యేక లక్షణం. ఏ విషయాన్నైనా జీర్ణించుకొని పరకాయ ప్రవేశంచేసి విశేషణాత్మకంగా అభివర్ణిస్తూ కవిత్వ నిర్మాణం చేసి సాహిత్యాన్ని పరవళ్లు త్రొక్కించగల కావ్యరచనా శిల్పి . వీరియొక్క కవిత్వం చైతన్యాత్మకంగా అభ్యుదయ బావజాలంతో దేశ భక్తి,దైవభక్తి, సామాజిక ,సాంఘిక ,లౌకిక అనేక అంశాలతో కొనసాగడం విశేషంగా చెప్పుకోవచ్చును. వీరియొక్క ప్రతిభా పాఠవాలను గుర్తించి అనేక సంస్థలు పలు సన్మాన సత్కారాలు చేశాయి. 2015 సంవత్సరం లో పౌరోహిత్య రంగంలో వీరి ప్రతిభకు గాను తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఉత్తమ పురోహితునిగా అవార్డు అందుకున్నారు.

గత తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ స్ఫూర్తి కవి సమ్మేళనంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావు చేతుల మీదుగా  ప్రశంస పత్రం అందుకున్నాడు.

 'తెలుగువెలుగు 'జాతీయ పురస్కారం అందుకొన్న విశిష్ట కవి బ్రహ్మయ్య ఆచారి కాసిపేట మండలానికి  రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి నందుకు 'సామాజిక చైతన్య వేదిక  సోషల్ మీడియా' ప్రత్యేక అభినందన లు తెలుపుతుంది.ఈ సందర్భముగా బ్రహ్మయ్య ఆచారి మాట్లాడుతూ ఈ పురస్కారం అందుకోవడం తనకు ఎంతో  గర్వంగా  , సంతోషంగా ఉందని తెలియజేశారు.