మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బహుజన పోరాటయోధులు భీమా కోరేగావ్ మహార్ యుద్ధ వీరుల చరిత్ర తెలుసుకుందాం.!

 బహుజన సోదరులారా  ...!

కొత్త సంవత్సర వేడుకలతో

పాటు  గ్రామ గ్రామాన భీమా

కోరేగావ్ విజయోత్సవ

వేడుకలు జరుపు కుందాం...!

బహుజన పోరాటయోధులు భీమా కోరేగావ్ మహార్ యుద్ధ వీరుల చరిత్ర తెలుసుకుందాం.!

 భీమా కోరేగాం యుద్ధం మహర్ వీరుల స్మారక స్తూపం విజయ స్తంభం. 


ScvNewsKasipet:--

"భారతదేశ చరిత్ర అంటే ఆర్య - అనార్య,   బ్రాహ్మనిజానికి - బౌద్ధానికి జరిగిన పోరాట చరిత్ర " అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్.

భారతదేశ బహుజన చరిత్రలో భీమా కోరేగావ్ యుద్ధం చాలా ప్రముఖ మైనది. ఈ దేశ మూలవాసులైన మహర్ సైనికులకు - పీష్వా బ్రాహ్మణ  సైనికులకు మధ్య జరిగిన యుద్ధం, భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య వాదుల స్థిరమైన పాలన ప్రారంభ మైంది ఈ యుద్ధంతోనే. భారతదేశ చరిత్రలో జరిగిన యుద్ధాలన్నీ బ్రాహ్మణులకు - బహుజనులకు మధ్య జరిగినవే.గత భారతదేశ చరిత్ర మొత్తం మనువాద బ్రాహ్మణ చరిత్ర. 204 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఈ దేశ మూలవాసులు రాబోవు తరాలకోసం విజయ చరిత్రను భీమా కోరేగావ్ యుద్ధంతో మనకు అందించారు.అటువంటి పోరాట చరిత్ర ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీలుగా పిలువ బడుతున్న బహుజన జాతులే ఈ దేశ మూల భారతీయులని, ఈ భూమి మనది, ఈ దేశ సంపద మనది, సంస్కృతి మనది, అప్పుడు మనం పాలకులం,మనదీ రాజ్యపాలన చేసే  క్షత్రియ జాతి అని మన పూర్వీకులు ఆధారాలతో చెప్పినా నమ్మే పరిస్థితిలో ఈనాడు బహుజన సమాజం లేదు. ఈ సత్యాన్ని మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్ పెరియర్ రామస్వామి మాన్యశ్రీ కాన్షీరామ్ లు తమ జీవితకాల మంతా పోరాటం చేసి బహుజన వర్గాలకు చెప్పారు. బ్రాహ్మణ మనువాద వర్గం బహుజనులకు చదువు, జ్ఞానం లేకుండా మెదళ్లకు సంకెళ్లు వేయడంతో ఆ మహనీయుల మాటలను పట్టించుకోకుండా ఇంకా బానిసత్వంలోనే మగ్గుతున్నాం.

జనవరి 1 న భీమా కోరేగాం  విజయోత్సవ సందర్భంగా మన మూలవాసులైన మహార్ వీరుల విజయోత్సవ గాధ  భీమా కోరేగావ్ యుద్ధం గురించి నేటి తర బహుజన వర్గం తెలుసుకుని బహుజన రాజ్య స్థాపన కృషి చేయాలనే లక్ష్యంతో Scv News అందిస్తున్న ప్రత్యేక కథనం...

భీమా కోరేగావ్ యుద్ధం గురించి....

