మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

మద్దినేని అర్జున్ కు రాష్ట్రస్థాయి బెస్ట్ మోటివేషన్ స్పీకర్ అవార్డు.

 మద్దినేని అర్జున్ కు

రాష్ట్రస్థాయి అవార్డు రావడం

కాసిపేట మండలానికి

గర్వకారణం.

 రాష్ట్రస్థాయి బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవార్డు పొందిన మద్దినేని అర్జున్.



 బెస్ట్ మోటివేషన్ అవార్డును ఇంపాక్ట్ ఫౌండర్
గంప నాగేశ్వరరావు సమక్షంలో తీసుకుంటున్న
మద్దినేని అర్జున్.

Scv News Kasipet:--

కాసిపేట మండల నివాసి మద్దినేని అర్జున్ కు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మోటివేషనల్ కార్యక్రమాలు నిర్వహించినందుకు 2022లో రాష్ట్రస్థాయిలో బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవార్డు దక్కింది. ఆదివారం హరిహర కళాభవన్ సికింద్రాబాద్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇంపాక్ట్ పౌడర్ గంప నాగేశ్వరరావు సమక్షంలో  అవార్డును అందుకున్నారు. 

మోటివేషనల్ స్పీకర్ గా ఇంపాక్ట్ ఫౌండేషన్ లో శిక్షణ పొందిన మద్దినేని అర్జున్ గత విద్యా సంవత్సరం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలలోని వివిధ మండలాలతో పాటు కాసిపేట మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కాలేజీలలో విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. కాసిపేట మండలంలో  సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతుల తోపాటు, పరీక్షల్లో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణుల అయ్యేందుకు ఎలా చదవాలో మెలకువలను నేర్పారు.

రాష్ట్రంలోని మారుమూల ప్రాంతమైన కాసిపేట  మండలం ముత్యంపెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు గురై శారీరక ఇబ్బందులు ఉన్న పట్టు వదలకుండా  వ్యక్తిత్వవికాసం తరగతులకు హాజరై మెలుకువలను నేర్చుకుని నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచాడు.కష్టపడి నేర్చుకున్న జ్ఞానాన్ని వృధా చేయ కుండా సామాజిక స్పృహతో నిరుపేద కుటుంబాలలో పుట్టి, ప్రభుత్వ పాఠశా లలో చదువుతున్న బహుజన వర్గాల పిల్లలకు అందించి జ్ఞానవంతులను చేస్తున్నాడు. అతడు చేసే నిస్వార్థ  సేవాభావానికి  గుర్తుగా నేటి యువతరానికి స్ఫూర్తినిచ్చే విధంగా మద్దినేని అర్జున్ కు రాష్ట్రస్థాయి బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ అవార్డు రావడం మండల వాసులకు గర్వకారణం.

రాష్ట్రస్థాయి అవార్డు పొందిన మద్దినేని అర్జున్ కు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందన లు తెలుపుతుంది. ఇదే స్ఫూర్తితో మళ్ళీ ఈ విద్యా సంవత్సరం కూడా మండలంలోని ప్రభుత్వ ఉన్నత ఆశ్రమ  పాఠశాలలో కాలేజీలలో వ్యక్తిత్వ వికాస తరగతులతో పాటు, గ్రామీణ ప్రాంతంలోని యువతను చెడు మార్గాలు, వ్యసనాల బారి నుండి కాపాడేందుకు చైతన్యవంతమైన వ్యక్తిత్వ వికాస తరగతులను నిర్వహించాలని అర్జున్ ను Scv News  కోరుతుంది.