మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో వేతనాల కోసం సెల్ టవర్ ఎక్కిన ఉపాధ్యాయుడు.

 దేవాపూర్ లో వేతనాల

కోసం సెల్ టవర్ ఎక్కిన

ఉపాధ్యాయుడు.


 దేవాపూర్ మెయిన్ గేట్ ముందు విద్యార్థులు ఉపాధ్యాయులు ఆందోళన


 ఉపాధ్యాయులకు మద్దతుగా విద్యార్థుల ఆందోళన.



 వేతనాల కోసం టవర్ ఎక్కిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్.


Scv News Kasipet:--

మంచిర్యాల జిల్లా కాసిపేట  మండలం దేవాపూర్ కాలనీలోని ఓరియంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డి ఏవి పాఠశాల యాజమాన్యం రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, ప్రధానోపాధ్యాయుడు వేధింపులు భరించలేక  శనివారం ఉదయం  పాఠశాల పిఈటిగా పనిచేసే ఎలుక శ్రీనివాస్ ఉపాధ్యాయుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. తనకు మద్దతుగా పాఠశాలలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తరగతులు బహిష్కరించి ఓరియంట్ మెయిన్ గేటు ముందు  ఆందోళనకు దిగారు.

 దేవపూర్ ఓరియంట్ కాలనీలో యాజమాన్యం ఆధ్వర్యంలో గత 40 ఏళ్లుగా కార్మల్ గిరి యాజమాన్యం పాఠశాలను నడిపింది.ఆ పాఠశాలలో గత 35 సంవత్సరాలుగా 34 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు విద్యా బోధన చేసేవారు. సెప్టెంబర్ నెల నుండి ఓరియంట్ యాజమాన్యం కార్మల్ గిరి యాజమాన్యాన్ని తొలగించి ఢిల్లీకి చెందిన దయానంద్ ఆంగ్ల వేదిక్ DAV పాఠశాల యాజమాన్యానికి అప్ప చెప్పింది. గత రెండు నెలలుగా ఉన్నత పాఠశాల డిఏవి ఆధ్వర్యంలో నడుస్తుంది.అప్పటినుండి 34 మంది ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించడంలేదు.నెలలో అడ్వాన్సుగా 15 వేలు మాత్రమే చెల్లించారాని సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వేతనాలు చెల్లించలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. వేతనాల విషయంలో  పాఠశాల  ప్రధానోపాధ్యాయుడు కిరణ్ కుమార్  వద్దకు వెళ్లిన ఉపాధ్యాయు లపై ప్రధానోపాధ్యాయుడు దురుసుగా వ్యవహరించి అసభ్యంగా మాట్లాడా రని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు మాటలకు  కలత చెందిన పిఈటి శ్రీనివాస్ ఓరియంట్ ఆవరణలోని సెల్ టవర్ ఎక్కాడని ఉపాధ్యాయులు తెలిపారు.

అతనికి మద్దతుగా భద్రత కల్పించా లని గతంలో కార్మెల్ గిరి యాజమా న్యం ఇచ్చినట్లు వేతనాలు చెల్లించాల ని ఓరియంట్ ప్రధాన గేటు ముందు కూర్చుని ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయు లు మాట్లాడుతూ నూతనంగా బాధ్యత లు చేపట్టిన డిఏవి యాజమాన్యం 34 మంది ప్రైవేటు ఉపాధ్యాయులను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని తీసుకు నేందుకు కుట్రలు చేస్తుందని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పొమ్మనలేక   పొగ పెట్టిన చందంగా చిన్న చిన్న కారణాలకు వేధింపులకు గురి చేస్తూ గైర్హాజర్ పేరట ఉపాధ్యా యులను తొలగిస్తున్నారని ఆరోపిస్తు న్నారు.సమయపాలన లేకుండా ఉదయం 8 గంటలనుండి సాయంత్రం ఏడు గంటల వరకు పాఠశాలలోనే ఉండాలని వేధింపులకు గురి చేస్తున్నాడని ఉపాధ్యాయులు తెలిపారు. ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేక సంధ్య అనే టీచర్ అనారోగ్య గురై గైరాజలైతే ఉద్యోగం నుండి తొలగించాడని తెలిపారు. వేతనాలలో 70 శాతం కోత విధిస్తు న్నారని, ఇప్పటికీ తమకు ఉద్యోగ భద్రత కల్పించలేదని తెలిపారు. తమకు ఉద్యోగ బాధ్యత కల్పించి గతంలో యాజమాన్యం ఇచ్చిన విధంగానే వేతనాలు చెల్లించాలని 2008 నుండి పిఆర్సి బకాయిలు చెల్లించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.

ఉపాధ్యాయుల సమస్యలపై ఓరియంటి యాజమాన్యం చర్చలు ప్రారంభించింది. తమకు లిఖితపూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని ఉపాధ్యాయులు తెలిపారు. ఓరియంటి యాజమాన్యం, దేవపూర్ ఎస్సై విజేందర్  ఉపాధ్యాయులను నచ్చజెప్పి టవర్ పై నుండి శ్రీనివాస్ టీచర్ ను దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపాధ్యాయులకు మద్దతుగా పాఠశాల విద్యార్థులు ఓరియంట్ కార్మికులు, దేవాపూర్ గ్రామస్తులు మెయిన్ రోడ్డు ముందు ఆందోళనకు దిగడంతో దేవాపూర్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓరియంట్ యాజమాన్యం జోక్యం చేసుకొని ఉపాధ్యాయుల రెండు నెలల వేతనం చెల్లించి పాఠశాలను సక్రమంగా నడిపించే విధంగా చూడాలని దేవాపూర్ వాసులు   కోరుతున్నారు.