భారతదేశంలో మొట్టమొదటి విదేశీ దండయాత్ర ఆర్యులతో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నుండి ప్రారంభ మైంది. సింధూ లోయ ప్రాంతంలో ఉన్న హరప్పా సింధు, ద్రావిడ నాగరికతను ధ్వంసం చేశారు. అప్పటి ద్రావిడ రాజులను ఆర్యులు యుద్ధాలలో ఓడించి ద్రావిడ  రాజ్యాలను హస్తగతం చేసుకున్నారు. మూల భారతీయు లందరినీ బానిసలుగా చేసుకొని పరిపాలన కొనసాగించారు.ఆర్యులు ఈ దేశ మూలవాసులను నాలుగు వర్ణాలుగా విభజించి చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా  పరిపాలించారు. బ్రాహ్మణులు చదువు కోవడం,స్త్రీలు రాజ్యపాలన వైశ్యులు వ్యాపారం చేయాలని వారి చేతిలో ఓడిపోయిన ఈ దేశం మూలవాసులైన నేటి బహుజనులను శూద్రులు, అతి శూద్రులుగా పేరు పెట్టి వారికి సేవ చేయాలని ధర్మశాస్త్రాలు రాసుకున్నారు. శూద్రులకు ఎలాంటి స్వేచ్ఛ స్వాతం త్రాలు లేకుండా పశువుల కంటే హీనంగా చూశారు.వారిని చదువుకు దూరం చేశారు.ఆయుధాలను పట్టనివ్వలేదు. ఆస్తులు సంపాదించు కొనివ్వలేదు.

వారి తరువాత భారత దేశం మీదికి దండయాత్రకు వచ్చిన గ్రీకులు, అరబ్బులు,యూరోపియన్లు ఆర్య బ్రాహ్మణుల చేతిలో వివక్షకు గురవుతున్న  మూల భారతీయులైన బహుజన కులాల కు చెందిన ఎస్సి,ఎస్టి, బిసిలను తమ సైనిక దళాలలో చేర్చుకున్నారు.వారి అండదండలతోనే దేశ బ్రాహ్మణ రాజులను ఓడించి వందలాది సంవత్సరాలు పరిపాలన సాగించా రు.'ఈ దేశం ఎక్కువ సార్లు విదేశీ దండయాత్ర గురికావడానికి మనువాద బ్రాహ్మణులే కారణమని, శూద్రులు అతి శూద్రులు ఆయుధాలు పట్ట కూడదని  ఆంక్షలు విధించడంతో  విదేశీ  దండయాత్రలు ఎదుర్కొ నేందుకు మెజారిటీ వర్గాలైన బహుజనులు దూరం ఉండటం వల్ల బ్రాహ్మణ రాజులు ఓడిపోయి ఎక్కువ కాలం విదేశీయుల పాలనలోనే భారతదేశం ఉండాల్సి వచ్చిందని' బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్లేషించాడు.

బ్రిటిష్ వారు ఈ దేశంలో వ్యాపారం పేరుతో వచ్చి  రాజ్య పాలన చేసేందుకు చిన్న చిన్న రాజ్యాలను స్వాధీనం చేసుకుని పరిపాలన ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా 1757లో ఈస్టిండియా కంపెనీ దళాలకు - బెంగాల్ నవాబు సిరాజుద్దీన్ సైన్యాల మధ్య ప్లాసి వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మెజారిటీ సైనికులు ఈ దేశ మూలవాసు లు అంటరాని వరైనా దుసాధుల సహా యంతో ఆంగ్లేయులు గెలిచి భారతదేశం లో పరిపాలనను ప్రారంభించారు.చరిత్రలో దీనికి ప్లాసి యుద్ధమని పేరు పెట్టారు. క్రమక్రమంగా ఆంగ్లేయులు భారతదేశం లోని రాజ్యాలను గెలుస్తూ దేశమంత విస్తరించారు. మరాఠాలు మాత్రమే లొంగకుండా మిగిలారు. 

మరాఠాలో పీష్వాల పాలనలో శూద్రులు, అతిశూద్రల పై తీవ్రవివక్ష .

