ఫార్మసీలో ప్రథమ శ్రేణిలో
ఉత్తీర్ణురాలైన దేవాపూర్
వాసి వడ్లూరి ప్రత్యూష.
![]() |
| ఫార్మా -డీ ఇంటర్నషిప్ పట్టాను పొందుతున్న వడ్లూరి ప్రత్యూష. |
![]() |
| తల్లిదండ్రులతో ప్రత్యూష. |
![]() |
| ఫార్మా డి లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైన వడ్లూరి ప్రత్యూష |
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో పర్మనెంట్ కార్మికుడిగా పనిచేసే తెరాస పట్టణ అధ్యక్షుడు వడ్డూర్ మల్లేష్ కుమార్తె ప్రత్యూష ఫార్మా - డి పరీక్షల్లో జేఎన్టీయూ హైదరాబాదులో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణురాలయింది. మల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో ఫార్మా ఇంటర్నషిప్ ఇటీవల విజయవంతంగా పూర్తి చేసింది. ఈరోజు మల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో స్నాతకోత్సవ సందర్భంగా వడ్లూరి ప్రత్యూష వారి తల్లిదండ్రుల సమక్షంలో ఫార్మ- డి పట్టాను పొందారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఫార్మా - డి విద్యార్థులు క్లినికల్ ఫార్మసిస్టులుగా విధులు నిర్వర్తించ వచ్చని గెజిట్ జారీ చేసింది. మారుమూల దేవాపూర్ ప్రాంతానికి చెందిన వడ్లూరి ప్రత్యూష ఫార్మా - డి ఇంటర్నషిప్ పూర్తిచేసి కాసిపేట మండలానికి గుర్తింపు తెచ్చినందుకు మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.


