Scv News Kasipet:--
కాసిపేట మండలంలో దేవాపూర్ కాసిపేట గ్రామాలలో ఈరోజు బాషా అంబేద్కర్ 66వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. కాసిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జడ్పిటిసి పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రం రావు , కాసిపేట సర్పంచ్ దేవి, ఎంపీటీసీ లక్ష్మి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షుడు జాడి రామచందర్ జెండాను ఎగురవేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ, మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి, బన్న ఆశాలు, శిలోజు మురళి,తెరాస మండల ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు, తెరాస నాయకులు అగ్గి సత్తయ్య, లంక లక్ష్మణ్, బుగ్గరాజు, రాపర్తి శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి గోడిసెల సురేందర్, లంక రాకేష్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
దేవాపూర్ లో కొవ్వొత్తుల ర్యాలీ.
దేవాపూర్ మేజర్ పంచాయతీలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి నూతనంగా చేయించిన స్టాండులను దేవాపూర్ మద్దిమడ సర్పంచులు తిరుమల అనంతరావు, అడే జంగులు ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తదనంతరం గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కార్యదర్శి వడ్లురీ నర్సయ్య , దేవపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గసికంటి మల్లేష్, మండల నాయకులు రామిళ్ళ కిష్టయ్య గడ్డం పురుషోత్తం, కొమ్ముల బాపు, వెంకటేష్, స్వామి, msp నాయకుడు కలవల శరత్,బుద్దిస్ట్ సో సైటీ సభ్యులు మనోహర్ కాంబ్లీ మహిళా సభ్యులంతా పాల్గొన్నారు.