మరాఠా సామ్రాజ్యం చత్రపతి శివాజీ, అతని కొడుకు శంభాజీ మహారాజ్ ను బ్రాహ్మణ వర్గం కుట్రపూరితంగా హత్య చేసిన తర్వాత  పీష్వా  బ్రాహ్మణుల చేతిలోకి వెళ్ళింది. పీష్వా బ్రాహ్మణుల పాలనలో మహర్, మాంగ్ అంటరాని జాతులవారిని పశువుల కంటే హీనంగా చూశారు. వారువీధుల్లో తిరిగే పరిస్థితులు లేవు. పగటి పూట వీరి నీడ బ్రాహ్మణులపై ,వారి వస్తువులపై పడుతుందని తిరగ  నిచ్చేవారు కాదు.తప్పని సరి పరిస్థితుల్లో వీధుల్లో తిరిగితే బ్రాహ్మణులు కనబడితే నేలమీద పడుకోవాలి. కాలు అడుగు జాడలు వీధుల్లో  కనబడకుండా  వెనుక చీపురు, ఉమ్మి  వేసేందుకు నోటికి ముంతా,  ఎదురుగా ఎవరూ రాకుండా ఉండేందుకు గంట ఊపుతూ వెళ్లేవారు. ఇలాంటి వివక్షకు గురైన మహర్ లు బ్రాహ్మణ పీష్వాల  మీద ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూసేవారు. ఆంగ్లేయుల సైన్యంలో చేరి మరాఠా బ్రాహ్మణ సైన్యంపై పోరాటాల కు ఉత్సాహంగా దిగేవారు. ఒకసారి బ్రాహ్మణ పీస్వా సైన్యం చేతిలో ఓడిపోయిన తర్వాత ఆంగ్లేయులు  మహర్ సైనికులతో  చివరి యుద్ధం 1818లో మరాఠాలతో  భీమ కోరేగాం వద్ద యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో బ్రిటిషర్ల తరఫున ఈ దేశ మూలవాసు లైన అంటరాని వారైనా మహర్లు పోరాడారు. వారి దాటికి  మరాఠా సామ్రాజ్యం బ్రాహ్మణ పీష్వాల రాజ్యం ధ్వంసమై  భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యం సుస్థిరపడింది. 

భీమా కోరేగావ్ యుద్ధం జరిగింది ఇలా...!

మహారాష్ట్రలోని పూణే సమీపంలో భీమా నది ఒడ్డున ఉన్న కోరేగాం గ్రామ సమీపంలో 31 డిసెంబర్ 1817లో బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ నాయకత్వంలో 500 మంది పదాతి దళ మహార్ సైనికులు, 250 మంది సాధారణ అశ్వదళం కోరేగామ్ గుట్ట కింద 25 వేలమంది అశ్వికదళం, 5 వేల మంది పదాతి దళం ఉన్న పీష్వా బ్రాహ్మణ సైన్యంతో పోరాటానికి దిగింది. మరాటా సైన్యంతో గెలవడం అసాధ్యమని బ్రిటిష్ సైన్యాధిపతి స్టాంటన్ యుద్ధం విరమించాలని ప్రయత్నం చేశాడు. దీనికి ససేమిరా అన్న మహార్ సేనాధిపతులు శిఖనాక,రతనాక, జతనాక లు ముందుండి పోరాడారు. ఒక్కొక్క మహార్ సైనికుడు 50 మంది పిశ్వ బ్రాహ్మణ సైన్యాలను ఉచ కోత కోసి విజయం సాధించాయి. ఈ యుద్ధంలో 23 మంది మహర్ వీరులు వీరమరణం పొందారు.

23మంది మహార్ సైనికుల స్మారకార్థం బ్రిటిష్ ప్రభుత్వం బీమా కోరేగావ్ గ్రామంలో స్మారక స్థూపాన్ని నిర్మించింది. 21 మార్చి 1821 నాడు విజయ స్థూపానికి శంకుస్థాపన చేశారు. 32 చదరపు అడుగుల వెడల్పు లో 65 అడుగుల ఎత్తులో నిలువెత్తు స్థూపాన్ని నిర్మించి 1822లో పూర్తిచేసింది. జనవరి ఒకటవ తేదీ మహర్ సైనిక బలగాల ధైర్య  సాహసాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. విజయ స్థాపానికి  సైనిక వందనాలు తుపాకుల పేలుళ్ల మధ్య ప్రతి ఏటా ఉత్సవాలు జరపడం జరుగుతుంది.

