మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల ఆదివాసుల ఆదర్శ నేత సిడాం జంగు పటేల్.

 ఆదివాసుల ఆదర్శ నేత మాజీ ఎంపీపీ సిడాం జంగు పటేల్.

- వెలమ దొరల సీలింగ్ భూమిని పేదల పంచిన ఆదివాసి నేత.

- బహుజనులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసి కాలనీలు ఏర్పర్చిన గృహదాత.

- చదువు విలువ తెలిసి ఆదివాసి పిల్లలంతా చదువుకోవాలని ఆశ్రమ పాఠశాలకు తన పట్టా భూమిని దానం చేసిన భూదాత.

- పిల్లలను ఉన్నత చదువులు చదివించి దేశ రక్షణ కోసం ఆయుధాల తయారు పరిశ్రమలో ఉన్నత ఉద్యోగిగా పెద్ద కొడుకు భీమ్ రావు , ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా  చిన్న కొడుకు సాగర్ ను తీర్చిదిద్దిన ఆదివాసుల ఆదర్శ నేత.





 ఆదివాసుల ఆదర్శనేత మాజీ ఎంపీపీ సిడాం జంగు. 
 సిడాం జంగు కుమారులు.


Scv News Kasipet:--

అడవి తల్లి బిడ్డలైన ఆదివాసులు నీతి నిజాయితీకి మారుపేరు.పకృతి దేవత లను ఆరాధిస్తూ తమ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ  ఎవరికి హాని తలపెట్టకుండా తమ బ్రతుకులు తాము బతుకుతారు. ఆదివాసీలకు తమ కులపెద్దలంటే ఎంతో గౌరవం.వారిని ఎంతో గౌరవిస్తారు. ఆదివాసి పటేళ్ల కుటుంబంలో పుట్టి ఏజెన్సీ ప్రాంతమైన కాసిపేట మండలంలోని గిరిజనుల కోసం గత 45 ఏళ్లుగా ప్రజా ప్రతినిధిగా గోండుతెగ పటేల్ ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మండల ఆదివాసులకు ఆదర్శ ప్రాయుడుగా నిలుస్తున్నాడు మల్కపల్లి గ్రామానికి చెందిన సిడాం జంగు పటేల్.గ్రామ సర్పంచిగా,మండల ఎంపీపీగా ఆదివాసుల కోసం ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేసి అందరి మన్ననలు పొందిన ఆదివాసినేత సిడాం జంగు పటేల్. భూములేని నిరుపేదలకు వెలమ దొరల సీలింగు భూములను పంచి వారికి జీవనోపాధి చూపెట్టిన భూదాత. గ్రామాలలో ఇండ్ల స్థలాలు లేక పూరి గుడిసెల్లో నివసించే నిరుపేద బహుజన వర్గాలకు ఇండ్ల స్థలాలతో పాటు కాలనీలను ఏర్పాటు చేసిన గృహదాత.ఆదివాసులు చదువు కుంటేనే జ్ఞానం వస్తుందని ఈ ప్రాంత ఆదివాసి బిడ్డలంతా చదువు కోవాలని గిరిజన ఆశ్రమ పాఠశాల కోసం తన పట్టా భూమిని విరాళం ఇచ్చిన భూదాత. చదువు విలువ తెలిసి తన పిల్లలను ఉన్నత చదువులు చదివించి తోటి ఆదివాసి కుటుంబాలకు మార్గదర్శిగా నిలిచిన ఆదర్శనేత.తన పెద్ద కుమారుడు భీమ్ రావును దేశ రక్షణ కోసం ఆయుధాల తయారీ రంగంలో ప్రముఖ ఇంజనీరుగా, చిన్న కొడుకు సాగర్ ను ఉపాధ్యాయుడిగా తీర్చిదిద్దాడు.మండల ఆదివాసులకు ఆదర్శప్రాయుడుగా నిలిచిన  సిడాం జంగు పటేల్ ప్రజా ప్రతినిధిగా, నిరుపేద బహుజన వర్గాల కోసం తాను చేసిన అభివృద్ధి పనులు సేవా కార్యక్రమాల గురించి SCV News ప్రత్యేక కథనం...


ఏజెన్సీ ప్రాంతమైన కాసిపేట మండలం మల్కపల్లి గ్రామానికి చెందిన సిడాం జంగు గోండు తెగ కుటుంబములో జన్మించాడు. తన తండ్రి భీమరావు పరిసర గోండు గ్రామాలకు పటేల్ గా సేవలందిస్తూ100 ఎకరాల పట్టేదారుగా ఉండేవాడు. తన మామ మల్కు పటేల్ పేరుతోనే మల్కేపల్లి గ్రామం ఏర్పాటు అయింది.ఐదవ తరగతి వరకు చదువుకున్న సిడాం జంగు తండ్రి భీమ్ వారసత్వంగా పరిసర గిరిజన గూడాల కు పటేల్ గా గిరిజనులకు సేవలందిస్తూ 1981నుండి గ్రామ సర్పంచిగా ఎంపిక య్యాడు.1995లో టిడిపి హాయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా సేవలందించారు.మళ్లీ 2000 సంవత్స రంలో సర్పంచిగా ఎన్నికైనాడు. గత 41 సంవత్సరాలుగా గ్రామానికి మండలాని కి, ప్రజాప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్ర మాలు చేపట్టి మండల ప్రజల మన్ననలు పొందాడు.

