మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట జూనియర్ కాలేజీలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

 సామాజిక చైతన్య వేదిక

ఆధ్వర్యంలో రాజ్యాంగ

దినోత్సవం.

 రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఉపన్యాస పోటీల్లో 
 విజేతగా నిలిచిన హర్షితకు బహుమతి అందజేస్తున్న సామాజిక చైతన్య వేదిక నాయకులు, కళాశాల ఇన్చార్జి మున్సిపల్ జ్యోతి కుమార్, లెక్చరర్లు.
 రాజ్యాంగం పై అవగాహన వ్యాసరచన పోటీలో విజేతగా నిలిచిన మేఘనకు బహుమతి అందచేస్తున్న సామాజిక చైతన్య వేదిక నాయకులు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ జ్యోతి కుమార్.

రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఉపన్యాస పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన  సాయి కిరణ్ కు బహుమతి అందజేసి


Scv News Kasipet:--

కాసిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఈరోజు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం జరిగింది.రాజ్యాంగదినోత్సవం పై విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలను నిర్వహించింది.



మొదట విద్యార్థులచే లెక్చరర్ భాగ్య భారత రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగ దినోత్సవం పై ఇన్చార్జి ప్రిన్సిపల్ జ్యోతి కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.


జ్యోతి కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఎన్నో హక్కులు పొంది స్వేచ్ఛగా జీవిస్తున్నాం అన్నారు. రాజ్యాంగంలోని హక్కుల విషయమై విద్యార్థులు అవగాహన పెంచు కోవాలన్నారు.

లెక్చరర్ భాగ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన హక్కుల విషయమై విద్యార్థులకు వివరించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడానికి ఏ అంశాలను ప్రతిపాదనలు తీసుకున్నాడు విద్యార్థులకు గుర్తు చేశారు.


సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం రాయడానికి బుద్ధుడు బోధించిన సమత ఆధారంగా తీసుకొని, అందరికీ సమానంగా హక్కులు ఉండాల ని  స్వేచ్ఛ, సమానత్వం  సౌబ్రాత్రుత్వం ప్రధాన లక్ష్యంగా రచించాడన్నారు.  రాజ్యాంగ చిహ్నాలుగా అశోకుడి ధర్మచక్రం, మూడు సింహాలను తీసుకున్నాడన్నారు.. భారత రాజ్యాంగాన్ని రాసేందుకు అంబేద్కర్ కు మనువాద బ్రాహ్మణ వర్గం ఎన్నో ఆటంకాలు కల్పించిందని విద్యార్థులకు వివరించారు. రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా రెండుసార్లు అడ్డుకున్నారని బ్రిటీష్ ప్రభుత్వం జోక్యంతోనే రాజ్యాంగ సభకు ఎన్నికై రాజ్యాంగాన్ని రచించాడని వివరించారు.


సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ  దేశంలో 72 సంవత్సరాలుగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన రాజ్యాంగ పలాలు కింది వర్గాలకు అందడం లేదన్నారు. దళిత వర్గాలకు ఇంకా న్యాయం జరగకుండా గ్రవర్ణాలు వేధింపులకు గురి చేస్తున్నాయని గుర్తు చేశారు. నేటి తరం బాబా సాహెబ్ కల్పించిన హక్కులను  రాజ్యాంగం ద్వారా తెలుసుకొని చైతన్యం పొందాలని కోరారు.


ముఖ్య సలహాదారులు మద్దినేని చిన్న భీమయ్య మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించా లంటే అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ఎక్కువ వినడము, పుస్తకాలు చదవడం చేయాలని అన్నారు. పెద్దలను గౌరవించ డం నేర్చుకోవాలన్నారు. అంబేద్కర్ ఎంతో కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదిగాడని అంబేద్కర్ జీవితాన్ని విద్యార్థులంతా చదవాలని కోరారు.
తదానంతరం  రాజ్యాంగంపై  అవగాహన కోసం నిర్వహించిన వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న  మేఘన, ద్వితీయ బహుమతి హర్షిత లు విజేతలుగా నిలిచారు ఉపన్యాస పోటీలలో ప్రథమ బహుమతి హర్షితకు, ద్వితీయ బహుమతి సాయి కిరణులను విజేత లుగా నిలిచారు. వీరికి కళాశాల ఇన్చార్జి జ్యోతి కుమార్, సామాజిక చైతన్య వేదిక నాయకులు పల్లె మల్లయ్య చిన్న భీమయ్య కొమ్ముల బాపు, కళాశాల లెక్చరర్లు రాజేశ్వరి, సత్య, భాగ్య, వెంకటస్వామి ప్రసాద్, రమేష్ లు అందజేశారు.