ఈ విధంగా కి. శ 1757 - 1818 మధ్యకాలంలో బ్రిటిష్ సైన్యంలో మూలభారత సైనికులు దుసాదుల నుండి మహార్ సైనికుల వరకు అందరూ బహుజన వర్గాలకు చెందిన  అంటరాని జాతుల సైనికుల సహాయంతోనే ఆంగ్లేయుల విజయం సాధించి భారత దేశంలో పరిపాలన ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్ళు స్థిరపడిన తర్వాత సతీ సహగమనము, బాల్య వివాహం లాంటి దుర్మార్గపు విధానాలను అరికట్టేందుకు చట్టాలు చేశారు. బహుజన వర్గాల కోసం  క్రైస్తవ మిషనరీ ఏర్పాటు చేసి విద్యాల యాలు, ఆసుపత్రులను ఏర్పాటు చేయడం ప్రారంభించారు.వీటిని కూడా ఈ దేశంలోని మనువాద బ్రాహ్మణ వర్గం వ్యతిరేకించి 1857 తిరుగుబాటు చేశారు.

బాబా సాహెబ్  అంబేద్కర్ సందర్శనతో వెలుగులోకి వచ్చిన మహావీరుల చరిత్ర.

 బీమా కోరేగాం మహారు యుద్ధ వీరుల స్మారక స్తూపం సందర్శించి నివాళులర్పిస్తున్న  బాబాసాహెబ్ అంబేద్కర్. 

బాబాసాహెబ్ అంబేద్కర్ జనవరి ఒకటి 1927లో మొదటిసారి విజయ స్తంభాన్ని సందర్శించి వందనం స్వీకరించారు. మూల భారతీయుల చరిత్రలో ఈ దినాన్ని 'విజయ దివాస్ 'గా జరుపు కోవాలని అంబేద్కర్ బహుజన సమాజానికి పిలుపు నిచ్చారు. బాబాసాహెబ్ జీవించి ఉన్నంత వరకు ఎన్ని ఒత్తిడిగల పనులుండిన బీమా కోరేగాం శక్తిస్దల్  సందర్శన మానలేదు.తద్వారా ఆయన భారతీయ మూల యోధుల స్మృతిని ప్రపంచానికి చాటడం కొనసాగించారు. గత 95 సంవత్సరాలుగా ప్రతి ఏటా జనవరి 1న లక్ష లాదిమంది ప్రజలు బీమా కోరేగాం అమరవీరుల స్మారక స్థూపాన్ని సందర్శిస్తున్నారు. 2018లో జరిగిన 200 సంవత్సరాల భీమా కోరేగావ్ అమరవీరుల విజయ్ దివాస్ సందర్భంగా లక్షలాది మంది హాజర య్యారు. హిందూ మతోన్మాదుల కుట్రలతో ఘర్షణలు జరిగి బహుజన మేధావులు, విప్లవ మేధావులపై కుట్ర కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరం 204 వ వార్షికోత్సవ సందర్భంగా నాలుగు లక్షల మంది బహుజనులు సందర్శించి భీమా కోరేగావ్ అమరవీరులకు నివాళులర్పించారు. 

బహుజన సోదరులారా...  నూతన సంవత్సర వేడుకల పేరిట మందు, విందులో మునగకుండా  మూలవాసు ల చరిత్రను తెలుసుకొని  ప్రతి గ్రామంలో ' 'బీమా కోరేగావ్ అమరవీరుల విజయ దివాస్ ' ను జరుపు కోవాలని అంబేద్కర్ వాదులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయ వంతం చేయాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా కోరుతుంది.