 భూస్వాముల సీలింగ్ భూములను నిరుపేదలకు పంపిణీ చేసిన ఘనుడు.

కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో వేలాది ఎకరాల భూములు నైజాం కాలం నుండి నాలుగైదు వెలమ,రెడ్ల కుటుంబాల ఆధీనంలోనే ఉండేవి. బహుజన వర్గాలకు చెందిన ఎస్సీ,ఎస్టీ,బీసీ కులాలవారు పాలేర్లు గా ఉంటూ ఆ భూములను సాగు చేసేవారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం నిరుపేదలకు భూ పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఇందిరా గాంధీ హాయంలో భూ పరిమితికింద సీలింగ్ చట్టం తెచ్చింది. 50 ఎకరాలకు మించి ఉన్న భూస్వాముల భూముల న్నిటిని ప్రభుత్వం స్వాధీనం  చేసుకుని గ్రామీణ ప్రాంతాలలో భూములు లేని నిరుపేదలకు భూములను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాజ్యాధికారం చేతిలో పెట్టుకున్న భూస్వాములు తమ భూములను ప్రభుత్వానికి అప్ప చెప్పకుండా పాలేరులు,పశువులు కాసే వారిపై,తమ ఇంట్లో పని చేసే వారిపై, చాకలి, మంగలి వారిపై తమకు నమ్మిన బంట్లపై పట్టాలు చేసి కాగితాలు తమ వద్దనే పెట్టుకుని భూములను సాగు చేసుకునేవారు. తమ పేరిట భూములు ఉన్నాయనే విషయం  బహుజన వర్గాలకు తెలిసేది కాదు. నేటికి మండలంలోని కొన్ని గ్రామాలలో సీలింగ్ భూములు బహుజన వర్గాలకు పంపిణీ జరిగిన వారికి ఇవ్వకుండా రెవెన్యూ అధికారుల సహకారంతో దొరల ఆధీనంలోనే ఉన్నాయి. ఇలాంటి సీలింగ్ భూములను సిడాం జంగు 1981 లో సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత  మల్కపల్లి పంచాయతీ శివారులో కాసిపేటకు చెందిన ముత్యంరావు దొర 84 ఎకరాల సీలింగ్ భూమిని ప్రభుత్వ రికార్డులను బయటకు తీశాడు. ఆ భూమిని స్వాధీనం చేసుకొని గ్రామంలోని భూమిలేని  బహుజన వర్గాలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున 42 నిరుపేద కుటుంబాలకు  పంపిణీ చేశాడు. నేడు ఆ భూములను బహుజన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ బీసీలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

-ఇంటి స్థలాలు, కాలనీలా ఏర్పాటు, గూనాల పంపిణీ.

గ్రామాలలో ఇంటి స్థలం లేని నిరుపేదలకు సర్పంచ్ గా, ఎంపీపీగా ఉన్న సమయంలో  మల్కపల్లిలో ఎస్సీ కాలనీ, తోటి తెగ గిరిజనులకు కాలనీ, రొట్టె పెళ్లి  సుంగు పటేల్ గూడెంలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో కాలనీ ఏర్పాటు చేసి నీడ కల్పించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో సరైన సౌకర్యాలు లేక నివసిస్తున్న తిరుమలాపూర్ గ్రామస్తుల కోసం  మల్కే పెళ్లి గ్రామానికి చెందిన  తిరుపతిరావు దొర కంచెలో 30 ఎకరాల భూమిలో నాలుగు ఎకరాలు కాలనీ కోసం మిగతాది గిరిజనుల వ్యవసాయం కోసం పంపిణీ చేసి కొత్త తిరుమలపూర్ గూడాన్ని నెలకొల్పాడు. కాలనీ గ్రామాలలో గడ్డి గుడిసెలలో నివసించే గిరిజనులు వర్షాకాలంలో  వర్షపు నీరు ఇంట్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులు గురయ్యే వారు. గిరిజన పటేల్ గా ఐటీడీఏ అధికారులకు పై కప్పు కోసం గుణలు పంపిణీ చేయాలని కోరి  మంజూరు చేయించాడు.

ఎంపీపీ హాయంలో  కొండాపూర్, సోనాపూర్ లో ఇళ్ల స్థలాల పంపిణీ.

  జంగు ఎంపీపీ హాయంలో పంపిణీ చేసిన ఇంటి స్థలాల్లో ఏర్పాటు అయిన 
  కొండాపూర్ లోని వడ్డెర కాలనీ 
 ఎంపీపీ గా ఉన్న హాయంలో  కొండాపూర్ యాపలో నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో వడ్డెర కులస్తులకు ఇండ్ల స్థలాలు కాలనీ ఏర్పాటు చేశారు. సోనాపూర్ లో గోండు తెగ గిరిజనులకు నాలుగెకరాల స్థలంలో కాలనీ ఏర్పాటు చేశారు.

మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలకు మూడు ఎకరాల పట్టా భూమి విరాళం.

 మలకపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల.

ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గూడాల్లోని ఆదివాసి పిల్లలు ఉన్నత చదువులు చదివి అభివృద్ధి పథంలోకి రావాలనే సదుద్దేశంతో మల్కపల్లి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల కోసం తన మూడు ఎకరాల పట్టా భూమిని దానం చేశాడు. ప్రస్తుతం మల్కపల్లి ఆశ్రమ పాఠశాల అంచలంచెలుగా  పదవ తరగతి వరకు అప్ గ్రేడ్ అయి 200 మంది గిరిజన విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది.

ఎంపీపీగా గిరిజన గూడాలకు రహదారుల అభివృద్ధికి కృషి .

 ఎంపీపీ జంగు హాయంలో ఏర్పాటైన సోన్నాపూర్ రహదారి

మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు లేక బాహ్య ప్రపంచంతో గిరిజనులకు సంబంధాలు లేకుండా ఉండేవి. వర్షాకాలంలో  గిరిజన గూడాల ప్రజలు విష జ్వరాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక ఎంతోమంది గిరిజన గూడాలలోనే చనిపోయేవారు. జంగు ఎంపీపీగా ఉన్న సమయంలో ప్రపంచ బ్యాంకు నిధులు కోటి రూపాయలతో లక్ష్మీపూర్ సోనాపూర్, గట్రావ్ పెళ్లి మీదుగా దేవాపూర్ వరకు ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు చేశారు. రొట్టె పెళ్లి, చౌడి గూడా, తిరుమల పూర్,దొడ్డి గూడ గ్రామాలలో జన్మభూమి, పనికి ఆహార పథకం ద్వారా రహదారులు ఏర్పాటు చేశారు.

సాగునీటి పథకాలకు శ్రీకారం.

 ఎంపీపీ జంగు హాయంలో నిర్మించిన మల్కపల్లి గ్రామంలోని చెక్ డాం ద్వారా సాగుతున్న బీడు భూములు. 
మండలంలో సాగునీటి సదుపాయాలు లేక వేలాది ఎకరాల భూములు బీడు భూములుగా మారి  కరువు కాటకాలతో ఉండేది. సాగు భూములకు నీరందించేందుకు  మల్కపల్లి శివారులోని రాళ్లవాగు ప్రాజెక్టు, నర్సింగ్ సాగర్ కాల్వ పనులు తన హాయంలోనే ప్రారంభ మయ్యాయి.మల్కపెల్లి  గ్రామం నుండి రాళ్లవాగులో  వృధాగా వెళ్లే నీటికి అడ్డుకట్టగా  చెక్ డాం నిర్మించాడు. దీని ద్వారా ప్రస్తుతం 15 ఎకరాల వరకు భూమి సాగులోకి వచ్చి రైతులు వరి పంట పండించుకుంటున్నారు.

చదువు విలువ తెలిసి పిల్లలను ఉన్నత స్థానంలో నిలిపిన ఆదివాసినేత.

 దేశ రక్షణ కోసం ఆయుధాలు తయారు చేసే ఆర్డినెన్స్ కర్మాగారంలో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జంగు పెద్ద కొడుకు బీమ్ రావు  కుటుంబం 
సాధారణంగా ఆదివాసీల్లో చదువు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆదివాసీలు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ప్రభుత్వం లక్షలాది రూపాల వ్యయం చేసి ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసి ప్రోత్సహించిన అవగాహన లోపంతో ఆదివాసి కుటుంబాలు పిల్లలను చదివించలేక దారిద్రంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. సిడామ్ జంగు పటేల్ అప్పటి రోజుల్లో 5వ తరగతి వరకు చదువుకున్న చదువు విలువ తెలిసి తన నలుగురు పిల్లలు. ( ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు) పిల్లలను ఉన్నత చదువులు చదివించడం కోసం అహర్నిశలు కృషి చేశాడు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వాడుకున్నాడు. తన పెద్ద కొడుకు సిడాం భీమ్ రావు ను బీటెక్  వరకు చదివించి మండలంలోని మొట్టమొదటి ఆదివాసీ గిరిజన ఇంజనీరుగా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం భీమ్ రావు దేశ రక్షణ కోసం అవసరమయ్యే రక్షణ పరికరాలు తయారు చేసే మెదక్ జిల్లాలోని ఆర్డినెన్స్ కంపెనీలో  ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు సాగర్ భీమిని మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.

మండలంలో ఆదివాసి నేతగా  బహుజన వర్గాలకు సేవలందించి మండలానికి ఆదర్శంగా నిలిచిన సీడాంజంగు కు మండల ప్రజల తరఫున సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది.