మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ కాసిపేట మండలవాసి రడపక సాహిత్.

 జాతీయ స్థాయి కరాటే

ఛాంపియన్ కాసిపేట

మండలవాసి రడపక

సాహిత్ కు scv News

అభినందనలు.


 

జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ ట్రోపీని అందుకుంటున్న కాసిపేట  మండల వాసి రడపాక సాహిత్.

Scv News Kasipet:---

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆదివారం విక్టరీ షాటో  కన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో  నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలో కాసిపేట మండల వాసి రడపాక సాహిత్ ఛాంపియన్ గా నిలిచాడు. మండలం లోని సోనాపూర్ లో పోస్ట్ మెన్ గా పని చేసే రడపాక భూమయ్య కుమారుడు సాహిత్ గతంలో కరాటే పోటీలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో బహుమతు లు గెలుచుకున్నారు. హైదరాబాదులో సీనియర్  బ్రౌన్ బెల్ట్ స్పారింగ్ విభాగం లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి టోర్నమెంట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ అవార్డ్ సాధించాడని కరాటే మాస్టర్ రంగు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకట నలో తెలిపారు.రాడపాక సాహిత్  జాతీయస్థాయి ఛాంపియన్గా నిలిచి కాసిపేట మండలానికి జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చినందుకు సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా గ్రూపు అభినందనలు తెలుపుతుంది. మండలం లోని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సాహిత్ ని అభినందించి ప్రోత్స హించాలని  కోరుతుంది.