ఆన్ లైన్ మోసాలపై
ధర్మరావుపేట ఉన్నత
పాఠశాల విద్యార్థులకు
అవగాహన.
![]() |
| ధర్మారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ మోసాలపై టి జి బి ముత్యం పెళ్లి శాఖ బ్యాంక్ అధికారుల అవగాహన. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం ధర్మ రావుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముత్యం పెళ్లి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్ లైన్ లో జరిగే మోసాల గురించి అవగాహన కలిగించారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు జాతీయ సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ముత్యం పల్లి టి జి బి శాఖ మేనేజర్ రాజేష్ ప్రసాద్ ఆధ్వర్యం లో నిర్వహించారు. బ్యాంకులో జరిగే డిజిటల్ ఆన్లైన్ మోసాలు, బ్యాంకుల పనితీరు, ఖాతాదారుల సమస్యల పరిష్కారం ఫిర్యాదులు చేయవలసిన అధికారులు వివరాలు, టోల్ ఫ్రీ నెంబర్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిం చారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయుడు మండల విద్యాధికారి దామోదర్ రావు, ఉపాధ్యాయులు సురేష్, కరుణ శ్రీ, ఇతర ఉపాధ్యాయు లు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
