మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

Scv News కథనానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పందన

 దుబ్బగూడం ఇండ్లను 'రీ'

సర్వే చేయిస్తా నని ఎమ్మెల్యే

దుర్గం చిన్నయ్య హామీ.

 బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి తమ గోడును వినిపించిన దుబ్బగూడం పునరావస కాలనీ బాధితులు.

Scv News Kasipet :---

 కళ్యాణి ఖని ఓపెన్ కాస్ట్ లో ముంపునకు గురవుతున్న కాసిపేట మండలం దుబ్బగూడం గ్రామంలో ఇండ్ల పరిహారంలో జరిగిన అవక తవకలపై రెవెన్యూ అధికారులచే  విచారణ జరిపి రీ సర్వే చేసి బాధితులు అందరికీ న్యాయం చేస్తానని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హామీ ఇచ్చారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి దుబ్బ గూడెం బాధితులు వెళ్లి తమ గోడును ఎమ్మెల్యేకు వినిపించారు. బాధితులు నిన్న 'scv news ' లో వచ్చిన 'పరిహారం చెల్లింపులో దుబ్బగూడం వాసులకు జరిగిన అన్యాయం ' కథనాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. బోగస్ ఇండ్ల కు వచ్చిన పరిహారం విషయమై, స్థానికంగా నివసిస్తున్న వారికి వచ్చిన పరిహారం తేడాను బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు.ఎమ్మెల్యే స్పందించి  బోగస్ ఇండ్ల వ్యవహారంపై విచారణ జరిపించి గ్రామంలో అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటా నని ఎవరు అధైర్య పడవద్దని బాధితులకు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో ఎండి రఫీ, కలాలి రామకృష్ణ, సల్లూరి శాంత, జై నీ అమ్మక్క, జుమ్మిడి వెంకట్ రాజ్ బొజ్జ లలిత తదితరులు ఉన్నారు.